రోహిత్ స్మారక కవి సమ్మేళనం, సంచికలు
‘సింగిడి’, ‘హర్యాలి’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని లామకాన్‌లో ‘రోహిత్ వేముల యాది- కవి సమ్మేళనం’ జరగనుంది. స్కైబాబ, వెంకటేష్ చౌహాన్, గోరటి వెంకన్న, జూపాక సుభద్ర, గోగు శ్యామల, అరుణ గోగులమండ, సిద్ధార్థ, యాకూబ్, ప్రసాదమూర్తి, నలిగంటి శరత్, గుడిపల్లి రవి పాల్గొంటారు.
‘బహుజన కెరటాలు’ తేనున్న రోహిత్ స్మారక సంచిక కోసం కవితలు, వ్యాసాలు ఫిబ్రవరి 5లోగా పంపాలని రచయితలను కోరుతున్నారు. పంపాల్సిన మెయిల్: bahujanakeratalu@gmail.com. వివరాలకు: 9849944170
సూరేపల్లి సుజాత, పడవల చిట్టిబాబు, పసునూరి రవీందర్, జెస్సీ, అబుల్ సంపాదకత్వంలో వెలువడనున్న బహుభాషా, బహు ప్రక్రియల రోహిత్ స్మారక సంకలనం కోసం కథలు, కవితలు, వ్యాసాలు, స్పందనలు ఫిబ్రవరి 10లోగా పంపాల్సిందిగా రచయితలను కోరుతున్నారు. చిరునామా: పసునూరి రవీందర్, 114, నేతాజీ నగర్, గుల్‌మొహర్ పార్క్ కాలనీ, శేరిలింగంపల్లి, హైదరాబాద్-19. మెయిల్: dr.pasunuri@gmail.com. ఫోన్: 7702648825
ఒక బాటసారి బైరాగి పదాలు
పూడూరి రాజిరెడ్డి రచనల గురించి విమర్శకుడు కాకుమాని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో మాట్లాడనున్నారు. ‘ఒక బాటసారి బైరాగి పదాలు’ పేరిట ఫిబ్రవరి 7న సాయంత్రం 5:30కి జరిగే ఈ ప్రసంగ కార్యక్రమ నిర్వహణ: ఛాయ సాంస్కృతిక సంస్థ. వేదిక: దోమలగూడలోని ఇందిరా పార్క్ దగ్గరి హైదరాబాద్ స్టడీ సర్కిల్.
ప్రరవే మూడవ మహాసభలు
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మూడవ మహాసభల్లో భాగంగా, ‘సహన, అసహన భావనలు- చారిత్రక, సామాజిక, సాంస్కృతిక పరిణామాలు- ప్రభావాలు’ అంశంపై సదస్సును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఫిబ్రవరి 13, 14 తేదీల్లో నిర్వహించనుంది. మామిడిపూడి వెంకట రంగయ్య హాల్, ఆంధ్ర మహిళాసభ క్యాంపస్, హైదరాబాద్‌నందు జరిగే ఈ సదస్సులో భిన్న అంశాలపై ఉపన్యాసాలు, కవి సమ్మేళనం ఉంటాయి.
ప్రారంభ సభలో కథాకళి కళాకారిణి మాయా కృష్ణారావు ప్రదర్శన, ప్రరవే వ్యాస, కథా సంకలనాల ఆవిష్కరణ ఉంటాయి. జి.హరగోపాల్, వకుళాభరణం రామకృష్ణ, రమా మెల్కోటే, కె.రామచంద్రమూర్తి, నందిని సిధారెడ్డి, సంధ్య, కృష్ణారావు, మోహన్, తోట జ్యోతిరాణి, ఎన్.శంకర్, గణేషన్, డానీ, కె.సునీతారాణి, దార్ల వెంకటేశ్వరరావు, పి.విక్టర్ విజయ్‌కుమార్, కె.ఎన్.మల్లీశ్వరి పాల్గొంటారు.