ఎంపీ పదవి వారి గడప దాటలేదు..!
తాడేపల్లిగూడెం: నరసాపురం ఎంపీ పదవి ఆ కుటుంబీకుల గడప దాటలేదు. అయితే బావ, లేకపోతే బామ్మర్ధి అన్న విధంగా రక్త సంబంధాలు, విడదీయరాని బంధుత్వాలు కలిగిన గోకరాజు, కనుమూరి కుటుంబాలకే ఎంపీ పదవి ఉండిపోయింది. ప్రస్తుత నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు (ఆయన పదవీ కాలం ఈ నెల 30 వరకు ఉంది) నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు.
ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన అవకాశంతో బాపిరాజు తొలిసారిగా 1996లో కొత్తపల్లి సుబ్బారాయుడుపై పోటీ చేసి ఎంపీగా తొలి ఓటమిని చవిచూశారు. తర్వాత 1998లో తిరిగి పోటీచేసి విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తాజా ఎన్నికలలో ఆయన బావమర్ది గోకరాజు గంగరాజు ఎంపీగా తిరుగులే ని ఆధిక్యాన్ని సాధించారు.
దీంతో నరసాపురం పదవి వారి గడపదాటనట్టయ్యింది. బాపిరాజుకు మామ ఇంటినుంచి పదవీ వారసత్వం వచ్చినట్టు చెబుతారు. మామ మాదిరిగానే టీటీడీ చైర్మన్ పదవిని బాపిరాజు పొందారు. ఎంపీ పదవిని ఇప్పటి వరకు అనుభవించిన ఆయన ఎన్నికలలో ఓటమి ద్వారా ఆ పదవి బావమర్దికి దక్కడంతో పదవి వారి గడప దాటనట్టయింది.