ప్రతీకాత్మకచిత్రం
రాంచీ : జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా కొచాంగ్‌లో గత ఏడాది ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు యువతులపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆరుగురు నిందితులను సివిల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఫాదర్ అల్ఫాన్సోతో పాటు మరో ఐదుగురిని దోషులుగా కోర్టు నిర్ధారించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుశీల్ జైస్వాల్ తెలిపారు. సామూహిక లైంగిక దాడి కేసులో అల్ఫాన్సో ప్రధాన కుట్రదారుడుగా కోర్టు గుర్తించిందని వెల్లడించారు.
గత ఏడాది జూన్ 19న ఖుంటి జిల్లాలోని ఓ గ్రామంలో వీధి నాటకం ప్రదర్శిస్తున్న ఓ ఎన్జీవోకు చెందిన ఐదుగురు యువతులను అపహరించిన దుండగులు వారిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో జూన్ 23న జార్ఖండ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment