కాంచీపురం: బ్రిటిష్ కాలంనాటి చట్టాలు.. త్వరగతిన శిక్షలు పడకపోవడం దేశంలో నేరాలు పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయని మేధావులు మొత్తుకుంటున్నారు. అయినా చట్టాల సవరణలో జాప్యం కొనసాగుతూ వస్తోంది. ప్రత్యేకించి మహిళలపై నేరాల విషయంలో మృగాల చేష్టలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. తాజాగా..
తమిళనాడు కాంచీపురం ఘోరం జరిగింది. స్నేహితుడి ఎదుటే ఓ అమ్మాయిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు కొందరు దుండగులు. గురువారం సాయంత్రం బెంగళూరు-పుదుచ్చేరి హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం ఏడు గంటల సమయంలో.. తన స్నేహితుడితో ఓ ప్రైవేట్ స్కూల్ జాగా వద్ద యువతి మాట్లాడుతూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఐదుగురు వాళ్లను చుట్టుముట్టారు.
స్నేహితుడి పీకపై కత్తి పెట్టి.. చెప్పిన మాట వినకపోతే చంపి పాతేసి వెళ్లిపోతామని ఇద్దరిని బెదిరించారు. ఆపై ఒకరి తర్వాత మరొకరు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై మద్యం సేవించేందుకు వాళ్లు పక్కకు వెళ్లగానే.. స్నేహితురాలితో బైక్ మీద తప్పించుకున్నాడు ఆ యువకుడు. బంధువుల సాయంతో యువతిని ఆస్పత్రిలో చేర్పించి.. పోలీసులను ఆశ్రయించాడు.
చీకటి ఉండడంతో నిందితులను గుర్తించలేనని చెప్పిన బాధితురాలు.. వాళ్లలో ఒకడిని మరొకడు విమల్ అని పిలిచాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ స్టేట్‌మెంట్ ఆధారంగా.. ఘటన స్థలానికి ఆనుకుని ఉండే విపాడు గ్రామానికి చెందిన విమల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు. దీంతో నిందితుడు మద్యం మత్తులో నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని ద్వారా మిగతా నలుగురు నిందితులను ట్రేస్ చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆపై జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment