
తాడేపల్లిరూరల్: ఏపీలోని డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు అమోఘంగా ఉన్నాయని నేషనల్ హెల్త్ రీసోర్స్ సెంటర్ నుంచి వచ్చిన బృంద సభ్యులు డాక్టర్ ఎస్.వినోద్‌కుమార్, మొహమ్మద్ షేక్‌లు కితాబిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్‌నగర్ డ్రైవర్ కాలనీలో బుధవారం డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను వారు సందర్శించారు. వైద్యశాల ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను వివరించేందుకు ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
ముందుగా గర్భిణులకు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని, పోషక విలువలను అడిగి తెలుసుకుని.. చాలా అమోఘంగా ఉందని ప్రశంసించారు. అనంతరం వైద్యశాలలో కుష్టు వ్యాధికి, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు అందిస్తున్న చికిత్సతో పాటు, రోగులకు ఇస్తున్న కౌన్సెలింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు చాలా బాగున్నాయన్నారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అన్ని వసతులను ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రతి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్ సౌకర్యం కూడా కల్పించారని, అన్ని రకాల రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఉప ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మన్మోహన్, తాడేపల్లి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment