సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు టాప్ చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో విచారణాంతరం ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రణీత్ రావు నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు..
సస్పెండ్ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐబీ Special Intelligence Bureau (SIB)లోని ఎస్‌వోటీ లాగర్ రూమ్‌లో ప్రణీత్‌రావు విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు రాగానే లాగర్ రూమ్ ధ్వంసానికి ప్రణీత్ రావు వ్యూహరచన చేసినట్లు వెల్లడైంది.
ఎస్‌ఐబీలోని ఎస్‌వోటీ ఆపరేషన్‌కు హెడ్‌గా ఉన్న ప్రణీత్ రావు.. రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతల వ్యవహారాల వ్యవహారాలతో పాటు మావోయిస్టులు.. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రణీత్ రావు పర్యవేక్షించారు. ఎన్నికల ఫలితాలు రాగానే నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగర్ రూమ్‌కి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్ ల తో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లని ధ్వంసం చేసిన ప్రణీత్ రావు. ఆ సమయంలో ఎస్‌వోటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారాయన.
అంతేకాదు.. లాగర్ రూమ్ కరెంట్ సప్లైను నిలిపివేసి మరి ప్రణీత్ రావు లోపలికి వెళ్లినట్లు తేలింది. వేల సంఖ్యలో కాల్ డాటా రికార్డులతో పాటు ఐఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసి.. ఎస్ఐబీ ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను కాల్చేసినట్లు వెల్లడైంది. మొత్తానికి లాగర్ రూమ్‌లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయారాయన. అయితే.. ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించుకోలేకపోతున్న అధికారులు.. ఆయనపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
ఆయన బంధువుగా..
అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అయితే.. ప్రణీత్ రావుకు హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్‌రావుకు ఆదేశాలు ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో..
మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్‌లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయ్యింది. అలాగే.. ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్ కాగానే.. ప్రణీత్‌కు ఎస్‌ఐబీలో పోస్టింగ్ లభించింది. ఇదిలా ఉంటే.. ఎస్‌ఐబీలో ఉన్న ఇతర ఇన్‌స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ప్రభాకర్ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment