ఒకే ఒక్కడు...ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్ | Kanumuri Bapiraju got offer second term as Narasapuram mp seat! | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు...ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్

Published Sat, Apr 5 2014 10:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఒకే ఒక్కడు...ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్ - Sakshi

ఒకే ఒక్కడు...ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్

*కాంగ్రెస్‌కు జిల్లాలో ఏకైక అభ్యర్థి కనుమూరి
*నిస్తేజమైన పార్టీకి పరమ భక్తుడిగా గుర్తింపు
* ఆఫర్‌లో నరసాపురం ఎంపీ టికెట్
 

 రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్క సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాత్రమే మిగిలారు. సమైక్యాంధ్ర ద్రోహిగా, కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా పేరు సంపాదించుకున్న బాపిరాజుకే ఈసారి నరసాపురం ఎంపీ టికెట్‌ను ఆ పార్టీ కేటాయించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో  కాంగ్రెస్ తరఫున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి బాపిరాజు పోటీచేయనున్నారు.

పెద్ద మీసాలు అలంకారానికే తప్ప విభజన విషయంలో తానేమీ చేయలేనని అప్పట్లోనే ఆయన ఒప్పుకోవడం గమ నార్హం. రాష్ట్రం ముక్కలవుతుంటే ఎంపీగా ఉండి కూడా తానేమి చే యలేనని చేతులెత్తేసిన ఘనత బాపిరాజుకే చెందుతుందని ఆ పార్టీనేతలే విమర్శించారు. అలాంటి వ్యక్తి మినహా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వేరే దిక్కులేకుండా పోయింది.

ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్

మునిసిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి నిలబడే అభ్యర్థులే కరువయ్యారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతానికి అభ్యర్థులు లేకపోవడంతో పార్టీని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్న బాపిరాజు పేరును ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లోనూ నరసాపురం ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని కనుమూరి చెబుతున్నారు.

ఒన్ ఫ్లస్ ఒన్ ఆఫర్‌లో సీటు సంపాదించిన బాపిరాజుకు నియోజకవర్గంలో కొంచెం కూడా ఆదరణ లేకపోవడం విశేషం. 2009లో కేవలం వైఎస్ ప్రభంజనంతోనే కనుమూరి నరసాపురం ఎంపీగా గెలుపొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గానూ నియమితులయ్యారు. పదవులు పొందడం మినహా నియోజకవర్గానికి ఆయన చేసిందేమి లేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
Advertisement