special Investigation
-
ఏఈఈ నిఖేష్ అక్రమార్జనపై ఏసీబీ ఫోకస్.. బినామీగా వ్యవహరించాడా?
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు చెందిన ఏఈఈ నిఖేష్ కుమార్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కస్టడీలో భాగంగా నాలుగు రోజుల పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణ కోసం గురువారం నిఖేష్‌ను ఏసీబీ కార్యాలయానికి తరలించారు.నిఖేశ్ కుమార్ భారీ అక్రమార్జనపై కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, అతను మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా? అనే విషయాన్నీ తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి పదేళ్ల క్రితమే నిఖేష్ కుమార్ ఉద్యోగంలో చేరినా గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. నిఖేష్ కుమార్ అక్రమ దందా వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల ప్రాథమిక విచారణలో రోజుకు తక్కువలో తక్కువ రూ.2 లక్షలకుపైగా సంపాదించినట్లు గుర్తించారు. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల్లోనే అక్రమార్జనకు అలవాటు పడిన నిఖేశ్ కుమార్‌తోపాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. రూ.17.73 కోట్ల అక్రమాస్తులు, ఒక లాకర్లోనే కిలోన్నర బంగారు ఆభరణాలు. వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లపైమాటే. వీటన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్నేహితుడి బ్యాంకు లాకర్లో ఉన్న డబ్బులను కూడా అధికారులు తీసుకున్నారు.నీటి పారుదల శాఖలో 2013లో చేరిన నిఖేష్‌కుమార్ మొదట వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక నాలాలు, జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు. దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారుల తరపున వాటాలనూ సేకరించి, ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రాసిక్యూషన్‌కు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ పేరుతో పవర్ మిస్ యూజ్ చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ప్రణీత్ రావును డీజీపీ ఇప్పటికే సస్పెండ్ చేశారు. కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావుపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం మారటంతో ట్యాపింగ్ రికార్డ్స్ ధ్వంసం చేసిన ప్రణీత్ రావు.. ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను మాయం చేశాడు. 42 హార్డ్ డిస్క్‌ల్లో డేటాను రిమూవ్ చేశారు. ఎస్ఐబీ ఆఫీస్‌లోని లాగర్ రూమ్‌లో ఉన్న లాప్టాప్, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడు. ఫోన్ టాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఐఎమ్ఈఐ నంబర్ల వివరాల సైతం ధ్వంసం చేశాడు. డేటా బేస్ లో ఉన్న మొత్తం డేటాను ప్రణిత్ రిమూవ్ చేశాడు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశాడనే దర్యాప్తు చేపట్టారు. అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్ రావుకు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
ప్రణీత్ రావు చేసిన నిర్వాకమిది!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో విచారణాంతరం ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రణీత్ రావు నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు.. సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐబీ Special Intelligence Bureau (SIB)లోని ఎస్వోటీ లాగర్ రూమ్‌లో ప్రణీత్‌రావు విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు రాగానే లాగర్ రూమ్ ధ్వంసానికి ప్రణీత్ రావు వ్యూహరచన చేసినట్లు వెల్లడైంది. ఎస్ఐబీలోని ఎస్వోటీ ఆపరేషన్‌కు హెడ్‌గా ఉన్న ప్రణీత్ రావు.. రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతల వ్యవహారాల వ్యవహారాలతో పాటు మావోయిస్టులు.. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రణీత్ రావు పర్యవేక్షించారు. ఎన్నికల ఫలితాలు రాగానే నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగర్ రూమ్‌కి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్ ల తో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లని ధ్వంసం చేసిన ప్రణీత్ రావు. ఆ సమయంలో ఎస్వోటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారాయన. అంతేకాదు.. లాగర్ రూమ్ కరెంట్ సప్లైను నిలిపివేసి మరి ప్రణీత్ రావు లోపలికి వెళ్లినట్లు తేలింది. వేల సంఖ్యలో కాల్ డాటా రికార్డులతో పాటు ఐఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసి.. ఎస్ఐబీ ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను కాల్చేసినట్లు వెల్లడైంది. మొత్తానికి లాగర్ రూమ్‌లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయారాయన. అయితే.. ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించుకోలేకపోతున్న అధికారులు.. ఆయనపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఆయన బంధువుగా.. అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్ రావుకు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం. -
‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిట్ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమేనని, గతంలో సిట్ విచారించిన కేసులు ఎటు పోయా యని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణకు వెళ్లిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, నయీం భూముల కేసులు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కేసు, హౌసింగ్‌బోర్డు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఎటు పోయిందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో సిట్ తాళాలు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారి చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో వాదనలు వినిపించిందని, టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని తాము కోర్టును కోరామని చెప్పారు. పేపర్ లీకేజీ అంశంలో ప్రవీణ్, రాజశేఖర్‌లతో పరిమితం కాకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీ, కస్టోడియన్ శంకరలక్షి్మని కూడా బాధ్యులుగా చేర్చాలని కోరారు. ఈ విషయాన్ని సమగ్రంగా దర్యాప్తు జరపాలని అడిగితే తనకు సిట్ నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కొలువుల కలవరం -
బడ్జెట్లో ప్రత్యేక ప్రస్తావన.. హైదరాబాద్‌లో మిల్లెట్స్‌పై పరిశోధనలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా 2023ను జరుపుకుంటున్న తరుణంలో వాటి సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. శ్రీఅన్న పథకం ద్వారా హైదరాబాద్‌లో చిరుధాన్యాలపై ప్రత్యేక పరిశోధనలు జరపాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) ఉన్న సంగతి తెలిసిందే. అందులోని పరిశోధనలకు పెద్దపీట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో అనుసంధానమై పనిచేస్తుంది. వేలాదిమందికి ఇందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. భవిష్యత్తులో మిల్లెట్ ఆహారపదార్థాలు అందుబాటులోకి తీసుకురావడం, మిల్లెట్ సాగు చేసే రైతులను ప్రోత్సహించడం, ఉత్పాదకత పెంచడం ఈ పరిశోధనల లక్ష్యం. ఐఐఎంఆర్ పరిధిలో 41 మంది సాంకేతిక సిబ్బంది, 21 అడ్మినిస్ట్రేటివ్, 27 సహాయక సిబ్బంది, 17 విభాగాలలో 48 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తున్నారు. 2023 అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ప్రాధాన్యం ఏంటి? మిల్లెట్లు పోషక ఆహార ధాన్యాలు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి మిల్లెట్ల సాగు, వినియోగం కొనసాగుతోంది. మిల్లెట్లలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ అధికంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా, వచ్చినవారికి మంచి ఆహారంగా ఉంటుంది. మిల్లెట్ల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలతోపాటు, వాటిని పండించడానికి తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి అవసరం. భారత ప్రభుత్వ విన్నపం మేరకు ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. భారతదేశం చేసిన ప్రతిపాదనను 70 దేశాలు ఆమోదించాయి. రసాయన పురుగుమందులు, ఎరువులు వాడకుండా మిల్లెట్లను సులభంగా పండించవచ్చు. చిన్న కమతాల రైతులకు మిల్లెట్ పంటలు పండించడం ఉపయోగకరం. మిల్లెట్లను రొట్టెలు, ఉప్మా, గంజిగా ఉపయోగించవచ్చు. మిల్లెట్లలో 60 రకాల వరకు ఉన్నాయి. మన దేశంలో ప్రధానంగా జొన్న, సజ్జ, కొర్రలు, ఎండు కొర్రలు, ఊదలు, సామలు, రాగులు వంటి చిరుధాన్యాలు ఉన్నాయి. అయితే 1960లలో హరిత విప్లవం ద్వారా ఆహార భద్రతపై దృష్టి సారించడంతో చిరుధాన్యాల ఆహారాన్ని ప్రజలు మరిచిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. హరిత విప్లవానికి ముందు మిల్లెట్ల సాగు దాదాపు 40 శాతం ఉండగా, ఆ తర్వాత 20 శాతానికి పడిపోయింది. మన దేశంలో ప్రస్తుతం 1.70 కోట్ల టన్నుల మిల్లెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ఆసియాలో 80 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో 20 శాతం ఉంటుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా మిల్లెట్లను ఉత్పత్తి చేస్తాయి. మనదేశం నుంచి మిల్లెట్లను యూఏఈ, నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా, యెమెన్, యూకే, యూఎస్‌లకు ఎగుమతి అవుతాయి. ఆగ్రోస్ మిల్లెట్ ఆహార కేంద్రాలు: కె.రాములు, ఎండీ, ఆగ్రోస్ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆగ్రోస్ ఆధ్వర్యంలో మిల్లెట్‌ను ప్రజలకు చేరువ చేయాలని భావి స్తున్నాం. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది మిల్లెట్ కియోస్క్‌లను ఏర్పాటు చేయా లని నిర్ణయించాం. ఆసక్తి కలిగిన మహిళలకు మిల్లెట్ ఫుడ్‌పై ఐఐఎంఆర్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని కూడా మా ఆలోచన. శిక్షణ అనంతరం నిర్ణీత పద్ధతిలో తయారు చేసిన కియోస్క్‌లను ఏర్పాటు చేస్తాం. అందుకోసం ముందుకు వచ్చే వారికి రుణాలు ఇప్పించే ఆలోచన కూడా ఉంది. ఈ కియోస్క్‌ల్లో రెడీమేడ్ మిల్లెట్ ఫుడ్, మిల్లెట్‌తో తయారు చేసిన బిస్కెట్లు, ఐస్‌క్రీం, నూడిల్స్, మిల్లెట్ బిర్యానీ వంటివి కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాం. -
బీర్భూమ్పై సీబీఐ విచారణ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీర్భూమ్ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రగతి నివేదికను వచ్చేవారం సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్భమ్ జిల్లాలోని బోగ్తూయి గ్రామంలో 10 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడంతో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సజీవ దహనాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అనారుల్ హుస్సేన్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ శుక్రవారం డిమాండ్ చేశారు. -
ప్రాథమిక ఆధారాల తర్వాతే నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘పంజాగుట్ట అత్యాచార కేసు’లో దర్యాప్తు నకు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ కేసు నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ కావడంతో ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు కోసం సీసీఎస్ మహిళా ఠాణా ఏసీపీ శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు. ఈమె శనివారం బాధితురాలితో మాట్లా డారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం వెల్లడిస్తానంటూ బాధితురాలు చెప్పినట్లు తెలిసింది. తనపై 11 ఏళ్ళుగా 143 మంది అత్యాచారానికి ఒడిగట్టారంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొం టున్న వారికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే వారిపై తదుపరి చర్యలు చేపట్టాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. మరోపక్క బాధితురాలితో ఫిర్యాదు చేయించిన గాడ్ పవర్ ఫౌండేషన్‌కు చెందిన రాజా శ్రీకర్ అలియాస్ డాలర్ భాయ్ వ్యవహారమూ ఈ కేసులో కీలకంగా మారింది. 4నెలల కిందట స్వచ్ఛంద సంస్థగా దీన్ని రిజిస్టర్ చేయించిన అతడు సోమాజిగూడ కేంద్రంగా నిర్వహి స్తున్నాడు. ఈ కేసు నమోదైన తర్వాత యువతి ఫిర్యాదులోని అంశాల ఆధారంగా జాబితాలోని నిందితులకు కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వారిని ఇతడు బెదిరించినట్లు కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో ఈ కేసులో డాలర్ భాయ్ పాత్రపై పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. బాధితు రాలు ఫిర్యాదు చేసేందుకు, పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసేందుకు సహకరి స్తున్నట్లు నటిస్తూ తన స్వలాభం చూసుకు న్నాడా? అనే కోణంలో పోలీసులు అనుమా నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా లభించలేదు. దీంతో డాలర్ భాయ్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహిం చారు. అక్కడ పోలీసులకు కొందరు యువతుల సర్టిఫికెట్లు, బయోడేటాలు లభించాయి. దీంతో ఇతడి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ సంస్థ కార్యాలయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సర్టిఫికెట్లు, బయోడేటాల్లోని వివరాల ఆధారంగా యువతుల్ని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఆచూకీ లభించిన తర్వాత మాట్లాడితేనే డాలర్ భాయ్‌కి సంబంధిం చిన మరిన్ని కోణాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే కార్యాల యంలో కొన్ని ఆడియో, వీడియో టేపుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించినవే అని అనుమానిస్తున్నారు. కాగా, డాలర్ భాయ్‌పై అతని భార్య గతంలోనే సీసీఎస్ మహిళా ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యి చార్జిషీటు కూడా దాఖలైంది. ఇప్పుడు ఆ కేసు స్థితిగతుల్నీ అధికారులు ఆరా తీస్తున్నారు. -
రెండు నెలలు దర్యాప్తు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: అసలే ఎన్నికల సమయం, ఆపై బందోబస్తు, తనిఖీలతో పోలీస్ అధికారులు, సిబ్బంది బిజీగా ఉంటారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా డబ్బు, మద్యం సరఫరా, అల్లర్లు, గొడవల నియంత్రణకే సమయం సరిపోతోంది. ఇలాంటి సమయంలో జరిగే భారీ దొంగతనాలు, దోపిడీ కేసులతోపాటు మేజర్ అఫెన్స్‌ను చేధించడం కొంత కష్టమేనని పోలీస్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. శాంతి భద్రతల విభాగంలోని సిబ్బందితో పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని సైతం బందోబస్తులో నిమగ్నం చేయక తప్పని పరిస్థితి. దీనితో అక్టోబర్, నవంబర్ నెలల్లో నమోదయ్యే కేసుల్లో దర్యాప్తు చాలా మేరకు పెండింగ్‌లో పడే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతినెలా టార్గెట్‌గా... పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రతినెలా నమోదయ్యే కేసులను మరుసటి నెల మొదటి వారంలో యూఐ (అండర్ ఇన్వెస్టిగేషన్) మేళా పేరుతో సమీక్ష నిర్వహించి వాటి దర్యాప్తును పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించేవారు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో అన్ని స్టేషన్ల అధికారులు ఆయా ప్రాంతాల్లో గ్రామాల విజిటింగ్, ఎన్నికల కమిషన్ సమావేశాలు, రిటర్నింగ్ అధికారుల ఆదేశాలు అమలు చేయడం, బైండోవర్లు చేయడం, సున్నితమైన ప్రాంతాల్లో పహారా కాయడం, పారామిలిటరీ బలగాలతో సమన్వయం చేసుకోవడంతోనే రోజువారీ కార్యక్రమాలు ముగిసిపోతున్నాయి. దీనితో ఆ రోజు స్టేషన్లో నమోదయ్యే కేసులపై పెద్దలు దృష్టి సారించలేకపోతున్నారు. చిన్న స్థాయిలోని పెట్టీ కేసుల నుంచి హత్య కేసులు, దోపిడీ కేసుల వరకు అదేరీతిలో దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అధికారులు దర్యాప్తు చేయాలనుకున్నా తగినంత సమయం లేకపోవడంతో కేసుల దర్యాప్తు పెండింగ్‌లో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు చిన్నా, పెద్ద కేసులు మొత్తం కలిపి 714 కేసులు ఈ నెలన్నర నుంచి పెండింగ్‌లో పడ్డట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ కేసుల్లో తీవ్రత ఎక్కువగా లేకున్నా వీటి ప్రభావం ఎన్నికలు ముగిసిన తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఎస్పీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలన్నర కావస్తోంది... రాచకొండ కమిషనరేట్‌లోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ జ్యువెల్లరీ దుకాణంలో పట్టపగలు దోపిడీకి యత్నించి దుండగులు గాల్లోకి కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ కేసు తీవ్రత పెద్దదే. తుపాకులతో వచ్చి బెదిరించి, అడ్డుకుంటుండగా గాల్లోకి ఫైర్ చేయడం ఆందోళన కలిగించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు అధికారులు చేధించేందుకు ప్రయత్నించినా ఎన్నికల సమయం కావడంతో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయారని రాచకొండ ఉన్నతాధికారులు తెలిపారు. - ఖమ్మం పట్టణంలోని కమాన్‌బజార్‌లో సరిగ్గా పదిహేను రోజుల క్రితం ఓ భవనంలో అర్ధరాత్రి పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన భవనం పూర్తిగా కూలిపోగా, చుట్టుపక్కల ఉన్న మరో ఐదు భవనాలు 50శాతం మేర పగుళ్లు వచ్చాయి. ఈ కేసు ఖమ్మం పట్టణంలో తీవ్ర అలజడి సృష్టించింది. ఇళ్లు ఖాళీ చేసిన తర్వాతరోజు పేలుళ్లు జరగడం పోలీసుల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది. పైగా మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోవడంతో ఈ ఇంట్లో అర్ధరాత్రి జిలెటెన్‌స్టిక్స్ డంపు చేయడంతో పేలుళ్లు సంభవించాయని గుర్తించారు. కానీ ఎందుకు డంప్ చేశారు? ఈ సమయంలో పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో వీటిని స్టోర్ చేయడం వెనుకున్న ఆంతర్యాన్ని గుర్తించలేకపోయారు. దీని వెనుక కుట్ర కోణం ఉండి ఉంటుందా అన్న అనుమానాలు పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కేసులు..ఆ కేసులు... సాధారణ సమయంలో నమోదయ్యే కేసులపై దృష్టి సారించలేని పోలీసులకు ఇటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై నమోదవుతున్న కేసులు మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలో 20 నుంచి 30 కేసులు నిబంధనల ఉల్లంఘన కింద సిఫారస్ అవుతున్నట్టు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. బందోబస్తులతో కుస్తీలు పడుతుంటే ఈ కేసులతో సబ్ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు ఒత్తిడిలో పడుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
దర్జాగా వెయ్యి ఎకరాలు కబ్జా చేసిన తెలుగు తమ్ముళ్లు
-
నరేశ్ అదృశ్యంపై దర్యాప్తు బాధ్యత ఎస్పీకి..
డీజీపీకి హైకోర్టు ఆదేశం.. జూన్ 1న హాజరుపరచాలని సూచన సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అంబోజి నరేశ్ అదృశ్యం.. అతడిని కులాంతర వివాహం చేసుకున్న స్వాతి ఆత్మహత్య వ్యవహారంపై విచారణ జరిపే బాధ్యతలను జిల్లా ఎస్పీకి అప్పగించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం డీజీపీని ఆదేశించింది. నరేశ్ అచూకీ తెలుసుకుని అతడిని జూన్ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆచూకీ తెలుసుకోలేకపోతే అందుకు సంబం« దించి పూర్తి వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని ఎస్పీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. స్వాతిని కులాంతర వివాహం చేసుకున్న తరువాత తన కుమారుడు నరేశ్ ఆచూకీ లభించడం లేదని, ఈ పెళ్లి ఇష్టం లేని స్వాతి తండ్రిపైనే తమకు అనుమానం ఉందని, తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీ సులను ఆదేశించాలంటూ అంబోజి వెంకటయ్య వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. స్థానిక పోలీసులపై నమ్మకం లేదు: పిటిషనర్ ఈ సందర్భంగా పోలీసుల తరుఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదిస్తూ నరేశ్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా ప్రయత్నిం చినా అచూకీ లభించలేదన్నారు. ఈ నెల 16న స్వాతి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆరోపణలకు తావు లేకుండా ఆమె మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టంను వీడియో తీసి భద్రపరిచామని చెప్పారు. వేసవి సెలవుల తరువాత నరేశ్ అచూకీపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, అప్పటి వరకు గడువు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్ స్పందిస్తూ స్థానిక పోలీసులపై నమ్మ కం లేదని, స్వాతి ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ గతంలో స్వాతి ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నిం చిందని, అలాంటప్పుడు ఆమెను తల్లిదండ్రులు ఒంటరిగా ఎలా వదిలేస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. -
నయీం కేసుల గందరగోళం
గ్యాంగ్‌స్టర్ నయీం హతమైనా పోలీసు కేసుల నమోదు, దర్యాప్తు తీరు చర్చే అవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో గతేడాది ఆగస్టు 8న జరిగిన ఎన్కౌంటర్లో నయీం మృతి చెందిన విషయం తెలి సిందే. అయితే నయీం మరణాంతరం విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదు చేసింది. ఇదే క్రమంలో కరీంనగర్, జగ్యితాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ ఐదు కేసులు నమోదయ్యాయి. పలుచోట్ల సుమోటో కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే సిట్ కేసుల నమోదు, దర్యాప్తు సందర్భంగా అనేక చిత్ర విచిత్రాలు జరగడం చర్చనీయాంశం అవుతోంది. సాక్షి, కరీంనగర్ : జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసు స్టేషన్‌పరిధిలో గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించి రెండు కేసులు నమోదు కాగా.. ఒక కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. పోలీసులు రౖకైం నంబర్ 178/2016 నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఆగస్టు 30న నిందితులైన కోరబోయిన రమేశ్ అలియాస్ రాంబాబు, నర్సింగోజు గోవర్ధనచారి అలియాస్ గోపీలను కోర్టు అనుమతితో జుడీషియల్ కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టగా మరో నేరానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీంతో అక్కడి ఎస్సై సుమోటో కేసు ్రౖకైం నంబర్ 193/2016 నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు నయీం కాగా.. కోరబోయిన రమేశ్, నర్సింగోజు గోవర్ధ్దనచారి, కట్టశివతో పాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ జారీ చేశారు. దీనిపై ఐపీసీ సెక్షన్ 120, 384, 302 రెడ్‌విత్, 120బీ అండ్ 34 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో పేర్కొన్న ప్రధాన నిందితుడైన నయీం మరణించగా.. నాల్గో నిందితుడు కోరు ట్ల పోలీసులకు లొంగిపోయాడు. జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితులు రమేశ్, గోపిలను కస్టడీకీ తీసుకొని విచారించారు. కేసు వివరాల్లోకి వెళ్తే కోరుట్ల పట్టణానికి చెందిన బీడీ లీవ్స్కాంట్రాక్టర్ ఖుర్రంను బెదిరించి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేయాలని నయీం ఆదేశాల మేరకు నిందితులందరు కలిసి కుట్ర పన్నారని, దీంతో నయీం ఆదేశాల మేరకు మిగతా నిందితులు కోరుట్లకు చేరుకొని ఖుర్రంను నయీంను కలువాలని లేకుం టే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ఖుర్రం నయీంను కలవడానికి నిరాకరించాడు. ఈ విషయాన్ని నిందితులు నయీంకు తెలుపగా అతను ఖుర్రం సోదరుడైన అస్లాం వివరాలు, ఫొటోలు సేకరించి అస్లాంను చంపడానికి కుట్ర పన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీ సులు 14 మంది సాక్షుల పేర్లు తెలుపుతూ కోర్టులో నయీంతో పాటు గోపీ, రమేశ్, శివలపై కోరుట్ల జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీఐ చార్జీషీట్ దాఖ లు చేయగా దర్యాప్తు వివరాలన్ని వెలుగుచూశాయి. ఈ కేసును పకడ్బందీగా దర్యాప్తు చేశారని అందరూ భావిస్తుంటే ఇందులో నిందితులుగా పేర్కొన్న అభియోగాలపై, ఐపీసీ సెక్షన్లపై న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇందులో నిందితులు బలవంతంగా డబ్బు రాబ ట్టాలని కుట్రపన్నినట్లు తెలుస్తుండగా హత్యానేరం కింద ఐపీసీ 302 సెక్షన్ ఎలా నమోదు చేశారని చర్చనీయాంశమైంది. ఏదైనా హత్య జరిగితే న్యాయస్థానం నిందితున్ని ఐపీసీ సెక్షన్ 302 కింద శిక్షిస్తుంది. ఈ కేసులో పోలీసులు స్వయంగా కేసు నమోదు చేయగా చార్జీషీట్లో చనిపోయిన వ్యక్తి ఎవరు, అతని పేరు తెలుపలేదు. నిందితుల్లో ఎవరు హత్య చేశారు, ఆ సంఘటనకు సంబంధించిన ఎలాంటి వివరాలు లేవు. ఏదైనా హత్య కేసు నమోదయి తే చనిపోయిన వ్యక్తి వివరాలు, శవపంచనామా, హత్యకు ఉపయోగించిన ఆయుధాల సేకరణ, పోస్టుమార్టం రిపోర్టుతోపాటు వివరంగా ఘటనకు సంబంధించిన అన్ని విషయాలతో కూడిన చార్జీషీట్‌ను విచారణాధికారి కోర్టుకు సమర్పిస్తారు. కానీ ఈకేసులో పైన తెలిపినవేవి కూడా చార్జీషీట్లో పేర్కొనకపోవడంతో నిందితులపై ఐపీసీ సెక్షన్ 302 ఎలా నమోదు చేసి చార్జీషీట్ దాఖలు చేశారన్న విషయంపై న్యాయవాద వర్గాల్లో గతవారం రోజుల నుంచి చర్చ జరుగుతోంది. నిందితులైన రమేశ్, గోపీలకు మిగతా కేసులలో బెయిల్ మంజూరైనప్పటికీ ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 302 నమోదైనందు వల్ల బెయిల్రాక సుమారు నాలుగు నెలలుగా జైలులోనే ఉంటున్నట్లు వారి తరఫు లాయర్ పేర్కొన్నారు. నిందితులు ఎవరినైతే చంపాలని కుట్రపన్నామని తెలిపారో అతడిని కేసులో 3వ సాక్షిగా పేర్కొనడం చర్చనీయాంశం అవుతోంది. -
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
తాడేపల్లిగూడెం : సంచలనం కలిగించిన యువతి సజీవ దహనం కేసులో పురోగతి సాధించే దిశగా పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. యువతి మృతదేహానికి శనివారం సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు. ఇప్పటికే కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఐడీ పార్టీ సభ్యులు, ఇతర సిబ్బంది జాతీయ రహదారి బైపాస్‌పై ఉన్న చెక్‌పోస్టులు, టోల్ గేట్ల వద్ద సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. దీంతో పాటు తాడేపల్లిగూడెం, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలం అనంతపల్లి, చేబ్రోలు పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల కనిపించకుండా పోయిన యువతులకు సంబంధించి నమోదు చేసిన కేసులలో ఫొటోల ఆధారంగా, హత్యకు గురైన యువతి ముఖ కవళికలను సరిపోల్చి చూస్తున్నారు. కాలిపోగా మిగిలిన యువతి చేతుల వే ళ్ల నుంచి ఫింగర్‌ప్రింట్‌ను తీసుకున్నారు. ఆధార్‌కు ఆ ముద్రలను అనుసంధానం చేసి, క్లూ లాగే పనిలో పోలీసులు ఉన్నారు. యువతి దహనం కాగా మిగిలిన భాగాలలో ఉన్న కపాలం (స్కల్) నుంచి సూపర్ ఇంపోజిషన్ పద్ధతిలో ఆనవాళ్లను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. హైద్రాబాద్‌లో పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్‌కు యువతి స్కల్‌ను పంపించారు. కపాలం, దవడ ఎముక, పుర్రెపై ఎత్తుపల్లాల ఆధారంగా టెక్నాలజీ సాయంతో సూపర్ ఇంపోజిషన్ పద్ధతిలో ఒక ఆకారం వస్తుంది. దీనిని బట్టి వచ్చిన ఆకారంతో , మిస్సింగ్ కేసులలో ఉన్న యువతుల ఫొటోలను, ముఖ కవళికలను సరిపోల్చుతారు. మ్యాచ్ ఆయితే తర్వాత ప్రక్రియలోకి వెళతారు. యువతి ఫొటో ఆధారంగా ఆమె చదివిన విద్యాసంస్థ, కుటుంబ నేపథ్యం, పరిచయాలు, పూర్వ చరిత్ర, యువతికి ఉన్న స్నేహితులు, వారి ప్రవర్తన, యువతికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? అనే కోణంలో పరిశోధన సాగించి, నిందితులను పట్టుకొనే వీలుంటుంది. కాగా యువతి డీఎన్ఏ సేకరించి విజయవాడ, హైదరాబాద్ ల్యాబ్స్‌కు పంపించారు. -
పోలీసుల పాత్రపై ప్రత్యేక దర్యాప్తు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై గంధం నాగేశ్వరరావు, అతడి కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలను తుపాకులతో కాల్చి చంపిన కేసులో పోలీసుల పాత్రపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బాధితులు, నిందితులతో ఏలూరు వన్‌టౌన్ పోలీసులకున్న సంబంధాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్టు తెలిసిన వెంటనే ముగ్గురినీ సస్పెండ్ చేశారు. వీరిపై కేసు నమోదుకు న్యాయపరంగా ఎదుర య్యే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పోలీస్ అధికారికి కుట్రదారులతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో స్పెషల్ బ్రాంచి ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నక్కా సూర్యచంద్రరావు 2001లో పెదవేగి పోలీస్‌స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత సీఐగా అక్క డ పనిచేశారు. దీంతో సూర్యచంద్రరావు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడాడనే విషయాన్ని తెలుసుకునేందుకు కాల్‌డేటా పరిశీలించారు. కేసులో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న భూతం గోవింద్‌తో ఏసీపీ అనేకసార్లు మాట్లాడినట్టు కాల్‌డేటాలో వెల్లడైంది. నిజం చెప్పకుండా నిందితునికి పరోక్షంగా సహకరిస్తున్నాడనే అనుమానంతో డీజీపీతో మాట్లాడి సూర్యచంద్రరావును వేకెన్సీ రిజర్వుకు పంపించారు. గత ఏప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య జరిగిన సందర్భంలోనూ నాగరాజు వర్గీయులతో ఈ పోలీసులకు సంబంధాలు ఉండి ఉంటాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హత్యలకు కుట్రపన్నిన వారితో పోలీసులకు ఉన్న సంబంధాలపై కూపీ లాగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లాలోని పలువురు పోలీసుల్లో వణుకు మొదలైంది. మరో 20 మంది నిందితులు ! విజయవాడ సిటీ : ఈ మూడు హత్యలకు చిన్నపాటి సహకారం అందించిన వారిని కూడా వదలకుండా నిందితులుగా చార్జిషీటులో చేర్చనున్నారు. తద్వారా ప్రధాన నిందితులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా పోలీసులు పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఢిల్లీకి చెందిన షూటర్ల గ్యాంగ్ సభ్యులు ఏడుగురు, కుట్రదారుల కుటుంబాలకు చెందిన ముగ్గురిని పోలీ సులు అరెస్ట్ చేశారు. షూటర్ల ముఠాలో ఒకరు, ప్రధాన కుట్రదారుడు భూతం గోవింద్ సహా 9మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే మరికొందరిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలని పోలీసు అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. కిరాయి హంతకులకు వసతి, వాహనాలు సమకూర్చడం, కుట్రదారులతో మంతనాలు చేసేం దుకు మొబైల్ ఫోన్ల సరఫరాను ఇక్కడి వారే చేసినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. వీరందరినీ ఇప్పటికే గుర్తించామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. మూడు హత్య కేసుల్లో మరో 20 మంది వరకు నిందితులుగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యూహాత్మక అడుగులు ఇదిలా ఉంటే.. ఈ కేసు విషయంలో పోలీసులు తొలి నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి హత్యకేసుల్లో కుట్రదారులను, హత్యలు చేసిన వారిని పోలీసులు నిందితులుగా పేర్కొంటారు.ఇందుకు అవసరమైన సహాయ సహకారం అందించిన వారిని సాక్షులుగా పేర్కొనడం పరిపాటి. సాక్షులుగా పెడితే ఎప్పుడైనా జారిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా కుట్రదారులు, హంతకులు సులువుగా శిక్షనుంచి తప్పించుకుంటారు. ఈ అంశాలను పోలీసు అధికారులు ముందుగానే ఊహించి, నిందితులకు సహాయ సహకారాలు అందించిన వారిని కూడా నిందితులుగా చేర్చడం, వారితో నేరం ఒప్పించడం, ఆపై అప్రూవర్లుగా మార్చుకుని నేరం నిరూపించడంపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ సమాచారం.