
బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు
సాక్షి, విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ధర్మపోరాట దీక్షపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. తిరుపతి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. మోదీ వ్యాఖ్యలను చంద్రబాబు పూర్తిగా వక్రీకరిస్తున్నారని విమర్శించారు.
నాలుగేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చంద్రబాబు నిలువరించారని ఆరోపించారు. చంద్రబాబు మంచి పాలన అందిస్తారనే నమ్మకంతోనే ఆయనతో కలిసి పనిచేయాలని భావించినట్లు చెప్పారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని ఎంపీ గోకరాజు గంగరాజు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment