సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ భదోహి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠితో పాటు పలువురు తనని గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా 2016లో తొలిసారి త్రిపాఠి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని పేర్కొంది. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ హోటల్ రూమ్ తనని ఉంచాడని, అదే సమయంలో కొంతమంది నిందితులు తనపై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది.
విచారణ చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్ ప్రధాన న్యాయమూర్తి బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తరువాత కేసు దర్యాప్తు చేయాలని సూపరిటెండెంట్ రామ్ బదన్ సింగ్ తో పాటు గులాఫ్షా మహిళా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తో సహా ఇద్దరు సభ్యుల బృందానికి కేసును అప్పగిస్తూ తీర్పిచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు..వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆమె ఒప్పుకోవడం లేదని ఎస్పీ తెలిపారు.
ఎటువంటి ఆధారాలు లేనందున ఎమ్మెల్యే త్రిపాఠికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిపిన ఎస్పీ.. గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే మేనల్లుడు సందీప్ తివారీ, మరో బంధువు నితేష్ లపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. కాగా తాను గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని ఎమ్మెల్యే త్రిపాఠి తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా ఆమె ఫిర్యాదులో వెల్లడించినట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment