సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులోనిందితులకు ఈడీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను అధికారులు ఈడీ కోర్టులో మంగళవారం హాజరుపర్చారు. అనంతరం ఈ కేసులో నిందితులైన అవ్వాస్ వెంకట రామారావు, శేషు నారాయణ, వరప్రసాద్‌లను చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: రూ.4,109 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు)
కాగా.. ఏపీ, తెలంగాణ, కర్నాటకలో నమోదైన కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మందిని రూ.6380 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. రూ.942 కోట్ల డిపాజిటర్ల సొమ్మును ఇతర వ్యాపారాలకు అగ్రిగోల్డ్ మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. గతంలో జరిపిన సోదాల్లో రూ.22 లక్షల నగదు, పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురు)
Comments
Please login to add a commentAdd a comment