హెచ్సీయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షలను శనివారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. దీక్ష విరమించడానికి విద్యార్థులు నిరాకరించడంతో యూనివర్సిటీలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను వర్సిటీ హెల్త్ సెంటర్కు తరలించారు.
దీక్షలో పాల్గొన్న ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ అనే విద్యార్ధి ఆరోగ్యం విషమించడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అనంతరం గత నాలుగు రోజులుగా హెచ్సీయూలో ఏడుగురు విద్యార్థులు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.