narasapuram mp seat
-
ఎంపీ పదవి వారి గడప దాటలేదు..!
తాడేపల్లిగూడెం: నరసాపురం ఎంపీ పదవి ఆ కుటుంబీకుల గడప దాటలేదు. అయితే బావ, లేకపోతే బామ్మర్ధి అన్న విధంగా రక్త సంబంధాలు, విడదీయరాని బంధుత్వాలు కలిగిన గోకరాజు, కనుమూరి కుటుంబాలకే ఎంపీ పదవి ఉండిపోయింది. ప్రస్తుత నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు (ఆయన పదవీ కాలం ఈ నెల 30 వరకు ఉంది) నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన అవకాశంతో బాపిరాజు తొలిసారిగా 1996లో కొత్తపల్లి సుబ్బారాయుడుపై పోటీ చేసి ఎంపీగా తొలి ఓటమిని చవిచూశారు. తర్వాత 1998లో తిరిగి పోటీచేసి విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తాజా ఎన్నికలలో ఆయన బావమర్ది గోకరాజు గంగరాజు ఎంపీగా తిరుగులే ని ఆధిక్యాన్ని సాధించారు. దీంతో నరసాపురం పదవి వారి గడపదాటనట్టయ్యింది. బాపిరాజుకు మామ ఇంటినుంచి పదవీ వారసత్వం వచ్చినట్టు చెబుతారు. మామ మాదిరిగానే టీటీడీ చైర్మన్ పదవిని బాపిరాజు పొందారు. ఎంపీ పదవిని ఇప్పటి వరకు అనుభవించిన ఆయన ఎన్నికలలో ఓటమి ద్వారా ఆ పదవి బావమర్దికి దక్కడంతో పదవి వారి గడప దాటనట్టయింది. -
మరో పార్టీలోకి రఘురామ కృష్ణంరాజు జంప్
ఏలూరు : నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజు మరోసారి పార్టీ మారారు. ఈసారి ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నరసాపురం లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఉదయం రఘురామ కృష్ణంరాజు ఏలూరులో మంతనాలు జరిపారు. కాగా నరసాపురం ఎంపీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న రఘురామ కృష్ణంరాజుకు బీజేపీ మొండిచెయి చూపించటంతో ఆయన సైకిల్ ఎక్కారు. కాగా మూడు వారాలు తిరగకుండానే మూడో పార్టీలోకి రఘురామ కృష్ణంరాజు జంప్ కావటం విశేషం. -
ఒకే ఒక్కడు...ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్
*కాంగ్రెస్‌కు జిల్లాలో ఏకైక అభ్యర్థి కనుమూరి *నిస్తేజమైన పార్టీకి పరమ భక్తుడిగా గుర్తింపు * ఆఫర్లో నరసాపురం ఎంపీ టికెట్ రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్క సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాత్రమే మిగిలారు. సమైక్యాంధ్ర ద్రోహిగా, కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా పేరు సంపాదించుకున్న బాపిరాజుకే ఈసారి నరసాపురం ఎంపీ టికెట్‌ను ఆ పార్టీ కేటాయించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి బాపిరాజు పోటీచేయనున్నారు. పెద్ద మీసాలు అలంకారానికే తప్ప విభజన విషయంలో తానేమీ చేయలేనని అప్పట్లోనే ఆయన ఒప్పుకోవడం గమ నార్హం. రాష్ట్రం ముక్కలవుతుంటే ఎంపీగా ఉండి కూడా తానేమి చే యలేనని చేతులెత్తేసిన ఘనత బాపిరాజుకే చెందుతుందని ఆ పార్టీనేతలే విమర్శించారు. అలాంటి వ్యక్తి మినహా కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో వేరే దిక్కులేకుండా పోయింది. ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్ మునిసిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి నిలబడే అభ్యర్థులే కరువయ్యారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతానికి అభ్యర్థులు లేకపోవడంతో పార్టీని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్న బాపిరాజు పేరును ఖరారు చేశారు. 2019 ఎన్నికల్లోనూ నరసాపురం ఎంపీ టికెట్ తనకే ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని కనుమూరి చెబుతున్నారు. ఒన్ ఫ్లస్ ఒన్ ఆఫర్లో సీటు సంపాదించిన బాపిరాజుకు నియోజకవర్గంలో కొంచెం కూడా ఆదరణ లేకపోవడం విశేషం. 2009లో కేవలం వైఎస్ ప్రభంజనంతోనే కనుమూరి నరసాపురం ఎంపీగా గెలుపొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గానూ నియమితులయ్యారు. పదవులు పొందడం మినహా నియోజకవర్గానికి ఆయన చేసిందేమి లేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.