మరో పార్టీలోకి రఘురామ కృష్ణంరాజు జంప్
ఏలూరు : నామినేషన్ల గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజు మరోసారి పార్టీ మారారు. ఈసారి ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నరసాపురం లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఈరోజు ఉదయం రఘురామ కృష్ణంరాజు ఏలూరులో మంతనాలు జరిపారు. కాగా నరసాపురం ఎంపీ టికెట్పై ఆశలు పెట్టుకున్న రఘురామ కృష్ణంరాజుకు బీజేపీ మొండిచెయి చూపించటంతో ఆయన సైకిల్ ఎక్కారు. కాగా మూడు వారాలు తిరగకుండానే మూడో పార్టీలోకి రఘురామ కృష్ణంరాజు జంప్ కావటం విశేషం.