రంగారెడ్డి: తాగి వచ్చి కుటుంబాన్ని వేధిస్తున్నాడని కన్న తండ్రిని గొంతు నులిమి హత్య చేసిన ఇద్దరు కొడుకులను పోలీసులు గురువారం రిమాండ్‌కు పంపారు. మహబూబ్‌నగర్‌లోని గోల్‌మజీద్ ప్రాంతానికి చెందిన ఎండీ.ఫయీమ్(55) ఐదేళ్ల కిందట కుటుబంతో కలిసి గండి గూడకు వలస వచ్చాడు. గ్రామ సమీపంలోని నందుగౌడ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటూ భార్య, ఇద్దరు కొడుకులు, కూతురుతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. ఫయీం తరచూ తాగి వచ్చి కుటుంబాన్ని వేదిస్తుండేవాడు.
ఆగస్టు 9న రాత్రి 8 గంటల సమయంలో తాగి వచ్చిన అతను ఇంట్లో గొడవ పడ్డాడు. దీంతో అతని కొడుకులు ఎండీ.అహ్మద్(25), ఎండీ.అల్తాఫ్(22) కలిసి తండ్రి గొంతును చున్నీతో గట్టిగా బిగించి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోనే సంచిలో చుట్టి సమీపంలో ఉన్న గ్రాండ్ విల్లే వెంచరులోని గోల్ బావిలో పడేశారు. ఈ నెల 8న ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. గురువారం అహ్మద్, అల్తాఫ్‌ను రిమాండ్‌కు పంపారు.
తండ్రిని హతమార్చిన తనయులకు రిమాండ్
Published Thu, Sep 10 2015 4:41 PM | Last Updated on Thu, Aug 16 2018 4:30 PM
Advertisement