'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి' | Rohith mother radhika demands to VC for mistakes of her son | Sakshi
Sakshi News home page

'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'

Published Thu, Jan 21 2016 3:42 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'

'రోహిత్ చేసిన తప్పేంటో వీసీ చెప్పాలి'

హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) వైస్ ఛాన్సలర్ అప్పారావు స్వయంగా వచ్చి తన కుమారుడు చేసిన తప్పేంటో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. రోహిత్ చనిపోయాక తమ ఇంటికి వచ్చి ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించారని ఆమె తెలిపారు.

వీసీ తప్పు చేయకుంటే దొంగతనంగా వచ్చి తమను కలిసేందుకు ఎందుకు ప్రయత్నించారో చెప్పాలని రాధిక ప్రశ్నించారు. తమ కుమారుడు రోహిత్ ఆశయసాధనే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. సస్పెన్షన్కు గురైన మిగిలిన నలుగురి విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ గురువారం మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మనస్తాపంతో ఆదివారం నాడు యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement