ఏసీఏ కార్యదర్శిగా గంగరాజు
విజయవాడ స్పోర్ట్స్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో ఏసీఏ 62వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 2019 వరకు కొనసాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డీవీఎస్‌ఎస్ సోమయాజులు తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రంగరాజు, యాచేంద్ర, శివారెడ్డి, సుబ్బరాజు, జీజేజే రాజు, త్రినాథ్ రాజు, సునీల్ రత్నకుమార్, రామచంద్, ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్.అరుణ్‌కుమార్, కోశాధికారిగా రెహమాన్ ఎన్నికయ్యారు.
టీఎన్‌సీఏ అధ్యక్షుడిగా శ్రీనివాసన్
చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా... ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ 14వ సారి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన 85వ వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీని ఎంపికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.