vemula rohith
-
రోహిత్ కేసులో దోషులను అరెస్ట్ చేయాలి
సుల్తాన్‌బజార్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల మృతికి కారణమైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, వీసీ అప్పారావులను అరెస్ట్ చేయాలని, జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాన్ని అమలు చేయాలని డాక్టర్ ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రకాష్ అంబేద్కర్ డిమాండ్ చేశారు. రోహిత్ వేముల న్యాయపోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రోహిత్ వేముల మృతి కారణమైన దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 29 (సోమవారం)న నాంపల్లిలోని గాంధీభవన్ ప్రకాశం హాల్లో బహిరంగసభను నిర్వహించనున్నట్లు లెలిపారు. రోహిత్ మృతి చెంది 7 నెలలు గడుస్తున్నా ఈ సంఘటనలో నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ రోహిత్ ఎస్సీఅని డిక్లేర్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ వెంటనే పూర్తి చేసి, రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలని అదేశించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి కూడా 4 నెలల గడుస్తోందన్నారు. కార్యక్రమంలోప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, బంగారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
వెళ్లి తీరుతా, అనుమతించే ప్రసక్తే లేదు..
హైదరాబాద్ : హెచ్ సీయూ మరోసారి అట్టుడుకుతోంది. ఓవైపు వర్సిటీలోకి వెళ్లితీరుతానంటున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్, మరోవైపు అతడిని క్యాంపస్‌లోకి అనుమతించేది లేదని పోలీసులు ...ఈ నేపథ్యంలో బుధవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా కన్హయ్య కుమార్‌ను లోనికి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు తెలిపారు. అయితే కన్హయ్యను వర్సిటీలోకి అనుమతించకుంటే తామే బయటకు వచ్చి సభ నిర్వహించుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశారు. అంతకు ముందు హాస్టల్లో వంట చేసుకుంటున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. ఇంకెంతమందిని చంపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు, ఇంటర్నెట్, వర్శిటీ క్యాంటిన్లు ఇలా అన్నింటిని మూసేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. కాగా అంతకు ముందు కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.... పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ చట్టం తీసుకొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన కన్హయ... రోహిత్‌లా మరొకరు ప్రాణాలు కోల్పోవద్దన్నదే తమ అభిప్రాయమన్నారు. హెచ్సీయూకు వెళ్లి, అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నట్లు చెప్పారు. వర్సిటీలో హింసకు వీసీ అప్పారావే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక యూనివర్సిటీకి చెందిన విద్యార్థి మరో వర్సిటీకి వెళ్లకూడదా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించేవాళ్లం కాదని, కట్టుబడి ఉండేవాళ్లమని కన్హయ్య తెలిపారు. కాగా కొండాపూర్‌లోని సీఆర్ పౌండేషన్లో ఉన్న రోహిత్ తల్లి రాధికను ఇవాళ ఆయన పరామర్శించారు. అనంతరం రోహిత్ తల్లి, సోదరుడితో కలిసి కన్హయ్య కుమార్ హెచ్ సీయూకు బయల్దేరారు. కాగా హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలను తక్షణమే పంపించివేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. -
హెచ్‌సీయూ ఘటనలో 28మంది విద్యార్థుల అరెస్ట్
హైదరాబాద్ : హెచ్‌సీయూలో రెండోరోజు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న హెచ్‌సీయూలో జరిగిన ఘటనకు సంబంధించి 28మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు తమకు అనుమతి ఇవ్వకపోయినా హెచ్‌సీయూలో నిరసన కార్యక్రమం నిర్వహించి తీరతామని విద్యార్థులు స్పష్టం చేశారు. నిరసన తెలపటం తమ హక్కు అని, వీసీ అప్పారావును తొలగించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు. తమకు మద్దతు తెలిపే అందరినీ వర్శిటీకి ఆహ్వానిస్తామన్నారు. విద్యార్థుల నిరసన కార్యక్రమానికి జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ హాజరు కానున్నారు. అయితే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, బయటవారిని వర్శిటీలోకి అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 17న ఆత్మహత్య చేసుకోవడంతో వర్శిటీలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో వీసీ అప్పారావు దాదాపు రెండు నెలలుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మంగళవారం తిరిగి వర్సిటీకి వచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో అందడంతో విద్యార్థి జేఏసీ నేతృత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు వీసీ నివాసం(లాడ్జ్) వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యల్లేకుండా వీసీ మళ్లీ ఎలా విధుల్లోకి ఎలా చేరతారంటూ ఆగ్రహంతో ఆయన నివాసంపై దాడి చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, అలంకరణ సామాగ్రి, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, 28మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. -
తరిమి తరిమి కొట్టారు
- హెచ్‌సీయూలో విద్యార్థులపై మళ్లీ విరిగిన లాఠీ - వీసీ అప్పారావు రాకతో వర్సిటీలో ఉద్రిక్తత - పెద్ద ఎత్తున విద్యార్థుల ఆందోళన.. వీసీ నివాసంపై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం - ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వీసీ నివాసం ముందు నిరసన - విద్యార్థులను చెదరగొట్టేందుకు విచక్షణారహితంగా లాఠీచార్జి చేసిన ఖాకీలు - ఏడుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు - వీసీకి మద్దతుగా నిలిచిన నాన్‌టీచింగ్ స్టాఫ్, ఏబీవీపీ, లైఫ్‌సైన్స్ విద్యార్థులు - రెండు కేసులు నమోదు.. అదుపులో 26 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లు - నేడు వర్సిటీలో రోహిత్ తల్లి దీక్ష.. కన్హయ్య కుమార్ రాక సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ మళ్లీ రణరంగమైంది! విద్యార్థులపై లాఠీలు విరిగాయి. ఖాకీలు విచక్షణారహితంగా దొరికిన వారిని దొరికినట్టు బాదేశారు. ఒక్కసారిగా విరుచుకుపడి విద్యార్థులను తరిమితరిమి కొట్టారు. ఈ లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. రోహిత్ ఘటన తర్వాత ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న వర్సిటీకి మంగళవారం వైస్ చాన్స్‌లర్(వీసీ) అప్పారావు రావడం, రహస్యంగా బాధ్యతలు చేపట్టడం ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. వీసీ నివాసంపై విద్యార్థుల దాడి, వారిపై పోలీసుల లాఠీచార్జి, ప్రతిగా విద్యార్థుల రాళ్లదాడితో యూనివర్సిటీ రోజంతా అట్టుడికిపోయింది. ఈ ఘటనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు 26 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు ప్రొఫెసర్లనూ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వీసీకి మద్దతుగా నిలిచిన నాన్-టీచింగ్ స్టాఫ్ మంగళవారం సాయంత్రం నుంచి సహాయ నిరాకరణ పేరుతో మెస్‌ల బంద్‌కు పిలుపునిచ్చారు. కాక రేపిన వీసీ రాక హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 17న ఆత్మహత్య చేసుకోవడంతో వర్శిటీలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో వీసీ పొదిలె అప్పారావు దాదాపు రెండు నెలలుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మంగళవారం తిరిగి వర్సిటీకి వచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలియడంతో అందడంతో విద్యార్థి జేఏసీ నేతృత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు వీసీ నివాసం(లాడ్జ్) వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యల్లేకుండా వీసీ మళ్లీ ఎలా విధుల్లోకి ఎలా చేరతారంటూ ఆగ్రహంతో ఆయన నివాసంపై దాడి చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, అలంకరణ సామాగ్రి, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా కొందరు విద్యార్థులు దాడికి యత్నించారు. దీన్ని ఖండిస్తూ మీడియా ప్రతినిధులు అక్కడ కొద్దిసేపు ధర్నా చేశారు. అప్పారావు నివాసంలోనే ఉండడం గమనించిన విద్యార్థులు అటువైపు చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు విద్యార్థుల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీసీకి మద్దతుగా ఏబీవీపీ, నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులు వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో కొందరు నాన్ టీచింగ్ ఉద్యోగులు వైస్ చాన్స్‌లర్‌కు మద్దతుగా నిలిచారు. వీసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో వారికి, విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన నాన్ టీచింగ్ సిబ్బంది తాము వర్సిటీ మెస్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనల క్రమంలో హెచ్‌సీయూ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ప్రొఫెసర్ అలోక్‌పాండే అస్వస్థతకు లోనై కుప్పకూలారు. వెంటనే ఆయన్ను భద్రతా సిబ్బంది వర్సిటీలోని హెల్త్ సెంటర్‌కు తరలించారు. వీసీకి స్కూల్ ఆఫ్ లైఫ్‌సైన్స్ విద్యార్థులు కూడా మద్దతుగా నిలిచారు. నివాసంలో వారు వీసీ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. వీసీకి మద్దతుగా ఏబీవీపీ, వ్యతిరేకంగా అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో ఏబీవీపీ, ఏఎస్ఏ మధ్య తోపులాట జరిగింది. లాఠీలతో విరుచుపడ్డ పోలీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు వీసీ నివాసం వద్దే ఆందోళనలు చేపట్టారు. 5 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు ఒక్కసారిగా లాఠీచార్జి చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకునే సమయంలో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకుపోయారు. విద్యార్థినులను మహిళా పోలీసులు వారి జడలు పట్టుకుని లాక్కెళ్లారు. లాఠీచార్జిలో భాస్కర్, షోహన్, సంజయ్, వరుణ్, అక్షిత, హాసిని, ఫైజల్ అనే విద్యార్థులతోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. విద్యార్థులకు మద్దతు పలికేందుకు వెళ్లిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని పోలీసులు గేట్ వద్దే అడ్డుకున్నారు. హెచ్‌సీయూలో బుధవారం జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వర్సిటీలకు చెందిన విద్యార్థులు మంగళవారమే హెచ్సీయూకు చేరుకున్నారు. తాజా ఘర్షణ నేపథ్యంలో పోలీసులు వారిని కూడా వారినీ అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు కార్డులు సమర్పించాలని, అప్పుడే వదులుతామంటూ వేధించారు. మొత్తమ్మీద యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వర్సిటీలో పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సైతం తొలిసారిగా వర్శిటీకి వచ్చి అధికారులతో సమావేశమయ్యారు. -
నిజనిర్ధారణ కమిటీ వేయాలి
రోహిత్ మృతిపై విద్యార్థి జేఏసీ, ఫ్యాకల్టీ సభ్యుల డిమాండ్ ఇన్చార్జి వీసీతో చర్చలు నాలుగో రోజుకు చేరిన టీచర్స్ ఫోరం దీక్షలు హైదరాబాద్: రోహిత్ ఘటనపై హెచ్‌సీయూ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ పెరియస్వామి ఆదివారం విద్యార్థి జేఏసీ సభ్యులు, అధ్యాపకులతో చర్చలు జరిపారు. వర్సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రోహిత్ స్మారకార్థం వర్సిటీలో ఏటా ఉపన్యాస కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని జేఏసీ సభ్యులు ప్రతిపాదించారు. రోహిత్ ఘటనపై నిజనిర్ధారణకు వర్సిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. క్రమశిక్షణ సంఘాన్ని మార్చి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని, పరిపాలన విభాగ పదవులకు రాజీనామా చేసిన ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీలను తిరిగి విధుల్లో తీసుకోవాలని, వారి రాజీనామా పత్రాలను తిరస్కరించాలన్నారు. అలాగే వర్సి టీ స్వయంప్రతిపత్తికి భంగం వాటిల్లేలా వ్యవహరించిన వీసీ అప్పారావుపై కేంద్ర మానవ వనరుల శాఖ(ఎంహెచ్ఆర్డీ)కి లేఖ పంపాలని డిమాండ్ చేశారు. తరగతులకు నష్టం కలగని విధంగా సెమిస్టర్ కాల వ్యవధిని పొడిగించాలన్నారు. ఫ్యాకల్టీ, జేఏసీ నాయకుల ప్రతిపాదనలను చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు. అప్పారావును తొలగించాల్సిందే.. ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో వర్సిటీలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. అధ్యాపకులు తిరుమల్, అనుపమ, కేవై రత్నం, లీమావాలీ దీక్షలు కొనసాగిస్తున్నారు. వీసీ అప్పారావును శాశ్వతంగా తొలగించాలని, సెలవులో ఉన్న ఇన్చార్జి వీసీ శ్రీవాత్సవను తిరిగి విధుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునేదాకా దీక్ష కొనసాగుతుందని తెలిపారు. -
నగరంలో జరగనున్న ఈవెంట్స్
రోహిత్ స్మారక కవి సమ్మేళనం, సంచికలు ‘సింగిడి’, ‘హర్యాలి’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని లామకాన్‌లో ‘రోహిత్ వేముల యాది- కవి సమ్మేళనం’ జరగనుంది. స్కైబాబ, వెంకటేష్ చౌహాన్, గోరటి వెంకన్న, జూపాక సుభద్ర, గోగు శ్యామల, అరుణ గోగులమండ, సిద్ధార్థ, యాకూబ్, ప్రసాదమూర్తి, నలిగంటి శరత్, గుడిపల్లి రవి పాల్గొంటారు. ‘బహుజన కెరటాలు’ తేనున్న రోహిత్ స్మారక సంచిక కోసం కవితలు, వ్యాసాలు ఫిబ్రవరి 5లోగా పంపాలని రచయితలను కోరుతున్నారు. పంపాల్సిన మెయిల్: bahujanakeratalu@gmail.com. వివరాలకు: 9849944170 సూరేపల్లి సుజాత, పడవల చిట్టిబాబు, పసునూరి రవీందర్, జెస్సీ, అబుల్ సంపాదకత్వంలో వెలువడనున్న బహుభాషా, బహు ప్రక్రియల రోహిత్ స్మారక సంకలనం కోసం కథలు, కవితలు, వ్యాసాలు, స్పందనలు ఫిబ్రవరి 10లోగా పంపాల్సిందిగా రచయితలను కోరుతున్నారు. చిరునామా: పసునూరి రవీందర్, 114, నేతాజీ నగర్, గుల్మొహర్ పార్క్ కాలనీ, శేరిలింగంపల్లి, హైదరాబాద్-19. మెయిల్: dr.pasunuri@gmail.com. ఫోన్: 7702648825 ఒక బాటసారి బైరాగి పదాలు పూడూరి రాజిరెడ్డి రచనల గురించి విమర్శకుడు కాకుమాని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో మాట్లాడనున్నారు. ‘ఒక బాటసారి బైరాగి పదాలు’ పేరిట ఫిబ్రవరి 7న సాయంత్రం 5:30కి జరిగే ఈ ప్రసంగ కార్యక్రమ నిర్వహణ: ఛాయ సాంస్కృతిక సంస్థ. వేదిక: దోమలగూడలోని ఇందిరా పార్క్ దగ్గరి హైదరాబాద్ స్టడీ సర్కిల్. ప్రరవే మూడవ మహాసభలు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మూడవ మహాసభల్లో భాగంగా, ‘సహన, అసహన భావనలు- చారిత్రక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు- ప్రభావాలు’ అంశంపై సదస్సును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో నిర్వహించనుంది. మామిడిపూడి వెంకట రంగయ్య హాల్, ఆంధ్ర మహిళాసభ క్యాంపస్, హైదరాబాద్‌నందు జరిగే ఈ సదస్సులో భిన్న అంశాలపై ఉపన్యాసాలు, కవి సమ్మేళనం ఉంటాయి. ప్రారంభ సభలో కథాకళి కళాకారిణి మాయా కృష్ణారావు ప్రదర్శన, ప్రరవే వ్యాస, కథా సంకలనాల ఆవిష్కరణ ఉంటాయి. జి.హరగోపాల్, వకుళాభరణం రామకృష్ణ, రమా మెల్కోటే, కె.రామచంద్రమూర్తి, నందిని సిధారెడ్డి, సంధ్య, కృష్ణారావు, మోహన్, తోట జ్యోతిరాణి, ఎన్.శంకర్, గణేషన్, డానీ, కె.సునీతారాణి, దార్ల వెంకటేశ్వరరావు, పి.విక్టర్ విజయ్‌కుమార్, కె.ఎన్.మల్లీశ్వరి పాల్గొంటారు. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్: హెచ్‌సీయూ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్సిటీ గేట్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాహుల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేపట్టి రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ హైదరాబాద్ రాక నేపథ్యంలో శనివారం తెలంగాణ వ్యాప్తంగా కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేడు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా వర్సిటీ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్సిటీకి వచ్చి విద్యార్థులు చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థులకు సంఘీభావంగా ఆయన దీక్ష చేపట్టారు. నేటి సాయంత్రం ఆరు గంటల వరకు రాహుల్ దీక్ష కొనసాగించనున్నట్లు సమాచారం. రోహిత్ తల్లి రాధిక కూడా రాహుల్ చేపట్టిన దీక్షలో పాల్గొన్నారు. -
హెచ్‌సీయూలో క్యాండిల్ ర్యాలీ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) లో విద్యార్థుల ఆగ్రహజ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. వేముల రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అతడి బర్త్ డే సందర్భంగా హెచ్‌సీయూ విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా వర్సిటీలోని విద్యార్థులు శుక్రవారం రాత్రి 11:30 సమయంలో క్యాండిల్ ర్యాలీ ప్రారంభించారు. రోహిత్ తల్లి రాధికతో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నిరసనలో పాల్గొననున్నట్లు విద్యార్థి సంఘాలు తెలిపాయి. -
హెచ్‌సీయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
-
హెచ్‌సీయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న దీక్షలను శనివారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. దీక్ష విరమించడానికి విద్యార్థులు నిరాకరించడంతో యూనివర్సిటీలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను వర్సిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. దీక్షలో పాల్గొన్న ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ అనే విద్యార్ధి ఆరోగ్యం విషమించడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య అనంతరం గత నాలుగు రోజులుగా హెచ్‌సీయూలో ఏడుగురు విద్యార్థులు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. -
ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం విషమం
-
'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'
-
'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'
హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు స్వయంగా వచ్చి తన కుమారుడు చేసిన తప్పేంటో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ చనిపోయాక తమ ఇంటికి వచ్చి ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు. వీసీ తప్పు చేయకుంటే దొంగతనంగా వచ్చి తమను కలిసేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలని రాధిక ప్రశ్నించారు. తమ కుమారుడు రోహిత్ ఆశయసాధనే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన మిగిలిన నలుగురి విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గురువారం మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మనస్తాపంతో ఆదివారం నాడు యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
వర్సిటీలో ఆగ్రహజ్వాలలు
-
మంత్రులను తొలగించాల్సిందే!
♦ రోహిత్ ఆత్మహత్యకు వారే బాధ్యులు ♦ హెచ్‌సీయూ విద్యార్థి ఆత్మహత్యపై భగ్గుమన్న భారతం ♦ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నిరసనలు ♦ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, పంజాబ్‌లలో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పంజాబ్‌లోని ఫగ్వారాలో ‘పంజాబ్ అంబేడ్కర్ సేన మూలవాసి’ సంస్థ, బీఎస్పీ విద్యార్థి సంఘం సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించి.. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దత్తాత్రేయను మంత్రి పదవినుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖరాశారు. అటు గుజరాత్ సెంట్రల్ వర్సిటీకి చెందిన 50 మంది దళిత విద్యార్థులు గాంధీనగర్‌లో శాంతిర్యాలీ నిర్వహించారు. వేముల రోహిత్‌ది వ్యవస్థాగతమైన హత్య అని ఆరోపించారు. ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరపాలని ఆందోళన నిర్వహించారు. ఇప్పటివరకు సస్పెండైన 10 మందిలో 9 మంది దళితులే ఎందుకున్నారని ప్రశ్నించారు. కుల, మతోన్మాద రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.బెంగళూరులోనూ దళిత విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ తీరువల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాయి. అటు తమిళనాడులోనూ నిరసనలు మిన్నంటాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతోపాటు దళిత విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. టీఎన్‌సీసీ దళిత విభాగం నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న శాస్త్రి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. రోహిత్ మృతి కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కూడా చెన్నైలో నిరసనలు చేపట్టింది. కాగా కేంద్ర మంత్రి దత్తాత్రేయతోపాటు యూనివర్సిటీ వీసీ అప్పారావులపై చర్యలు తీసుకోవాలని ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో డిమాండ్ చేశారు. దళిత విద్యార్థుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. అటు పుణేలోనూ.. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. హైదరాబాద్‌లో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముంబై, ఔరంగాబాద్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ముంబై యూనివర్సిటీలో అంబేడ్కర్ యువజన సంఘాలు, అంబేడ్కర్ రాడికల్ సంఘం, రిపబ్లికన్ పాంథర్ తదితర సంఘాలు సంయుక్తంగా మంగళవారం ఆందోళన చేపట్టాయి. రోహిత్ ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని వీసీకి వినతిపత్రం అందించారు. మరోవైపు, ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాగ్‌పూర్‌కు చెందిన దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. అవసరమైతే నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. మంత్రులను తొలగించాలి: కాంగ్రెస్ రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇద్దరు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రధాన మంత్రి మోదీ వారిద్దరినీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుమారి సెల్జా డిమాండ్ చేశారు. ఇరానీ విశ్వవిద్యాలయానికి పలు లేఖలు రాశారని, ఏబీవీపీని ప్రోత్సహించడానికి అనువుగా దళిత విద్యార్థులకు వ్యతిరేకంగా దత్తాత్రేయ వ్యవహరించారని సెల్జా చెప్పారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, దళితుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు పని చేయ డం ఇది మొదటిసారి కాదన్నారు. రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి: ఆజంఖాన్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ డిమాండ్ చేశారు. విద్యార్థి సూసైడ్ నోట్ కొత్త అనుమానాలకు తావిస్తోందని.. దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దాని అనుబంధ సంస్థలే బాధ్యతవహించాలన్నారు. అలీగఢ్ ముస్లిం వర్సిటీ వంటి సంస్థలను మూసేయించాలని సంఘ్ పరివార్ సంస్థలు యత్నిస్తున్నాయన్నారు.ఈకేసులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని ఆజంఖాన్ కోరారు. టీఎంసీ సంఘీభావం రోహిత్ ఆత్మహత్యపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు తృణమూల్ కాంగ్రె స్ ఇద్దరు సభ్యుల బృందాన్ని హైదరాబాద్‌కు పంపనుంది. ఫోన్లో సంఘీభావం తెలిపినా.. ప్రత్యక్షంగా పాల్గొంటే బాగుంటుందని విద్యార్థి బృందం కోరటంతో టీఎంసీ బృందం రానుంది. వేడెక్కిన జంతర్ మంతర్ రోహిత్ ఆత్మహత్య వెనక బీజేపీ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ వివిధ విద్యార్థి సంఘాలు రెండోరోజూ ఢిల్లీలో తమ ఆందోళన కొనసాగించాయి. దోషులపై తగిన చర్యలు తీసుకోని పక్షంలో తమ ఆందోళన ఉధృతమవుతుందని హెచ్చరించాయి. మంగళవారం ఉదయం ఇక్కడి జంతర్ మంతర్‌లో ఆప్ నేతలు, ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. సాయంత్రం మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ వద్ద కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ఆందోళన చేపట్టింది. ఏబీవీపీ, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే కేంద్రం విద్యార్థులపై చర్యలు తీసుకుందని, సస్పెండ్ చేసేంతవరకూ కేంద్రం నుంచి ఒత్తిడి కొనసాగిందని ఆందోళనకారులు ఆరోపించారు. కాగా, ప్రధాని మోదీ జోక్యం చేసుకొని స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఓ వ్యవస్థ అంతర్గత విషయాల్లో మంత్రి ఎలా జోక్యం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఆందోళనలే ఇందుకు నిదర్శనమన్నారు. మోదీ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో స్మృతి ఇరానీ పాత్రపై కూడా విచారణ జరిపించాలని ఆప్ నేత అశుతోష్ డిమాండ్ చేశారు. రాహుల్.. రాజకీయం చేయొద్దు: బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ హత్యను రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. రోహిత్ వెనకబడిన తరగతులకు చెందిన వాడని.. అనవసరంగా దళితుడని ప్రచారం చేస్తూ వివాదాన్ని పెంచుతున్నారని మండిపడింది. దళితుడైనందుకే బీఆర్ అంబేడ్కర్‌ను జీవితాంతం మనోవేదనకు గురిచేసిన విషయాన్ని రాహుల్ మరిచిపోయారా అని బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రశ్నించారు. కొన్ని వర్గాలు, కాంగ్రెస్, మీడియాలోని ఓ వర్గం రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కోర్టు ఆలోచనల మేరకే రోహిత్‌తో పాటు ఐదుగురు విద్యార్థులపై వర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నారని.. ఆ తర్వాత మానవతాధృక్పథంతో ఆలోచించి హాస్టల్లోకి అనుమతించకుండా.. క్లాసులకు అనుమతిచ్చారని మురళీధర్ రావు గుర్తుచేశారు. ఏదో జరిగిపోయినట్లు హడావుడిగా పర్యటించటం ద్వారా ఓ జాతీయ పార్టీ పరువును మరింత దిగజార్చారని విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయటం ద్వారా బురదలో చేపలు పట్టాలనుకుంటున్నారని మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. రోహిత్ ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం వల్లే గొడవ మొదలైందని.. ఈ ఆత్మహత్యను కొన్ని వర్గాలు దళితహత్యగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. -
కోర్టు ఆదేశాలు పాటించినా రోహిత్ దక్కేవాడు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిమ్న వర్గానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంటీగ్రేటెడ్ ఎంఏ (లింగిస్టిక్స్) చదువుతున్న 21 ఏళ్ల పీ. రాజు 2013లో యూనివర్శిటీ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో విద్యా వ్యవస్థలోనే ప్రకంపనలు సృష్టించింది. టీచర్ల కమ్యూనిటీ ఒక్కటై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదే ఏడాది ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ, ఇంగ్లీష్, విదేశీ భాషల యూనివర్శిటీసహా పలు యూనివర్శిటీ క్యాంపస్‌లలో అప్పటి వరకు జరిగిన 24 మంది విద్యార్థుల ఆత్మహత్యల గురించి ఆ పిల్లో పేర్కొంది. విద్యార్థులు వచ్చిన సామాజిక పరిస్థితుల గురించి అవగాహన చేసుకోకుండా యూనివర్శిటీ అధికారులు, అధ్యాపకులు విద్యార్థులను ఒత్తిడికి గురిచేయడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ పిల్లో ఆరోపించారు. ఆరు సెమిస్టర్లలో మంచి గ్రేడ్ తెచ్చుకున్న రాజు ఏడవ సెమిస్టర్లో గ్రేడ్ దిగజారినందుకు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాయాన్ని అందులో వివరించారు. తాను మానసిక ఒత్తిడికి గురవుతున్న విషయాన్ని రాజు ఆస్ట్రేలియాలోవున్న స్నేహితురాలికి చెప్పుకున్నారు. యూనివర్శిటీ అధికారుల నుంచి, అధ్యాపకుల నుంచి సాయం తీసుకోవాల్సిందిగా ఆమె రాజుకు సూచించారు. అయితే ఈ యూనివర్శిటీలో సాయం చేసేందుకు తనకు ఎవరూ లేరంటూ రాజు బాధపడ్డారు. ఎన్నో రోజులుగా ఇలా మధనపడుతున్న రాజు చివరకు ఆత్మహత్యనే ఆశ్రయించారు. దీనికి ప్రేమ విఫలమే కారణమంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి అధికారులు సమర్థించుకున్నారు. రాజు మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరిపిన నిజ నిర్ధారణ కమిటీ మాత్రం అధికారుల మాటల్లో వాస్తవం లేదని తేల్చింది. మొత్తం నగరంలోని కాలేజీల్లో చోటుచేసుకున్న 24 మంది విద్యార్థుల మరణంపై ఓ సమగ్ర నివేదికను సమర్పించింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం విద్యార్థులేనని కమిటీ పేర్కొంది. వారంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారవడం వల్ల పట్టణ సంస్కృతికి అలవాటుపడలేక సతమతమవడం, ఇంగ్లీషు నైపుణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడం, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచి రావడం, స్కాలర్షిప్పులు, ఫెల్లోషిప్లపైనే ప్రధానంగా ఆధారపడి బతకాల్సి పరిస్థితుల్లో కొన్ని కళాకాలలు వీటిని అర్ధాంతరంగా ఉపసంహరించడం, కళాశాలల్లోనూ కులాల మధ్య తేడాలు ఉండడం తదితర అంశాలన్నీ విద్యార్థుల ఆత్మహత్యలకు హేతువవుతున్నాయని నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఇంగ్లీషులో వెనకబడిన విద్యార్థులను ముందుకు తీసుకెళ్లేందుకు టీచర్లు అదనపు క్లాసులు తీసుకోవాల్సిందిపోయి అవమానించడం కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు ఒక కారణమేనని కూడా నివేదిక తెలిపింది. ఈ నివేదికలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2013, జూలై ఒకటవ తేదీన విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అమలు చేయాల్సిన మార్గదర్శకాల గురించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వారితోని ఓ కమిటీని వేయాలని, వాటిని ఎప్పటికప్పుడు విచారించి పరిష్కరించేందుకు అకాడమిక్ కమిటీ ఒకటి ఉండాలని, వీలైతే ప్రతి విభాగానికి ఒక అకాడమిక్ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. రెండు కమిటీల మధ్య సమన్వయం కోసం అంబూడ్్లమేన్ ఉండాలని చెప్పింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అంగవికలురకు ప్రత్యేక ప్రిపేటరీ కోర్సులు, బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టాలని, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కౌన్సిలర్లను నియమించాలని హైకోర్టు సూచించింది. ‘నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అండ్ రీసర్చ్ (నల్సర్)’ యూనివర్శిటీ అనుసరిస్తున్న ‘రెస్టోరేటివ్ జస్టిస్ టెక్నిక్స్ ( బాధితులు, నేరస్థుల అవసరాలను, వారి సామాజిక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని తీర్పు చెప్పడం)’ను పాటించాలని, అందుకు ఓ కేంద్రాన్నే ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఈ విషయంలో నల్సర్ లా యూనివర్శిటీ సహాయం తీసుకోవాలని చెప్పింది. కాలేజీల్లో అన్ని వర్గాల విద్యార్థులకు సమానావకాశాలను కల్పించేందుకు యూజీసీ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు సూచించింది. ఇంకా ఇలా చాలా సూచనలే చేసింది. వాటిని అమలు చేసి ఉన్నట్లయితే రోహిత్ వేముల మనకు మిగిలేవారు. -
భగ్గుమన్న విద్యార్థిలోకం
-
భగ్గుమన్న విద్యార్థిలోకం
- హెచ్‌సీయూ దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దద్దరిల్లిన ఢిల్లీ, హైదరాబాద్ - ఢిల్లీలోని మానవ వనరుల శాఖ కార్యాలయం వద్ద - ఐదు గంటలపాటు విద్యార్థి సంఘాల ఆందోళన - ఇది ప్రభుత్వ హత్యేనంటూ నినాదాలు - కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇంటి ముట్టడికి యత్నం - పోలీసులతో ఘర్షణ.. ఉద్రిక్తత - వాటర్ క్యానన్లతో చెదరగొట్టిన పోలీసులు - హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలోనూ మిన్నంటిన ఆందోళనలు.. 144 సెక్షన్ విధింపు - రోహిత్ మృతిపై ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం - దత్తాత్రేయ, వీసీ, తదితరులపై కేసు నమోదు - అంబర్పేట్ శ్మశాన వాటికలో ముగిసిన రోహిత్ అంత్యక్రియలు సాక్షి , న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యపై విద్యార్థి లోకం భగ్గుమంది. ఢిల్లీ దద్దరిల్లింది. విద్యార్థి, దళిత, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. రోహిత్‌ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని నినదించాయి. పార్లమెంటు సమీపంలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్చార్డీ) కార్యాలయం ఎదుట విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అనంతరం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, వాటర్ క్యానన్లు ప్రయోగించడంతో సోమవారమంతా దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) కూడా ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీ నుంచి రోహిత్‌తోపాటు సస్పెన్షన్‌కు గురైన విద్యార్థి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ ైవె స్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏబీవీపీ విద్యార్థులు సుశీల్‌కుమార్, కృష్ణచైతన్యపై ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో ఉలిక్కిపడ్డ హెచ్చార్డీ శాఖ.. రోహిత్ మృతిపై నిజానిజాలను వెలికి తీసేందుకు ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. శాస్త్రి భవన్ వద్ద ఉద్రిక్తత విద్యార్థి సంఘాల ఆందోళనతో హెచ్చార్డీ కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఎస్డీపీఐ, జేఎన్‌యూఎస్‌యూ, కేవైఎస్, దళిత్ స్టూడెంట్ ఫెడరేషన్, ఎస్ఐఓ, యూడీఎస్ఎఫ్, వైఎఫ్డీఏ, బీఏపీఎస్ఏ తదితర విద్యార్థి సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బారికేడ్లను తొలగించి కొందరు కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు నిలువరించారు. విద్యార్థులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. నీళ్లు మొత్తం పూర్తవడంతో పోలీసులు తమ యత్నాన్ని విరమించుకున్నారు. చివరకు మరికొందరు పోలీసులను రప్పించి ఐదు ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక్కడ ఆందోళన సద్దుమణుగుతున్న సమయంలో కొందరు విద్యార్థులు పక్కనే ఉన్న మెట్రో స్టేషన్లోకి పరుగులు తీశారు. వారంతా తుగ్లక్ రోడ్‌లోని హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇక్కడ కూడా పోలీసులు విద్యార్థులపై వాటర్ క్యానన్లు ప్రయోగించి, చివరకు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఏబీవీపీ, బీజేపీ నేతల ఒత్తిడి వల్లే కేంద్రం విద్యార్థులపై చర్యలు తీసుకుందని, కేంద్ర చర్యల వల్లే రోహిత్ మృతి చెందాడని ఆరోపించారు. దత్తాత్రేయ లేఖ కారణంగానే కేంద్రం రంగంలోకి దిగిందని ఆరోపించారు. స్మృతి, దత్తాత్రేయ తక్షణం పదవులకు రాజీనామా చేయాలని, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. అట్టుడికిన హెచ్‌సీయూ ఇటు హెచ్‌సీయూ కూడా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలతో అట్టుడికింది. ఉదయం 6 గంటలకే 300 మందికి పైగా పోలీసులు.. రోహిత్ ఆత్మహత్యకు పాల్పడిన ఎన్ఆర్ఎస్ఐ వింగ్ హస్టల్‌కు చేరుకొని విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. ఉదయం 7.15 గంటలకు మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రోహిత్ మృతదేహన్ని బలవంతంగా తరలించడంతో విద్యార్థులు వర్సిటీలోని పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. అక్కడ వీసీ లేకపోవడం, కార్యాలయానికి తాళం వేసి ఉండటటంతో ‘వెలివాడ’ పేరిట బహిష్కరణకు గురైన విద్యార్థులు కొనసాగిస్తున్న ధర్నా శిబిరం వద్దకు చేరుకున్నారు. వీసీ, క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అలోక్ పాండే, ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్‌ను సస్పెండ్‌చేయాలని, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేత, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రోహిత్ తల్లి రాధిక, సోదరుడు రాజు, సోదరి నీలిమ ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధిక విలేకరులతో మాట్లాడుతూ... తన కొడుకు చాలా ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని అన్నారు. క్యాంపస్‌లోకి వచ్చే వరకు సస్పెన్షన్ విషయం తనకు తెలియదని కన్నీళ్ల పర్వంతమయ్యారు. ‘‘నా కొడుక్కి ఎమ్మెస్సీలో ఆరో ర్యాంక్ వచ్చింది. పీహెచ్డీ ఫ్రీ సీటు వచ్చింది. రెండు సార్లు సీఎస్ఆర్ఐకి క్వాలిఫై అయ్యాడు. అలాంటి మెరిట్ స్టుడెంట్‌ను వేధించి చంపారు’’ అని ఆమె ఆరోపించారు. ఏ తప్పు చేయకపోతే వీసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రోహిత్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దత్తాత్రేయ, వీసీ తదితరులపై కేసు వర్సిటీ నుంచి సస్సెన్షన్‌కు గురైన విద్యార్థుల్లో ఒకరైన ప్రశాంత్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ ైవె స్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏబీవీపీ విద్యార్థులు సుశీల్‌కుమార్, బీజేవైఎం నేత విష్ణుపై ఐపీసీ 306, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రముఖుల దిగ్భ్రాంతి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, ప్రజా గాయకులు గద్దర్, విద్యావేత్త చుక్కారామయ్య, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, పౌర హక్కుల నేత జయ వింధ్యాల, ఎం.బి. రఘునాథ్, ఆవుల బాలనాథం, ప్రజాకవి జయశంకర్, బత్తుల రాంప్రసాద్ తదితరులు ఉస్మానియా ఆసుపత్రికి తరలి వచ్చి రోహిత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి ఆత్మహత్య, విద్యార్థుల సస్పెన్షన్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. విషవాయువు, ఉరితాళ్లు ఇవ్వండి.. దళిత విద్యార్థులు వర్సిటీలో అడ్మిషన్ తీసుకొనే సమయంలోనే ‘10 మిల్లీ గ్రాముల సోడియం యాసిడ్(విష వాయువు), ఉరితాళ్లు ఇవ్వాలంటూ’ తమ సస్పెన్షన్‌కు నిరసనగా గత డిసెంబర్ 18న వీసీ అప్పారావుకు అందజేసినవినతి పత్రంలో రోహిత్ పేర్కొన్నాడు. బాధ కల్గినప్పుడు అంబేద్కర్ భావజాలం గల దళిత విద్యార్థులు ఆ విషవాయువు లేదా ఉరి వేసుకొని ప్రాణం తీసుకునే వెసులుబాటు కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతటి మనో వేదనతో వినతి పత్రం ఇచ్చినా ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. విషయం కోర్టు పరిధిలో ఉందని నిర్లక్ష్యం చేయడంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ కుటంబ నేపథ్యమిదీ.. గుంటూరు జిల్లా గురజాడకు చెందిన రాధిక, మణికుమార్ దంపతుల పెద్ద కొడుకు రోహిత్. సోదరి నీలిమ బీకాం చేశారు. సోదరుడు రాజు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉప్పల్‌లోని ఎన్జీఆర్ఐలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిత్ తండ్రి మణికుమార్ మతిస్థిమితం సరిగ్గా లేని కారణంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గుంటూరులో టైలర్‌గా పనిచేసే రాధిక కొంత కాలంగా ఉప్పల్‌లోని బ్యాంక్ కాలనీలో చిన్న కొడుకు రాజు వద్ద ఉంటోంది. ఈ నెల 13న తల్లితో ఫోన్లో మాట్లాడిన రోహిత్.. పండుగకు వస్తానని చెప్పాడు. పండుగకు రాకపోవడంతో ఆమె ఆదివారం మధ్యాహ్నం రోహిత్ స్నేహితుడు విజయ్‌కి ఫోన్ చేసింది. అదే రోజు సాయంత్రం కొడుకు మృతి వార్త తెలిసింది. సులభంగా విడిచిపెట్టం: జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా రోహిత్ ఆత్మహత్య ఘటనను సులభంగా విడిచిపెట్టబోమని, దీనిపై ప్రభుత్వానికి గట్టి సిఫారసు చేస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రాజకీయ జోక్యం వల్లే మొత్తం విషయం యూ టర్న్ తీసుకుందని అన్నారు. హెచ్సీయూకు వెళ్లి రోహిత్ ఆత్మహత్యపై వివరాలు తెలుసుకొని వచ్చిన ఆయన సోమవారం రాత్రి దిల్‌కుశ గెస్ట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, తమ వైపు నుంచి కూడా విచారణ జరిపే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరతామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు.