![Bilkis Bano case: Supreme Court judgment on Monday in pleas challenging early release of convicts - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/7/Untitled-10.jpg.webp?itok=y0ZeYZRI)
న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురి దారుణహత్య ఘటనల్లో దోషులకు శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు సోమవారం వెలువరించనుంది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పిటిషన్లపై 11 రోజులపాటు వాదనలను వింది. తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు గత ఏడాది అక్టోబర్ 12న ప్రకటించింది. అక్టోబర్ 16వ తేదీ కల్లా శిక్ష తగ్గింపు నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లను తమ ముందు ఉంచాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను ఆదేశించింది. బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులకు శిక్షను తగ్గించి, 2022 ఆగస్ట్ 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment