Gokaraju Ganga Raju
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు ఆదిత్య వర్మ, సాయి సంజనలను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్ -
అయోధ్య రామమందిరం: చరిత్రలో లిఖించదగ్గ రోజు
సాక్షి, విజయవాడ : అయోధ్యలో నేడు రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం సంతోషదాయకమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రతి భారతీయ పౌరుడు కోవిడ్-19 నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. బుధవారం అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ భూమి పూజ నేపథ్యంలో విజయవాడ విశ్వహిందు పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరం నిర్మించటం శుభపరిణామమన్నారు.(అయోధ్య అప్డేట్స్; హనుమాన్ గడీలో ప్రధాని) ‘రామమందిరం నిర్మాణం కోసం 7 సార్లు పోరాటాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం నిర్మాణం కోసం ఈ రోజు భూమి పూజ చేసుకోవటం హర్షించదగ్గ విషయం. 1984లో విశ్వహిందు పరిషత్ రామమందిరం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1992 డిసెంబర్ 6వ తేదీన జరిపిన కర సేవ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది మందిగా కర సేవలో పాల్గొన్నారు. తాత్కాలిక రామమందిరం ఏర్పాటు చేసి బాలరాముడిని అందులో ప్రతిష్టించారు’. అని గోకరాజు గంగరాజు తెలిపారు. (అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు) కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా బీజేపీ శ్రేణులు విజయవాడలో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్సి, స్వీట్లు పంచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారత దేశ ప్రజల చిరకాల వాంఛ అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రాజు అన్నారు. రాముని జన్మ స్థలంలో రామాలయం నిర్మించడం శుభపరిణామమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. భారత సంస్కృతిని విదేశీయులు నాశనం చేశారని, ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి భారతదేశానిదని పేర్కొన్నారు. (అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం.) ‘ప్రపంచానికే భారత్ ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి నేర్పిర్పించిన దేశం. భారతదేశంలో పురాతనమైన దేవాలయాలకు పునర్వైభవం ప్రధాని మోడీ తీసుకువస్తారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్య స్థలాలు నదుల నుంచి మట్టి నీరు తెచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. భరతదేశ చరిత్రలో ఈ రోజు లిఖించ దగ్గ రోజు’. అని శ్రీనివాస్ రాజు అన్నారు. -
దాతల విస్మరణ.. మాజీల భజన..!
సాక్షి, కడప: కన్న వారిని.. ఉన్న ఊరిని మరిచిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాయం చేసిన వారిని గుర్తుంచుకుంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కడప నగరంలో ఎకరా రూ.1 వెయ్యి చొప్పున 11 ఎకరాలు కేటాయించడంతో పాటు, సొంత నిధులను రూ.50 లక్షలు వెచ్చించి వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ మైదానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని నిర్వహించడానికి జిల్లా క్రికెట్ సంఘం పెద్దలకు మనసు రాకపోగా.. ఏసీఏ మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌లు కట్ చేసి వేడుకలు నిర్వహించడం క్రికెట్ సంఘంలో కొనసాగుతున్న విపరీత పోకడలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానేత, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కడప నగరంలో ఉన్నత ప్రమాణాలతో స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. దీంతో ఆంధ్రా క్రికెట్ సంఘం పెద్దలతో సంప్రదించడంతో పాటు ఎంతో విలువైన భూములను ఎకరా కేవలం రూ. వెయ్యి చొప్పున 11.62 ఎకరాలను ఏసీఏ వారికి అప్పజెప్పారు. దీంతో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల సొంత నిధులను ఏసీఏకి అందించారు. వైఎస్ఆర్ మరణానంతరం 2011లో కడప నగరంలో క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. ఈ మైదానానికి వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానం అని నామకరణం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. మహానేత గుర్తులు మాయం.. అయితే ఇంతసాయం చేసిన మహానేత చిత్రపటం కానీ, విగ్రహం ఏర్పాటు చేసేందుకు క్రికెట్ సంఘం పెద్దలకు మనసురాలేదు. దీనికి తోడు ఎక్కడా కూడా వైఎస్ రాజారెడ్డి స్టేడియం అన్న విషయం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై జూన్ నెల 21న ‘దాతలను విస్మరించడం తగునా’ అంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు మొక్కుబడిగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. త్వరలోనే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్పితే ఆచరణలోకి మాత్రం ఇంకా రాలేదు. కనీసం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేయడానికి క్రికెట్ సంఘం పెద్దలకు మనసు రాకపోవడం విచారకం. అయితే మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజుకు సంబంధించి చిత్రపటాలు మాత్రం ఏసీఏ కార్యాలయాల్లో నేటికీ దర్శనమిస్తుండటం గమనార్హం. ఈయన చిత్రపటం ఉండటం ఆక్షేపణీయం కానప్పటికీ దాతల చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. ఘనంగా గోకరాజు జన్మదిన వేడుకలు. .స్టేడియం అభివృద్ధికి పాటుపడిన వారిని విస్మరించి తమకిష్టమైన వారి భజనలో మునిగితేలుతున్నారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ స్టేడియంలోని స్కూల్ ఆఫ్ అకాడమీలో గోకరాజు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ఏసీఏ సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఏసీఏ మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు 76వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెటర్ల చేతుల మీదుగా కేక్ కట్ చేసి, మైదానం ఆవరణలో మొక్కలు నాటడం గమనార్హం. గోకరాజు గంగరాజు అందించిన సేవలపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలకు అభిమానం ఉంటే ఆయన వేడుకలను నిర్వహించుకోవడం అభ్యంతరం లేనప్పటికీ, ఇటీవల వైఎస్సార్ జయంతి సందర్భంగా కనీసం ఆయనను స్మరించుకున్న దాఖలాలు లేకపోవడం మహానేత అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. జిల్లాకు చెందిన వ్యక్తి, మైదానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మహానేతను స్మరించుకునేందుకు మనసు రాలేదా అని క్రికెట్ సంఘంలోని మరోవర్గం ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా క్రికెట్ సంఘం పెద్దలు వివక్షతను విడనాడి దాతల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
అనుమతి లేకుండా ఎలా కట్టారు?
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట లోపల అనుమతి లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలకు సీఆర్డీఏ సమాయత్తమైంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణా నది నుంచి వంద మీటర్లలోపు నిర్మించిన భవనాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. సుమారు 50 నిర్మాణాల్ని గుర్తించిన సీఆర్డీఏ అధికారులు వాటిలో 35 వరకూ అనుమతుల్లేకుండా నిర్మించినవేనని ఇప్పటివరకు నిర్ధారించారు. 28 నిర్మాణాలకు నోటీసులివ్వాలని నిర్ణయించిన అధికారులు శుక్రవారం పది భవనాలకు నోటీసులు పంపించారు. మిగిలిన వాటికి శనివారం నోటీసులు పంపనున్నారు. శుక్రవారం నోటీసులు పంపిన భవనాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథిగృహం కూడా ఉంది. ఎటువంటి అనుమతుల్లేకుండా కృష్ణా నది నుంచి వంద మీటర్ల లోపు జీ+1 భవనాన్ని రమేష్ నిర్మించినట్లు గుర్తించిన సీఆర్డీఏ నోటీసులిచ్చేందుకు ఆయనకు రెండుసార్లు ఫోన్ చేయగా స్పందించలేదని తెలిసింది. దీంతో విజయవాడలోని లింగమనేని ఎస్టేట్స్ కార్యాలయానికి వెళ్లి నోటీసులిచ్చేందుకు ప్రయత్నించినా అక్కడెవరూ తీసుకునేందుకు సిద్ధపడకపోవడంతో ఉండవల్లిలోని అక్రమ నిర్మాణం వద్దకే వెళ్లి అక్కడి గోడకు నోటీసు అంటించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ ఆ నోటీసులో పేర్కొంది. అన్ని చట్టాలు ఉల్లంఘించి.. తమ అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్ 2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి కేపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్‌కు–2016కి విరుద్ధంగా లింగమనేని నిర్మాణాలున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. నేల మీద, మొదటి అంతస్తులో ఆర్సీసీ నివాస భవనం, నేల అంతస్తులో ఆర్సీసీ గది, హెలీప్యాడ్ నిర్మాణాల్ని కృష్ణా నది నుంచి వంద మీటర్లలోపు నిర్మించారని, ఇవికాక అనుమతి లేకుండా పది తాత్కాలిక షెడ్లను నిర్మించారని అధికారులు తెలిపారు. వారంలోపు నోటీసుపై స్పందించి సంజాయిషీ ఇవ్వనిపక్షంలో తగిన చర్య తీసుకుంటామని, ఒకవేళ సంజాయిషీ సరిగా లేకపోయినా చర్య తప్పదని నోటీసులో స్పష్టం చేశారు. లింగమనేని రమేష్ భవనంతోపాటు పది భవనాలకు సీఆర్డీఏ సెక్షన్ 115(3) ప్రకారం శుక్రవారం నోటీసులిచ్చిన సీఆర్డీఏ అధికారులు సంజాయిషీ ఇవ్వకున్నా, ఇచ్చిన సంజాయిషీ సరిగా లేకున్నా సెక్షన్ 115(2) మేరకు తొలగింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనుమతుల్లేని భవన యజమానుల జాబితా చందన కేదారేశ్వరరావు ఏ అనుమతుల్లేకుండానే జీ+2 అతిథిగృహం, బీజేపీకి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రెండు అతిథిగృహాలు నిర్మించినట్లు గుర్తించారు. లోటస్ హోటల్, ఫిషర్మెన్ అసోసియేషన్, గణపతి సచ్చిదానంద ఆశ్రమం, శ్రీ రెడ్డి, ఇస్కాన్ టెంపుల్, సాగర్ మినరల్ వాటర్ ప్లాంట్, సుంకర శివరామకృష్ణ, సత్యానంద ఆశ్రమం, అక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పాతూరి సుధారాణి, తులసి గార్డెన్స్, వేదాద్రి మహర్షి తపోవనం, డాక్టర్ మాగంటి ప్రసాద్, లక్ష్మీనారాయణ, నకంటి వెంకట్రావు, సీహెచ్ వేణుగోపాలరావు, చిగురు అనాథ బాలల ఆశ్రమం, సిటీ కేబుల్ మధుసూదనరావు, ఎం.సత్యనారాయణ, మత్స్యకారుల అసోసియేషన్, శివక్షేత్రంలో అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. మందడం, ఉద్ధండరాయునిపాలెం గ్రామాల పరిధిలో మరికొన్ని ఇళ్లు కూడా అనధికారికంగా నిర్మించినట్లు గుర్తించారు. వీటిలో కొన్నింటికి పంచాయతీ అనుమతులు, ఇతర అనుమతులున్నా స్థూలంగా నదీ పరిరక్షణ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు వ్యతిరేకంగానే ఉన్నాయని నిర్ధారించారు. వీటిలో కొన్నింటికి ఇప్పటికే నోటీసులిచ్చిన సీఆర్డీఏ అధికారులు సోమవారంలోపు మిగిలిన వాటికి ఇవ్వనున్నారు. చంద్రబాబు నివాసం వద్ద హైడ్రామా తాడేపల్లి రూరల్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడమైన లింగమనేని రమేష్ అతిథిగృహానికి నోటీసులు జారీ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు శుక్రవారం అక్కడకు చేరుకున్న సందర్భంగా వారిని తొలుత లోపలికి అనుమతించలేదు. దీంతో దాదాపు గంటన్నరపాటు హైడ్రామా నెలకొంది. సదరు ఇంటి యజమాని అయిన లింగమనేని రమేష్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి లోపలకు వెళ్లాలని అడగ్గా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు చాలాసేపు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. నోటీసులివ్వడానికి వచ్చిన సీఆర్డీఏ అధికారులను లోపలకి అనుమతించట్లేదంటూ మీడియాలో ప్రచారం జరగడంతో.. వెనక్కి తగ్గిన సిబ్బంది ఎట్టకేలకు సీఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డిని, ఆయన వాహనాన్ని, మరో సీఆర్డీఏ అధికారిని లోపలికి అనుమతించారు. మొదట బిబి2 గేటు వద్ద నోటీసు అంటించిన నరేంద్రనా«థ్‌రెడ్డి ఉన్నతాధికారులతో ఫోనులో మాట్లాడారు. చంద్రబాబు నివాసం ఉండే ప్రధాన గేటుకు అంటించమని సూచించడంతో మరికొంతసేపు హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు నరేంద్రనాథ్‌రెడ్డి ప్రధాన గేటు వద్ద కూడా నోటీసు అంటించి తన వాహనంలో విజయవాడకు తిరిగి వెళ్లిపోయారు. క్షుణ్ణంగా పరిశీలించి.. న్యాయ సలహా తీసుకున్నాకే నోటీసులు నోటీసులివ్వడానికి ముందు ఆయా భవనాల పరిస్థితిని సీఆర్డీఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ప్రదేశాల్లో ఏ భవనాలు, ఎన్ని అంతస్తులు, ఎన్ని షెడ్లు, ఇతర నిర్మాణాలున్నాయో పరిశీలించారు. వాటిలో కొన్నింటికి అనుమతులున్నట్లు చెబుతుండడంతో అవి ఎలాంటి అనుమతులో పరిశీలించారు. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్నాక సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, అడ్వొకేట్ జనరల్‌తో సంప్రదించి పక్కాగా నోటీసులు రూపొందించారు. కొన్ని భవనాలకు పంచాయతీలు అనుమతులివ్వగా, కొన్నింటికి గతంలోని ఉడా పరిమితమైన అనుమతులిచ్చినట్లు, మరికొన్నింటికి నిరభ్యంతర పత్రాలున్నట్లు గుర్తించారు. అయితే ఏదో చిన్నవాటికి అనుమతులు తీసుకుని ఆ ముసుగులో భారీ కట్టడాలు నిర్మించినట్లు తేల్చారు. -
‘ఆ భావన తీసుకొచ్చేందుకే చంద్రబాబు కృషి’
సాక్షి, ఏలూరు/పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదనే భావన తీసుకొచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేతలు మండిపడ్డారు. టీడీపీ అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం’లో కేంద్ర పథకాలను వివరించాలని కోరారు. అశోక్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. పూటకో పార్టీతో పొత్తుకునే చంద్రబాబు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీపై నెట్టాలని చూస్తున్నారని ద్వజమెత్తారు. ఆయన సత్తా తేలిపోయింది.. రాబోయే కాలంలో నుంచి 7 నుంచి 8 మంది మంత్రులు, 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడబోతున్నారని మాణిక్యాలరావు అన్నారు. చంద్రబాబు సత్తా ఏమిటో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయిందనీ, ఆయనకు ప్రజలు తగిన బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. ‘రాఫెల్ ఒప్పందంలో అబద్ధాన్ని పదేపదే చెప్పి రాహుల్ ప్రజల్ని నమ్మించే యత్నం చేశారు. అందుకే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాఫెల్ పేరుతో కాంగ్రెస్ కుట్రకు పాల్పడిందనే అనుమానాలు కలుగుతున్నాయి’అని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని అభూత కల్పనలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. తెలంగాణలో మాదిరిగానే 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభావం తప్పదని జోస్యం చెప్పారు. ఏపీలో కూడా మహా కూటమికి ఘోర పరాజయం పాలవుతుందన్నారు. -
కేంద్రం నిధులు ఇవ్వకుంటే వృద్ధి ఎలా సాధించారు?
-
హోదా గురించి మోదీ మాట్లాడలేదు
సాక్షి, విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ధర్మపోరాట దీక్షపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. తిరుపతి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. మోదీ వ్యాఖ్యలను చంద్రబాబు పూర్తిగా వక్రీకరిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చంద్రబాబు నిలువరించారని ఆరోపించారు. చంద్రబాబు మంచి పాలన అందిస్తారనే నమ్మకంతోనే ఆయనతో కలిసి పనిచేయాలని భావించినట్లు చెప్పారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని ఎంపీ గోకరాజు గంగరాజు అభిప్రాయపడ్డారు. -
'అలా పిలిస్తే.. మంత్రి అయినా శిక్షించాల్సిందే'
విజయవాడ: పోలీసులను రేయ్ అని పిలవడం మంచిదికాదనీ, అలా పిలిస్తే మంత్రి అయినా సరే శిక్షించాల్సిందేనని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఆలయాలు తొలగించడం సరికాదన్నారు. గతంలో ముస్లిం రాజులు ఏ విధంగా ఆలయాలు తొలగించారో.. ఇప్పుడు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీని వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. దీనిని వ్యతిరేకించినవారిని బెదిరిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడడం సరికాదని గోకరాజు గంగ రాజు తెలిపారు. ఇదిలా ఉండగా, గోదావరి పుష్కర పనుల్లో ప్రొక్లెయినర్ పెట్టి దేవుడి విగ్రహాలు తొలగించారని శివస్వామి ఆరోపించారు. అదే ప్రదేశంలో భక్తులు కూడా మృతిచెందినట్టు చెప్పారు. విజయవాడలో ఒక్క ఆలయం నుంచి ఒక ఇటుక తొలగించినా ఊరుకోమని అన్నారు. ఇప్పటివరకూ తొలగించిన ఆలయాలను అక్కడే నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆలయాల కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమని శివస్వామి స్పష్టం చేశారు. -
ఏసీఏ కార్యదర్శిగా గంగరాజు
విజయవాడ స్పోర్ట్స్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో ఏసీఏ 62వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 2019 వరకు కొనసాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డీవీఎస్ఎస్ సోమయాజులు తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రంగరాజు, యాచేంద్ర, శివారెడ్డి, సుబ్బరాజు, జీజేజే రాజు, త్రినాథ్ రాజు, సునీల్ రత్నకుమార్, రామచంద్, ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్.అరుణ్‌కుమార్, కోశాధికారిగా రెహమాన్ ఎన్నికయ్యారు. టీఎన్‌సీఏ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా... ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ 14వ సారి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన 85వ వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీని ఎంపికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. -
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా
-
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా
ఏలూరు: కోడిపందాలు ఆడుతు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ ఎంపీలు పోలీసులను డిమాండ్ చేశారు. నేతల అరెస్ట్‌కు నిరసనగా మంగళవారం ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజుతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించారు. దాంతో జడ్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లాలోని ద్వారక తిరుమలలో కోడిపందాలు ఆడుతున్న దాదాపు 17 మంది టీడీపీ నేతలను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు. అదికాక రాష్ట్రంలో కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలను నిర్వహించినా, జూదమాడినా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. దాంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుపా నేతృత్వంలోని ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ గతవారం హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
మిత్రపక్షాల మధ్య విబేధాల్లేవ్
తణుకు : బీజేపీ, టీడీపీల మధ్య విబేధాలు లేవని, అలా ఎవరైనా మాట్లాడితే అవి వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని బీజేపీ నేత, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. మంగళవారం తణుకు వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, బీజేపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని, కలిసే పనిచేస్తున్నామన్నారు. మోడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనధనయోజన పథకం ద్వారా పేదలకు ఎంతో లబ్దిచేకూరుతుందన్నారు. ప్రమాదబీమాతోపాటు రూ.5వేలు ఓవర్‌డాఫ్ట్‌గా పొందే సౌకర్యం ఉందన్నారు. ఇప్పటికి ఈ పథకం ద్వారా సుమారు రెండుకోట్లు మంది బ్యాంక్ ఖాతాలు పొందారన్నారు. నిడదవోలు-నరసాపురం రైల్వే లైన్ డబ్లింగ్ పనులు త్వరితగ తిన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిత్యవసరాల ధరల పెరుగుదలపై స్థానిక విలేకరులు ప్రశ్నించగా, ప్రభుత్వం ధరల అదుపునకు చర్యలు తీసుకుంటోందని, త్వరలోనే వాటి ఫలితాలు ప్రజలకు చేరువవుతాయన్నారు. ఉల్లిధర నియంత్రణతోపాటు కూరగాయల పంటల సాగుకు ప్రోత్సాహం అందేలా ఉద్యాన శాఖ అధికారులు అన్నిరకాల చ ర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తణుకులో మూసిన రైల్వే గేటు తెరిపించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఉపాధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, బీజేపీ రాష్ట్ర నాయకులు వీవీఎస్ వర్మ పాల్గొన్నారు. -
రాజుగార్ని దువ్వుతున్న రాజుగారు
మరోసారి టీటీడీ ఛైర్మన్ పదవి చేపట్టాలని కనుమూరి బాపిరాజు మహా ఊవిళ్లూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో టీటీడీ పగ్గాలు వదులుకోవాల్సి వస్తుందని ఆయన ప్రస్తుతం తెగ మధనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి టీటీడీ పాలన పగ్గాలు చేపట్టేందుకు ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోని హేమాహేమీ నాయకులతో భేటీ అయి... స్వామీ వారికి మరోసారి సేవ చేసే 'ఒకేఒక్క ఛాన్స్' తనకు ఇప్పించాలని ప్రాధేయపడ్డారట. అయితే ఆయనకి అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది సమాచారం. ఇప్పటికే ఆ పదవి కోసం తమ పార్టీ నేతల్లో తెగపోటీ పడుతున్నారని... ఎంత త్వరగా ఆ పదవికి రాజీనామా చేస్తే అంత మంచిదని సదరు పచ్చపార్టీ నేతలు బాపిరాజుకు హితవు పలికారని తెలిసింది. దాంతో ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలసి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో చివరికి మిగిలిన ఒకేఒక్క ఆశ బావమరిది గోకరాజు గంగరాజు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తనపై పోటీ చేసి విజయం సాధించిన బావమరిది గంగరాజును బాపిరాజు ఆశ్రయించారు. ఎలాగోలా టీటీడీ ఛైర్మన్ పదవి తనకే దక్కేలా ప్రయత్నించాలని బాపిరాజు తన బావమరిది గంగరాజును దువ్వుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడు బాపిరాజును కరుణిస్తాడో లేదో చూడాలి. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టు తెలుగుతమ్ముళ్లు ప్రదక్షణాలు చేస్తున్నారని సమాచారం. -
ఎంపీ పదవి వారి గడప దాటలేదు..!
తాడేపల్లిగూడెం: నరసాపురం ఎంపీ పదవి ఆ కుటుంబీకుల గడప దాటలేదు. అయితే బావ, లేకపోతే బామ్మర్ధి అన్న విధంగా రక్త సంబంధాలు, విడదీయరాని బంధుత్వాలు కలిగిన గోకరాజు, కనుమూరి కుటుంబాలకే ఎంపీ పదవి ఉండిపోయింది. ప్రస్తుత నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు (ఆయన పదవీ కాలం ఈ నెల 30 వరకు ఉంది) నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చిన అవకాశంతో బాపిరాజు తొలిసారిగా 1996లో కొత్తపల్లి సుబ్బారాయుడుపై పోటీ చేసి ఎంపీగా తొలి ఓటమిని చవిచూశారు. తర్వాత 1998లో తిరిగి పోటీచేసి విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తాజా ఎన్నికలలో ఆయన బావమర్ది గోకరాజు గంగరాజు ఎంపీగా తిరుగులే ని ఆధిక్యాన్ని సాధించారు. దీంతో నరసాపురం పదవి వారి గడపదాటనట్టయ్యింది. బాపిరాజుకు మామ ఇంటినుంచి పదవీ వారసత్వం వచ్చినట్టు చెబుతారు. మామ మాదిరిగానే టీటీడీ చైర్మన్ పదవిని బాపిరాజు పొందారు. ఎంపీ పదవిని ఇప్పటి వరకు అనుభవించిన ఆయన ఎన్నికలలో ఓటమి ద్వారా ఆ పదవి బావమర్దికి దక్కడంతో పదవి వారి గడప దాటనట్టయింది.