సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ కాగా.. ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితుడు మాలిక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. బాలికపై అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు ఆచూకీ లభ్యమైంది. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
చదవండి: అమ్నీషియా పబ్ కేసు: కారులో ఉంది ఎమ్మెల్యే కొడుకే!
ఈ కేసులో ఓ విద్యాసంస్థ పేరుతో ఈవెంట్ కోసం పబ్‌ను బుక్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మే 28న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పబ్‌లో పార్టీ జరిగినట్లు సమాచారం. పబ్‌లో పార్టీ కోసం రూ.2లక్షలు చెల్లించినట్లు తెలిసింది. 150 మంది విద్యార్థుల కోసం నిర్వాహకులు బుక్ చేశారు. పబ్‌లో ప్లస్ టూ విద్యార్థుల ఫేర్‌వెల్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment