సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘పంజాగుట్ట అత్యాచార కేసు’లో దర్యాప్తు నకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ కేసు నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ కావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళా ఠాణా ఏసీపీ శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. ఈమె శనివారం బాధితురాలితో మాట్లా డారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడిస్తానంటూ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. తనపై 11 ఏళ్ళుగా 143 మంది అత్యాచారానికి ఒడిగట్టారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఆరోపణలు ఎదుర్కొం టున్న వారికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే వారిపై తదుపరి చర్యలు చేపట్టాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. మరోపక్క బాధితురాలితో ఫిర్యాదు చేయించిన గాడ్ పవర్ ఫౌండేషన్‌కు చెందిన రాజా శ్రీకర్ అలియాస్ డాలర్ భాయ్ వ్యవహారమూ ఈ కేసులో కీలకంగా మారింది. 4నెలల కిందట స్వచ్ఛంద సంస్థగా దీన్ని రిజిస్టర్ చేయించిన అతడు సోమాజిగూడ కేంద్రంగా నిర్వహి స్తున్నాడు. ఈ కేసు నమోదైన తర్వాత యువతి ఫిర్యాదులోని అంశాల ఆధారంగా జాబితాలోని నిందితులకు కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వారిని ఇతడు బెదిరించినట్లు కేసులు సైతం నమోదయ్యాయి.
దీంతో ఈ కేసులో డాలర్ భాయ్ పాత్రపై పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. బాధితు రాలు ఫిర్యాదు చేసేందుకు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసేందుకు సహకరి స్తున్నట్లు నటిస్తూ తన స్వలాభం చూసుకు న్నాడా? అనే కోణంలో పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. దీంతో డాలర్ భాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిం చారు. అక్కడ పోలీసులకు కొందరు యువతుల సర్టిఫికెట్లు, బయోడేటాలు లభించాయి. దీంతో ఇతడి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ సంస్థ కార్యాలయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
సర్టిఫికెట్లు, బయోడేటాల్లోని వివరాల ఆధారంగా యువతుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీ లభించిన తర్వాత మాట్లాడితేనే డాలర్ భాయ్‌కి సంబంధిం చిన మరిన్ని కోణాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే కార్యాల యంలో కొన్ని ఆడియో, వీడియో టేపుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించినవే అని అనుమానిస్తున్నారు. కాగా, డాలర్ భాయ్‌పై అతని భార్య గతంలోనే సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యి చార్జిషీటు కూడా దాఖలైంది. ఇప్పుడు ఆ కేసు స్థితిగతుల్నీ అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment