
'దావూద్ అనుచరులకు దర్శనం కల్పించిన మాట వాస్తవమే'
తిరుపతి: తిరుమల కొండకు వచ్చే భక్తులు ధర్మాన్ని పాటించాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. భక్తులపై కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. భవిష్యత్తులో ఇక ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు భక్తితో పాటు ధర్మాన్ని కూడా పాటించాలన్నారు. మాఫియా డాన్ దావూద్ అనుచరులకు దర్శనం కల్పించిన మాట వాస్తవమేనని బాపిరాజు తెలిపారు.అయితే వారు దావూద్ అనుచరులను తమకు తెలియదన్నారు. మహరాష్ట్ర మంత్రితో వచ్చారు కాబట్టి వారికి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పించామన్నారు.