Maternal
-
Janhavi Nilekani: నార్మల్ డెలివరీలు ‘నార్మల్’ కావాలి
గర్భవతుల విషయంలో సాధారణ ప్రసవం అనే మాట ఈ రోజుల్లో ఆశ్చర్యంగా మారింది. దేశమంతటా సిజేరియన్ ప్రసవాలు పెరిగాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా తన నివేదికల్లో చూపింది. అయితే, ప్రభుత్వ– ప్రైవేట్ ఆసుపత్రులలో నార్మల్, సిజేరియన్ ప్రసవాల సంఖ్యలో తేడా మాత్రం ఉంది. ఈ విషయాన్ని తన సొంత అనుభవంతో గమనించిన ఫిలాంత్రపిస్ట్ డాక్టర్ జాన్హవి నిలేకని మెటర్నల్ హెల్త్‌కేర్ వైపు దృష్టి సారించింది. బెంగళూరులో మురికివాడల్లోని నగర గర్భిణుల్లో సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆస్ట్రికా మిడ్వైఫరీ పేరుతో ప్రసవాల సెంటర్‌నూ ప్రారంభించింది. సాధారణ ప్రసవం ఆవశ్యకతవైపు వేసిన ఆమె అడుగుల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘చదువుకుంటున్నప్పుడే స్వదేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉండేవి. అమ్మ మరాఠీ, నాన్న కోంకణి. పుణేలో పుట్టి, బెంగుళూరులో పెరిగాను. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లాను. నా భర్త యేల్ జార్ఖండ్‌కు చెందినవాడు. ఆ విధంగా నేను ఒకే ఒక ప్రాంతానికి చెందినదానిని అని చెప్పలేను. 2012లో పెళ్లయ్యింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కర్ణాటక లో రీసెర్చ్ చేస్తున్నాను. ఆ సమయంలో నార్మల్ డెలివరీ కోసం నగరాల్లోని చాలా ఆసుపత్రుల వారిని కలిశాను. కానీ, నార్మల్ డెలివరీకి వారెలాంటి హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసింది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో గర్భిణులకు సరైన సమయంలో మందులు, డాక్టర్లు, నర్సుల సేవ అందడం లేదనీ, దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆ సమయంలోనే తెలుసుకున్నాను. ప్రయివేటు ఆసుపత్రులు సిజేరియన్ ప్రసవాన్ని వ్యాపారంలా మార్చేశాయి. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం జమ్మూ, కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని 80 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. సి–సెక్షన్ ఆ మహిళకు, బిడ్డకు మంచిది కాదు. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నప్పటికీ సర్జరీ చేయడం తప్పు. కానీ, వైద్యులు సాధారణ ప్రసవానికి చాలా సమస్యలు చెప్పారు. ఆ విషయంలో నాకు ఎన్నో సందేహాలు తలెత్తాయి. చివరకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. దేశమంతటా.. మొదట వాయుకాలుష్యంపై పరిశోధనలు చేస్తూ వచ్చాను. కానీ, బిడ్డ పుట్టాక మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేయాలనుకున్నాను. 2019లో ఆస్ట్రికా ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీని ద్వారా భారతదేశం అంతటా ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, జీఎన్ఎమ్లకు శిక్షణ ఇచ్చాను. దీంతో వారు సురక్షితమైన ప్రసవం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అనవసరమైన సిజేరియన్ ప్రసవాల నుంచి వారిని రక్షించగలుగుతున్నారు. ప్రసవ సమయంలో అగౌరవం ప్రతి గర్భిణి గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ పొందాలి. కానీ, ఒక గర్భిణికి నొప్పులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలోని లేబర్‌రూమ్‌లో సిబ్బంది ఆమె మీద చెడు మాటలతో విపరీతంగా అరుస్తారు. చెప్పుతో కొట్టడం కూడా చూశాను. ఇది నాకు చాలా పాపం అనిపించింది. ఇలా జరగకూడదు, దీన్ని ఆపాలి అనుకున్నాను. 2021 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ వచ్చాను. అది కూడా సరిపోదని ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టాను. ధనికులైనా, పేదవారైనా ప్రతి స్త్రీకీ మంచి చికిత్స పొందే హక్కు ఉంది. ఇది గుర్తించే, బెంగళూరులోనే ఒక పేరున్న ఆసుపత్రిలో నా ఏడు పడకల కేంద్రాన్ని ప్రారంభించాను. గర్భిణిని కూతురిలా చూసుకునే మంత్రసాని ఉండాలని నమ్ముతాను. విదేశాల నుంచి సర్టిఫైడ్ మంత్రసానులను, వైద్యులను ఈ సెంటర్లో నియమించాను. ఎందుకంటే, ఇక్కడ చేరడానికి డాక్టర్లు ఎవరూ రెడీగా లేరు. దీంతో బయటివారిని సంప్రదించాల్సి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ పనిచేయడానికి నాకు చాలా టైమ్ పట్టింది. అంతేకాదు, హాస్పిటల్లో ప్లేస్ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకంటే సి–సెక్షన్ లకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక నార్మల్ డెలివరీ అంటేనే మహిళలు, వారి కుటుంబసభ్యులు కూడా భయపడుతున్నారు. వారి దృష్టిలో సిజేరియన్ డెలివరీ సురక్షితమైంది. కౌన్సెలింగ్‌తో నార్మల్... నా సంస్థ కర్ణాటక వాణివిలాస్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఓ రోజు హాస్పిటల్ బోర్డ్ మెంబర్ డ్రైవర్ భార్య మా సెంటర్‌కి వచ్చింది. ఆమె నార్మల్ డెలివరీకి భయపడింది. మా మంత్రసాని ఆమె మనసులోని భయాన్ని కౌన్సెలింగ్ ద్వారా తొలగించింది. ఫలితంగా ఆమెకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన సాధారణ ప్రసవం జరిగింది. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. అంటే, వారికి మానసిక, శారీరక బలాన్ని అందిస్తాం. వారికి సహాయం చేయడానికి మా బృందం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండేళ్లలో 200 మంది గర్భవతులలో కేవలం ఇద్దరికి మాత్రమే సిజేరియన్ అవసరం పడింది. అది కూడా వారికి ప్రసవంలో సమస్య ఉండటం వల్ల. మిగతా అందరికీ సాధారణ ప్రసవాలు జరిగాయి. ఆస్ట్రికా మిడ్వైఫరీ సెంటర్లో ముప్పైమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచంలో ఉన్న నర్సులు, మంత్రసానుల కోసం ఆస్ట్రికా స్పియర్ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా సిబ్బంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది సర్టిఫికెట్లు పొందారు. యూరప్ నుంచి కూడా అధ్యాపకులు ఉన్నారు. మా మెటర్నిటీ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి కోర్సులను కూడా అందిస్తుంది. ప్రసూతి మరణాలకు ప్రధాన కారణాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని వివరిస్తారు జాన్హవి. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. – డాక్టర్ జాహ్నవి నిలేకని -
పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని..
యూపీలోని బాందాలో ఇటీవలే వివాహం జరిగిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టింటికి వెళ్లిన భార్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు ఈ ఘటన గురించి మాట్లాడుతూ మృతుడు మద్యం కోసం ఇంటిలోని నగలను అమ్మేశాడని, ఆ సమయంలో అతని భార్య అతనిని అడ్డుకున్నదని తెలిపారు. ఒకరోజు ఆలయంలో అందరి ముందు భార్యను కొట్టాడని పేర్కొన్నారు. ఈ విషయమై ఆగ్రహించిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. పోనులో వీరిద్దరి మద్య వాగ్వాదం జరిగింది. పుట్టింటిలో ఉన్న ఆమెను వెంటనే అత్తవారింటికి రమ్మని కోరాడు. ఆమె అత్తారింటికి రానని తెగేసి చెప్పింది. దీంతో కలత చెందిన భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. ఈ కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవ్ థోక్ గ్రామానికి చెందిన నరేంద్రకు రెండు నెలల క్రితం చిత్రకూట్ జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా సరేంద్ర దంపతులు వేరు కాపురం పెట్టారు. మద్యానికి బానిస అయిన నరేంద్ర భార్య నగలు అమ్మేశాడు. ఈ నేపధ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కలత చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కూడా చదవండి: రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే.. -
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
అమ్మ కడుపు చల్లగా.. ఏపీలో రెండేళ్లుగా తగ్గిన మాతా, శిశు మరణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా మహిళలు, బాలల ఆరోగ్యం పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, ఎప్పటికప్పుడు వైద్యం, మందులు అందిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. జాతీయ స్థాయి సగటుతో పోల్చితే ప్రసూతి మరణాలతో పాటు శిశు మరణాలు రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా ప్రసూతి మరణాలు తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించినట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రసూతి మరణాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రగతిని సాధించిందని పేర్కొంది. సుస్థిర ప్రగతి లక్ష్యం మేరకు ప్రతి లక్ష ప్రసవాల్లో ప్రసూతి మరణాలు 70లోపు ఉండాలి. 2017–18లో రాష్ట్రంలో లక్ష ప్రసవాల్లో 58 ప్రసూతి మరణాలు సంభవించగా 2020లో ఈ సంఖ్య 45కు తగ్గినట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గత నెలలో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జాతీయ స్థాయిలో కూడా ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గినప్పటికీ రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ ఉన్నాయి. 2017–18లో జాతీయ స్థాయిలో ప్రతి లక్ష ప్రసవాల్లో 103 ప్రసూతి మరణాలు సంభవించగా 2020లో 97కు తగ్గాయి. అలాగే సజీవ జననాల్లో శిశు మరణాలు జాతీయ స్థాయికన్నా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యి సజీవ జననాల్లో శిశు మరణాలు 2018లో 29 ఉండగా 2019లో 25కు, 2020లో 24కు తగ్గినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇదే జాతీయ స్థాయిలో వెయ్యి సజీవ జననాల్లో 2018లో 32 శిశు మరణాలు సంభవించగా 2019లో 30కు, 2020లో 28కు తగ్గినట్లు తెలిపింది. ఆస్పత్రుల్లోనే 97 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో ఆస్పత్రుల్లో కాన్పులు 92 శాతమే ఉంటే.. 2019 – 21లో 97 శాతానికి పెరిగింది. అత్యధిక కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. మూడు శాతమే ఇళ్ల వద్ద జరుగుతున్నాయి. పటిష్ట ప్రణాళికతో గర్భిణులు, శిశువుల పరిరక్షణ మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గర్భిణులు, శిశువుల పరిరక్షణకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను అమలు చేస్తోంది. వలంటీర్లు సచివాలయాల స్థాయిలో గర్భిణులు, 5 ఏళ్లలోపు బాలల వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నారు. పిల్లలు, గర్బిణుల డేటా, ఆధార్‌ను ఆర్సీహెచ్ (పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్య) పోర్టల్ ఐడీతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 2.59 లక్షల గర్భిణుల వివరాలను మ్యాపింగ్ చేశారు. ఈ వివరాలను సచివాలయాల గృహ కుటుంబాల డేటాలో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోఎక్కువ ప్రమాదం గల గర్భిణులను గుర్తించి వారికి సుఖ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లు నిరంతరం గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పదిహేను రోజులకు ఏఎన్ఎం స్వయానా ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు అందిస్తున్నారు. చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ అవసరమైన వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద గర్భిణులకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. శిశువుల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్ (ఎస్ఎన్సీయూ )లు పనిచేస్తున్నాయి. 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరమైన టీకాలు ప్రభుత్వం వేయిస్తోంది. బాలలకు ఐఎఫ్ఏ సిరప్, డి–వార్మింగ్, విటమిన్ ఏ చుక్కలు అందిస్తోంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత లేకుండా చూడటం వలన గర్భిణులు, శిశువులకు నిరంతర వైద్య సేవలు అందుతున్నాయి. -
బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ప్రసవం తర్వాత కూడా..
స్త్రీలు తమ జీవితంలో మాతృత్వాన్ని వరంగా భావిస్తుంటారు. అయితే, మారుతున్న సమాజం, జీవన పరిస్థితులు వీటితో పాటు విభిన్న రంగాలలో.. వివిధ వృత్తులలో రాణిస్తున్న మహిళలు పనుల దృష్ట్యానో, స్థిరపడలేదనో.. బిడ్డలను కనే సమయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. కొన్నిస్లారు వృత్తికి – అందానికి ముడిపెట్టే సందర్భాలూ తలెత్తుతుంటాయి. ఇలాంటప్పుడు వైద్యపరంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ కొత్త వివాదాలకు దారులు తీస్తుంటారు. సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వీటిలో మంచీ చెడులు ఎలా ఉన్నా ప్రసవం తర్వాత స్త్రీ శారీరక స్థితిని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగే పరిస్థితుల పట్ల అవగాహన కలిగి ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు. ఇటీవల సినీనటి నయనతార సరోగసి విధానం ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యిందనే వార్త వైరల్ అవుతోంది. అందం ప్రధానాంశంగా ఈ వార్త చర్చనీయాంశం అయ్యింది. పిల్లలు పుట్టిన తర్వాత శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే, వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదని గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి తల్లి అయినవారు తమ జీవనశైలి గురించి ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తుంటారు. ఇందులో భాగంగా ఇటీవల సినీనటి కాజల్ అగర్వాల్ బిడ్డను కన్నాక తన శరీరంలో వచ్చిన మార్పులు, వాటిని అనుకూలంగా మార్చుకునే పద్ధతుల మీద రిలీజ్ చేసిన నోట్ కూడా వైరల్ అవుతోంది. ఇలాంటప్పుడు కుటుంబ, సామాజిక, ఆరోగ్యకరమైన జీవనశైలికి స్వయంగా తీసుకోదగిన నిర్ణయాల్లో అవగాహన ప్రధాన అంశం అవుతుంది.. ♦ నాలుగు నెలల నుంచి.. మాతృత్వపు ఆనందాన్ని పొందుతూనే వృత్తిపరంగా తనను తాను మలుచుకుంటున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న స్వీయఅనుభవాలలో ‘మాతృత్వం అంటే కెరీర్‌కు ముగింపు కాదు. కెరీర్ గురించి ఆలోచిస్తున్నామంటే బిడ్డను నిర్లక్ష్యం చేయడం కాదు. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోతాం అనే భావన కానీ, గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరమే లేదు. ప్రసవం తర్వాత వర్క్‌లోకి వెళ్లడానికి కొంత సమయం పట్టచ్చు. కానీ, మన ప్రాధాన్యతలను సెట్ చేసుకుంటే ప్రతీది సరిగ్గా, సులభంగా చేయచ్చు. నేను ప్రసవం అయ్యాక నాలుగు నెలల నుంచి తిరిగి పని చేయడం మొదలుపెట్టాను. ముందు నా శరీరం ఎలా ఉండేదో.. తర్వాత ఎలా ఉంటుందో అనే ఆలోచన నాకు లేదు. బిడ్డ పుట్టడం అనుభూతిని నేను పొందగలిగాను. శారీరక శ్రమ ద్వారా నా బాడీని నేను కాపాడుకోగలనన్న నమ్మకం నాకుంది. అందుకు జిమ్‌కు వెళుతున్నాను. గుర్రపు స్వారీ మునుపటి కన్నా కష్టంగా ఉన్నట్టు మొదట్లో అనిపించింది. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కూడా అలాగే అనిపించింది. నా శక్తిస్థాయిలను తిరిగి పొందడానికి చేసే ప్రక్రియ మునుపటి కన్నా కొంత కష్టమైనదే. కానీ, తిరిగి నైపుణ్యాల సాధనను ఒక హాబీగా కొనసాగించేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు ఈ ప్రక్రియ నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది’ అని రాసిన ఈ నోట్ ఎంతో మంది తల్లులకు స్ఫూర్తినిస్తుంది. ♦ రెండు నెలల నుంచి .. ఇరవై ఏళ్లుగా హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్‌గా ఉన్న అనుప్రసాద్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ– ‘నార్మల్ డెలివరీ అయినవాళ్లు రెండు నెలల నుంచీ, సిజేరియన్ అయితే ఆరు నెలల నుంచి జిమ్‌లో వ్యాయామాలు చేయచ్చు. ముందుగా వారి వివరాలను జిమ్ ట్రైనర్‌కి చెప్పి, తగిన వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇరవై ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నాను, ఎంతో మంది మహిళలకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చాను. బాడీఫిట్నెస్కు కృషి చేసేవారిలో అమ్మాయిలే కాదు, అమ్మలూ ఉన్నారు. ప్రసవం తర్వాత కొన్నాళ్ల పాటు పిల్లల పనులు, ఇంటి పనులతో తీరికలేదని.. వ్యాయామం అనే ఆలోచన చేయరు. దీంతో పాటు వీరు తీసుకునే ఆహారం సరైనదిగా ఉండకపోవడంతో శరీరంలో మరిన్ని మార్పులు వస్తాయి. అందుకే, చాలా మందిలో ‘పిల్లలు పుట్టాక శరీరం లావు అవుతుంది లేదంటే, షేప్ ఉండదు..’ అనుకుంటారు. కానీ, నిజానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది’ అని వివరించారు. ♦ ఆరు వారాల నుంచి.. ప్రసవం తర్వాత తల్లులకు చెప్పే జాగ్రత్తలలో వ్యాయామం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీష. ‘ప్రీ ప్రెగెన్సీలో ఉన్న ప్రతి సిస్టమ్ ప్రసవం తర్వాత ఆరు వారాల సమయంలో సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తపడమని చెబుతాం. అలాగే, కొద్ది రోజులు బరువులు ఎత్తకుండా సాధారణ పనులు చేసుకోవచ్చు. మంచి ప్రొటీన్స్ ఉన్న పోషకాహారం తీసుకోవాలి. సిజేరియన్ అయితే గాయం మానడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ఇంటి వద్ద చేయదగిన వ్యాయామాల గురించి వివరిస్తాం’ అని తెలిపారు. అందం మాతృత్వానికి ఎప్పుడూ కొలమానం కాదు. జీవన విధానంలో వచ్చే ఆనందాలను పొందుతూనే, ఎంచుకున్న రంగంలో విజయశిఖరాలను అంతే హుందాగా పొందవచ్చు. అపోహలకు దూరం ప్రసవం తర్వాత మూడు నెలల నుంచి వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. పోస్ట్ నేటెల్ ఎక్సర్సైజులు అని ఉంటాయి. ఈ వ్యాయామం వల్ల చర్మం, కండరాలు తిరిగి వాటి సాధారణ స్థితికి వచ్చేస్తాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల అందం పోతుందని కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఎక్కువ సేపు ఫీడింగ్ ఇవ్వకుండా ఉన్నా సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. మన జీవన శైలి సరిగ్గా ఉంటే శరీరాకృతిలో పెద్ద మార్పులు రావు. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్ తగినంత సాధన జిమ్‌లో వ్యాయామాలు చేయాలనుకున్నవారు ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. వారి ఇతరత్రా ఆరోగ్య సమస్యలను బట్టి నెమ్మదిగా వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. ఒకేసారి వర్కౌట్స్ కాకుండా లైట్‌వెయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి రోజూ కొద్దిగా టైమ్‌ను పెంచుకుంటూ శరీరానికి వ్యాయామం అలవాటు చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. దీంతో వారి పూర్వపు శరీరాకృతి వచ్చేస్తుంది. వాకింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీ రోజూ గంట సేపు చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు నూనె, చక్కెర, జంక్ పదార్థాలు కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగానూ, యాక్టివ్‌గానూ ఉంటారు. – అనుప్రసాద్, హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ – నిర్మలారెడ్డి -
తల్లి గర్భంలోనే రుచుల మక్కువ
లండన్: కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలపై జిహ్వచాపల్యం ప్రదర్శిస్తారు. మరికొందరు వాటిని చూడగానే ఇబ్బందిగా మొహంపెడతారు. ఇలా ఆహారాన్ని ఇష్టపడడం లేదా పడకపోవడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుందని ఇంగ్లాండ్‌లోని డర్హాం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తల్లి తీసుకొనే ఆహారం, వాటి రుచులకు గర్భంలోని శిశువులు చక్కగా స్పందిస్తున్నట్లు గమనించారు. 18–40 ఏళ్ల వయసున్న 100 మంది గర్భిణులకు 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహించారు. 32, 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు రెండుసార్లు స్కానింగ్ చేశారు. 100 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. స్కానింగ్‌కు 20 నిమిషాల ముందు మొదటి గ్రూప్‌లోని గర్భిణులకు క్యారెట్‌ను, రెండో గ్రూప్‌లోని వారికి క్యాబేజీని 400 ఎంజీ మాత్రల రూపంలో ఇచ్చారు. మూడో గ్రూప్‌లోని గర్భిణులకు ఏమీ ఇవ్వలేదు. క్యారెట్ మాత్ర తీసుకున్న మహిళల గర్భంలోని శిశువుల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. క్యాబేజీ మాత్ర తీసుకున్న వారి గర్భంలోని శిశువులు మాత్రం ఇష్టం లేదన్నట్లుగా ముఖం చిట్లించారు. మాత్రలేవీ తీసుకోనివారి గర్భంలోని శిశువుల్లో ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ అధ్యయనం వివరాలను సేజ్ జర్నల్‌లో ప్రచురించారు. గర్భిణి తీసుకొనే ఆహారం శిశువును కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే జన్మించిన బిడ్డలు చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చుకొంటారని తెలిపారు. గర్భస్థ శిశువలకు నిర్ధిష్ట ఆహారం పరిచయం చేస్తే భవిష్యత్తులో దానిపైవారు మక్కువ పెంచుకుంటారని సూచించారు. -
ఈ రాత్రికి నేను సజీవంగా ఉంటానో లేదో: మహిళ ఆడియో సంచలనం
తిరువనంతపురం: కేరళలో మహిళలపై వేధింపులు, హింస కేసుల నమోదు రోజురోజుకు తీవ్రమవుతోంది. నిన్నగాక మొన్న వివాహితను దారుణంగా హత్య చేశాడో ఉన్మాది. తాజాగా అత్తింటి వేధింపులతో కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యన్నూర్‌కు చెందిన సునీషా ఉరి వేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ రాత్రికి తాను ప్రాణాలతో ఉంటానో లేదో అనుమానమే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సునీషా (26) తన సోదరుడితో మాట్లాడిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సునీషా ఒకటిన్నర సంవత్సరాల క్రితం విజేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఆదివారం అత్తమామల ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద రీతిలో శవమై తేలింది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు సోదరుడు సుధీష్‌తో భర్త, అత్తమామల వేధింపులు, తాను అనుభవిస్తున్నమానసిక క్షోభ గురించి ఫోన్ ద్వారా మొరపెట్టుకుంది. భర్త తీవ్రంగా కొట్టడం, అత్త జుట్టుపట్టుకుని లాగడం లాంటి విషయాలను చెప్పుకుంది. అలాగే మామ కూడా హెల్మెట్‌తో తనపై దాడి చేశాడని కూడా బాధితురాలు వాపోయింది. అంతేకాదు ఈ రాత్రి నేను సజీవంగా ఉంటానా డౌటే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆడియో ఇపుడు స్థానిక మీడియాలో వైరల్‌గా మారింది. భర్త కొడుతుండగా సునీషా మరో ఆడియో రికార్డు చేసింది. తన అత్త కొడుతున్నపుడు, మామ తనతో అసభ్యంగా ప్రవర్తించినపుడు ఎందుకు మాట్లాడలేదని భర్తని ప్రశ్నించడం, అలాగే తనను కొడుతున్న విజువల్స్ కూడా రికార్డ్ చేస్తానని సునీషా చెప్తే.. ఏం చేసుకుంటావో..చేసుకో పో అని విజేష్ చెప్పడం లాంటివి ఇందులో రికార్డైనాయి. దీంతో మొదట సునీషాది ఆత్మహత్యగా భావించినా, అత్తింటి వారే ఆమెను హత్యచేసి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి : మహిళపై రెచ్చిపోయిన ఉన్మాది,15 కత్తి పోట్లు, చివరికి.. మరోవైపు తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లైన దగ్గర్నుంచీ విజేష్, అతని తల్లిదండ్రులు సునీషాను వేధించారన్నాని సోదరుడు తెలిపాడు. దీంతో ఆమెను ఇంటికి తీసుకుపోవాలని చాలాసార్లు ప్రయత్నించినా, ఇందుకు విజేష్ సుతరామూ అంగీకరించ లేదన్నాడు. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చేటపుడు ఒంటరిగా రావద్దని, రాజకీయ పలుకుబడి ఉన్న అత్తింటివాళ్లు ఏదైనా చేస్తారని కూడా తనను హెచ్చరించిందని సుధీష్ తెలిపాడు. ఆమెను అక్కడినుంచి తీసుకొచ్చేందుకు పయ్యన్నూర్ పోలీసులను ఆశ్రయిస్తే.. ఆ కుటుంబంతో మాట్లాడి రేపు వస్తుంది, మాపు వస్తుంది కావాలనే తాత్సారం చేశారని ఆరోపించాడు. సునీషాను బయటకు అనుమతించకుండా కట్టడి చేశారని ఒక్కోసారి ఆమెకు తిండికూడా పెట్టేవారు కాదని వాపోయాడు. కాగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు పయ్యన్నూర్ పోలీసులు తెలిపారు. -
కోతుల భయం.. తీసింది ప్రాణం
మద్దిరాల: కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి బాలింత దుర్మరణం పాలైంది. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలతకు అర్వపల్లి మండలం అడివెంలకు చెందిన జేసీబీ డ్రైవర్ దోమల సైదులుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికే నాలుగేళ్ల కొడుకు బిట్టు, రెండున్నరేళ్ల కుమార్తె మాన్యశ్రీ ఉన్నారు. మూడో కాన్పు కోసం శ్రీలత (24) మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. నెల క్రితం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం తల్లిగారింటి ముందు రేకుల షెడ్ కింద ఊయలలో చిన్నారి పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో శ్రీలత బట్టలు ఉతికి ఆరేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు దాడిచేసింది. కోతుల బారి నుంచి తప్పించుకుని బాబును తీసుకుని ఇంట్లోకి వెళ్లాలనుకున్న శ్రీలత.. కోతుల గుంపు మరింత ముందుకు ఉరకడంతో భయంతో బాబును అక్కడే ఉంచి ఇంట్లోకి పరుగుతీసింది. ఈ క్రమంలో గడప తగిలి కిందపడగా, అటుపక్కనే ఉన్న మంచంకోడు తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి కోతుల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గుడ్లు చాలవు.. పాలు అందవు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పౌష్టికాహార పంపిణీ గాడి తప్పుతోంది. పంపిణీలో సమస్యలను పరిష్కరించకపోవడం... పలు చోట్ల పంపిణీ దారులను ఎంపిక చేయకపోవడం... స్టాకు ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాశీన వైఖరితో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక సమస్యలు తీవ్రమవుతున్నాయి.ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతీ రోజు 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. పౌష్టికాహారలోపం తీవ్రంగా ఉన్న పిల్లలు, బాలింతకు అదనంగా మరో 100 మిల్లీ లీటర్ల పాలు అందజేయాలి. వీటితో పాటు పూర్తి పోషక విలువలున్న ఆహారాన్ని సైతం వడ్డించాలి. కానీ చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్ల పంపిణీ గందరగోళంగా మారింది. పలు జిల్లాల్లో పాలు, గుడ్ల సరఫరాదారుల ఎంపిక ప్రక్రియే పూర్తి కాలేదు. కొన్ని చోట్ల సరఫరా దారులను ఎంపిక చేసినప్పటికీ సాంకేతిక కారణాలు, సరఫరాలో సమస్యలను అధిగమించకపోవడంతో అది అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటి పరిధిలో 5.31లక్షల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 7నెలల నుంచి 3 ఏళ్ల లోపు వయసున్న వారు 10.42 లక్షల మంది, ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులు 6.54లక్షల మంది నమోదయ్యారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, పౌష్టికాహారాన్ని అందివ్వాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఈ క్రమంలో అంగన్వాడీల్లో హాజరు శాతం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పాలు, గుడ్లు పొందిన వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. సిద్దిపేట, ఆసీఫాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో హాజరు, లబ్ధి వత్యాసం అధికంగా ఉంది. ఈ వత్యాసాన్ని లోతుగా పరిశీలిస్తే అక్కడ సరుకుల పంపిణీలోని లొసుగులు బయటపడుతున్నాయి. రెండు నెలలుగా అరకొరే... అంగన్వాడీ కేంద్రాలకు గత రెండు నెలలుగా పాలు, గుడ్ల సరఫరా లోపభూయిష్టంగా ఉంది. కేంద్రాలకు హాజరవుతున్న విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాకపోవడంతో సరఫరా కావడం లేదని కొన్నిచోట్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఓటీపీలు రావడం లేదని, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గుడ్లు ఇవ్వలేక పోయామని కాంట్రాక్టర్లు అంటున్నారు. వాస్తవానికి ఓటీపీలు రాకపోతే సీడీపీఓలకు మరోమారు అర్జీ పెడితే సరిపోయేదని, కాంట్రాక్టర్లు తప్పించుకునే ధోరణితో ఇలా సరఫరా చేయడం లేదంటున్నారు. పలురకాల సమస్యలతో అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో సరుకులు చేరడం లేదు. ఈ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ ఆగమాగం కావడంతో చిన్నారులు, బాలింతల్లో పోషకాహార సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. -
బాలింతతో ఒంగోలు రిమ్స్ డైరెక్టర్ వేటకరం
-
బాలింతలకూ నోటు కష్టాలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ఆర్.శాంతి. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం నాయకన్ తండాకు చెందిన ఈమె పదిరోజుల క్రితమే నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రిలో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేయించుకున్న శాంతికి జననీ సురక్ష యోజన కింద రూ.1000 విలువ గల చెక్కును ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చారు. దానిని నగదుగా మార్చుకునేందుకు శాంతి శనివారం హాలియా ఎస్‌బీహెచ్‌కు వచ్చింది. లైన్ చాంతాడంత పొడవు ఉండడంతో బ్యాంక్‌లో ఉన్న ఓ కుర్చీపై ఇలా నవజాత శిశువును పడుకోబెట్టి పడిగాపులు కాసింది. కాసేపటికే మరో బాలింత కూడా నవజాత శిశువును శాంతి పక్కనే పడుకోబెట్టి లైన్లో నిలబడింది. నగదు కొరత కారణంగా నాలుగు గంటలు నిరీక్షించిన అనంతరం అధికారులు కనికరించడంతో మధ్యాహ్నం 3 గంటలకు చెక్కును మార్చుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. -
డాక్టర్ల నిర్లక్ష్యంపై కన్నెర్ర
= చికిత్స పొందుతూ బాలింత మృతి = ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోâýæన, ఉద్రిక్తత = చూసేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో బంధువు మృతి = తల్లిదండ్రులకు గాయాలు = రంగంలోకి దిగిన పోలీసులు హిందూపురం అర్బన్: హిందూపురంలోని తేజ నర్సింగ్ హోం ఎదుట లేపాక్షి మండలం ఉప్పరపల్లి వాసులు శనివారం ఆందోâýæనకు దిగారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ధర్నా చేశారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అసలేం జరిగిందంటే... ఉçప్పరపల్లికి చెందిన మంజుల(19)ను ప్రసవం కోసం నవంబరు 19న హిందూపురంలోని తేజ నర్సింగ్ హోంకు తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి ఆమెకు సిజేరియ¯ŒS ఆపరేష¯ŒS చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. అదే రాత్రి ఇంటికెళ్లిన కాసేపటికే ఒళ్లంతా నొప్పులు, కడుపు ఉబ్బరమంటూ తిరిగి ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స మొదలుపెట్టిన వైద్యులు 28 రోజులుగా చికిత్స అందిస్తూ వచ్చారు. శనివారం సాయంత్రం ఆమె మృతి చెందింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపకుండా ఆస్పత్రికిసం బంధించిన అంబులెన్సును రప్పించి మృతదేహాన్ని అందులో ఉంచారు. ఇంతలో భర్త, బంధువులు వచ్చి ‘మాకేం చెప్పకుండా ఎందుకు పంపించేస్తున్నారంటూ’ ప్రశ్నించారు. అసలు విషయం చెప్పడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. వైద్యుల తీరును తప్పుబట్టారు. వాస్తవాలు చెప్పకుండా ఇప్పుడు మృతదేహాన్ని అప్పగిస్తారా అంటూ నిలదీశారు. న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆస్పత్రి ఎదుటే బైఠాయించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు విషయం తెలుసుకున్న వ¯ŒSటౌ¯ŒS సీఐ ఈదురుబాషా, ఎస్ఐ వెంకటేశ్ తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోâýæనకారులతో చర్చించారు. చివరకు నష్ట పరిహారం ఇచ్చేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో వారు ఆందోâýæన విరమించారు. చూసేందుకు వస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురై... ఆస్పత్రిలో తమ బిడ్డ మంజుల మృతి చెందినట్లు తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు అక్కమ్మ, చిన్ననరసప్ప సహా సమీప బంధువులు కర్ణాటకలోని శిడ్లఘట్ట సమీపంలో గల గొరిమినుపల్లినుంచి హుటాహుటిన కారులో హిందూపురం బయలుదేరారు. మార్గమధ్యంలోని ఆంధ్ర సరిహద్దులోని గడిదం గ్రామం వద్దకు రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న(మంజులకు వరుసకు అత్తయ్యే) బంధువు మృతి చెందారు. ఆమె తల్లిదండ్రులకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను కర్ణాటకలోని గౌరిబిదనూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించినట్లు బంధువులు తెలిపారు. -
బాలింతల కోసం యాప్స్
కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు - జీవితంలో ఒక భాగమైపోయిన రోజులివి. సినిమా టికెట్ నుంచి బయటకు వెళ్ళడానికి కారు బుక్ చేసుకోవడం దాకా అన్నీ స్మార్ట్ఫోన్లు, వాటిలోని రకరకాల అప్లికేషన్స్ (యాప్స్)తో జరిగిపోతున్నాయి. ఇంటా, బయటా చేతి నిండా పనులతో ఆకాశంలో సగంగా మారిన ఆడవారికి ఉపయోగంగా ఉండడం కోసం చాలా యాప్స్ వచ్చాయి. ముఖ్యంగా, ఒకవైపు ఇంటి పని, మరోవైపు పసిపాప పని చూసుకోవాల్సిన చంటిపిల్లల తల్లులను దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేక యాప్స్ కూడా తయారయ్యాయి. అలాంటి వాటిలో కొన్నిటి గురించి... బేబీ ట్రాకర్: క్షణం తీరిక లేకుండా గడిపే బిజీ బిజీ తల్లితండ్రులు తమ కోసం తాము తయారుచేసుకున్న యాప్ - ‘బేబీ ట్రాకర్’. ఈ యాప్ వల్ల చంటిపాప రోజువారీ అలవాట్లు, ఆరోగ్యం, మొదటిసారిగా పాపాయి బోర్లాపడిన సంగతులు అన్నీ నమోదు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈ యాప్‌లో పాపకు పాలు పట్టిన వేళలు, పొత్తిగుడ్డలు మార్చిన సమయం, నిద్ర అలవాట్ల లాంటివన్నీ నమోదు చేస్తూ, ఫోటోలు కూడా చేర్చడం వల్ల ఉపయోగాలున్నాయి. డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు, లేదంటే ఆఫీసు వేళల్లో శిశు సంరక్షకుల దగ్గర బిడ్డను కొద్దిగంటలు వదిలివెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ యాప్‌లో నమోదు చేసిన సంగతులన్నీ టైమ్‌కి పనికొస్తాయి. అలాగే, చంటిపాపకు సంబంధించిన ఆ తొలినాళ్ళ తీపి జ్ఞాపకాలన్నీ చుట్టాలకూ పక్కాలకూ చూపించి, ఆనందించవచ్చు. అలాగే, ఈ యాప్‌లో పెట్టుకున్న సమాచారం ద్వారా పసిబిడ్డ అలవాట్లు ఏ వారానికి ఆ వారం, ఏ నెలకు ఆ నెల ఎలా మారుతున్నాయో బాలింతరాలైన అమ్మకు ఇట్టే అర్థమవుతుంది. పెప్పెర్ ట్యాప్: ఇంట్లో చంటిపాపను చూసుకోవాలి, బజారు నుంచి ఇంటికి సామాన్లూ తెచ్చుకోవాలి. ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు లేక ఇబ్బందిపడుతున్నారా? మీ ఇబ్బంది ఇప్పుడు మటుమాయం. ఈ సరికొత్త యాప్ ద్వారా మీకు కావాల్సిన పచారీ కొట్టు సామాన్లన్నీ తెప్పించుకోవచ్చు. మీకు కావాల్సిన టైమ్‌కి, కావాల్సిన చోటుకు సరుకులు వచ్చేలా చూసుకోవచ్చు. ప్లస్స్: ఈ యాప్ సర్వీస్ ద్వారా కావాల్సిన మందులు, పర్సనల్ కేర్ వస్తువులు, బేబీ కేర్ ప్రొడక్ట్‌లు, పెంపుడు జంతువులకు కావాల్సినవి - అన్నీ ఇంటికే తెప్పించుకోవచ్చు. మందుల ప్రిస్క్రిప్షన్‌ను ముందుగా ఈ యాప్ ద్వారా ఫోటో తీసి, ఆర్డర్ చేస్తే చాలు. కావాల్సిన మందులన్నీ ఇంటి ముంగిటకే వచ్చేస్తాయి. మై బేబీ టుడే: చంటిపిల్లలున్న తల్లితండ్రుల కోసం రూపొందించిన ఇన్ఫర్మేటివ్ గైడ్ లాంటిది ఈ ‘మై బేబీ టుడే’ యాప్. శిశువుల పెంపకం, సంరక్షణకు సంబంధించిన సమాచారం ఇందులో ఇస్తారు. చంటిపాపకు చనుబాలు ఇవ్వడం ఎలా, పోతపాలు పట్టడం ఎలా, నిద్రపుచ్చడం ఎలా వగైరా అన్నీ చెబుతారు. అలాగే, చంటిపిల్లల ఫీడింగ్ గైడ్, ఫోటో ఆల్బమ్, చెక్‌లిస్ట్‌లు, గుర్తుపెట్టుకొని వేయించాల్సిన టీకాల గురించి ఇందులో వివరంగా చూపిస్తారు. బేబీ స్లీప్ ఇన్స్టంట్ యాప్: పాలు పట్టడం అయిపోతుంది. పొత్తి గుడ్డలు శుభ్రంగానే ఉంటాయి. కానీ, పాప నిద్రపోకుండా ఏడుస్తుంటుంది. ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది. అలాంటి సమయంలో జోలపాడి, నిద్రపుచ్చడానికి ‘బేబీ స్లీప్ ఇన్స్టంట్’ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో తరతరాలుగా మన ముత్తవ్వలు, నాయనమ్మలు పాడుతూ, పసిపాపల్ని నిద్రపుచ్చిన లాలి పాటలు, జోలపాటలు ఉంటాయి. కావాలంటే, మన సొంత జోల పాటలు కూడా ఇందులో రికార్డు చేసుకోవచ్చు. పిల్లల్ని హాయిగా నిద్ర పుచ్చే ఈ లాలిపాటలతో పిల్లల తల్లులకు భలే ఉపయోగం. క్వికీ: ఇంట్లో కొత్త మెంబర్‌గా పసిపాప పుట్టినప్పుడు, ఇవాళ్టి స్మార్ట్‌ఫోన్ యుగంలో ఆ బిడ్డ ఎదిగే ప్రతి క్షణాన్నీ ఫోటో తీయడం చేతిలో పని. మరి బోలెడన్ని ఫోటోలు తరచూ తీస్తూ వెళుతుంటే, వాటిని క్రమపద్ధతిలో పెట్టుకొనేదెలా? ఈ ‘క్వికీ’ యాప్ పెట్టుకొంటే, మంచి ఫోటోల్ని అదే ఎంచుకొని, వాటిని షార్ట్ ఫిల్మ్స్‌గా మార్చుకోవచ్చు. అలాగే, ‘డే వన్ 2’ అనే మరో యాప్ కూడా ఉంది. దాని ద్వారా మీ చిన్నారి జీవితంలోని ఆనంద క్షణాల్ని ఎప్పుడూ మీ గుప్పెట్లోని ఫోన్లో పెట్టుకోవచ్చు. బంధు మిత్రులు చంటిబిడ్డ గురించి ఎప్పుడు అడిగినా, అవి చూపించవచ్చు. ఫోటోలతో పాటు సమయం, సందర్భాలను వివరించే వ్యాఖ్యలు జోడించవచ్చు. కావాల్సిన ఫోటోను వెతుక్కోవడానికి వీలుగా ట్యాగ్లు, కీ వర్డ్స్ కూడా వాటికి చేర్చవచ్చు. ఆ తరువాత ఈ ఎంట్రీలన్నిటినీ పి.డి.ఎఫ్.గా మార్చి, అవసరమైతే పుస్తకంగా కూడా ప్రింట్ చేసి, ఆ తీపి జ్ఞాపకాల్ని అందరితో పంచుకోవచ్చు. -
మాతాశిశు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
ఎంజీఎం : మాతాశిశు వివరాలతో పాటు హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్ చేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి హరీష్‌రాజు సూచించారు. వరంగల్‌లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం ఆయా క్లస్టర్ల పరిధిలోని ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఓ హరీష్‌రాజు మాట్లాడుతూ తప్పుడు వివరాలు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే ఆవకాశం ఉందన్నారు. పీహెచ్‌సీలతో పాటు క్లస్టర్ స్థాయిలో వివరాలను ప్రతి నెల అన్ని సెంటర్లలో నమోదు చేయాలన్నారు. అనంతరం ఆన్లైన్లో జరిగే పొరపాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. కార్యక్రమంలో ఎస్ఓలు కాంతారావు, రమేశ్గాడ్గిల్, సర్వేలెన్స్ అధికారి కిరణ్, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపారాణి పాల్గొన్నారు. -
ఇండియాలోనే అధికం...
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. గర్భం, ప్రసూతి సమయాల్లో ఇండియాలో ప్రతి ఐదు నిమిషాలకు ఓ మహిళ మరణిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి సంవత్సరం ప్రసూతి మరణాల రేటు తీవ్రంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. గర్భం సమయంలో పౌష్టికాహార లోపం, ప్రసవానంతరం రక్తస్రావం వంటి అనేక కారణాలతో మహిళలు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది. గర్భంవల్లో, ప్రసవం సమయంలోనో ప్రతి ఐదు నిమిషాలకు ఓ భారత మహిళ చనిపోతున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ప్రపంచంలో ప్రతి సంవత్సరం సుమారు 5,29,000 ప్రసూతి మరణాలు సంభవిస్తుండగా వాటిలో అత్యధికంగా 25.7 శాతం భారత్ లోనే జరుగుతున్నట్లు లెక్కల ద్వారా కనుగొంది. వీటిలో ముఖ్యంగా ప్రసవానంతరం రక్తస్రావం వల్ల రెండొంతుల మరణాలు సంభవిస్తున్నట్లు డబ్ల్యూ హెచ్ వో తన ప్రకటనలో తెలిపింది. రక్తస్రావం, ప్రసవానంతర హెమరేజ్ (పీపీహెచ్) వల్ల పిల్లలు పుట్టిన 24 గంటల్లోపు 500 నుంచి 1000 మిల్లీ లీటర్ల రక్తం మహిళలు నష్టపోవడంవల్ల మరణాలు ఏర్పడుతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో నిర్వచించింది. భారత్ లో అధికంగా పీపీహెచ్ ఫలితంగానే మహిళల మరణాలు సంభిస్తుండటంతో ప్రసూతి మరణాలు తగ్గించడం, పునరుత్పత్తి, ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులో ఉంచడమే ధ్యేయంగా మిలీనియం డెవలప్మెంట్ గోల్ దృష్టి సారించింది. భారతదేశంలో బాలింతల మృతులు పెరుగుతున్న నేపథ్యంలో 2011-13 తాజా అంచనాల ప్రకారం సగటున లక్ష జననాల్లో 167 మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే అస్పాంలో అత్యధికంగా 300 మరణాలు, కేరళలో అతి తక్కువగా 61 మరణాలు నమోదవుతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో ప్రకటనలో తెలిపింది. ప్రతిదేశం కనీసం ఒక శాతం రక్తం రిజర్వ్ లో ఉంచుకోవాల్సి ఉండగా, ముఖ్యంగా ఇండియాలో దీర్ఘకాలిక కొరతవల్ల కూడ ఈ మరణాలు నమోదవుతున్నట్లు డబ్ల్యూ హెచ్ సూచిస్తోంది. 1,2 బిలియన్ల జనాభా ఉన్న ఇండియాలో సంవత్సరానికి 12 మిలియన్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా, కేవలం 9 మిలియన్ల యూనిట్ల రక్తం మాత్రమే సేకరిస్తోంది. దీంతో సుమారు 25 శాతం రక్తం లోటు ఏర్పడుతోంది. భారత దేశంలో ఈ లోటు విషయాన్ని పెద్దగా పట్టించుకోపోవడం, రక్త సేకరణ విషయంలో అశ్రద్ధ వహించడం ఇందుకు కారణాలలౌతున్నట్లు డబ్ల్యూ హెచ్ వో ప్రకటనలో తెలిపింది. -
ఒక జననం.. ఒక మరణం
శిశువుకు జన్మనిచ్చి కన్ను మూసిన తల్లి అమ్మ ప్రేమకు దూరమైన ఇద్దరు చిన్నారులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మన్యంలో ఆగని మరణాలు మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయించి విస్తృత చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా ఏజెన్సీలో నిత్యం ఎక్కడో ఒక చోట మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గిరిజనులకు అవగాహన లోపం.. వైద్యం సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ఏజెన్సీలో మరో బాలింత ప్రాణం తీసింది. జీకేవీధి: ప్రభుత్వ యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ మాతా, శిశు మరణాలకు అడ్డుకట్ట వేయడానికి అమలు చేస్తున్న పథకాలు గిరిజన ప్రాంతంలో అమలుకు నోచుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం అమలుకు ఆటంకంగా మారింది. జీకేవీధి మండల కేంద్రానికి సమీపంలోని ఉన్న పనసలబంద గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఓ మాతృ మరణం ఆదివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పనసలబంద గ్రామానికి చెందిన గెమ్మెలి విజయ(24) అనే నిండు గర్భిణి శనివారం ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఆమె భర్త గెమ్మెలి అర్జున్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. అంబులెన్స్, వైద్య సిబ్బంది వచ్చేలోగానే ఆమె ుగ శిశువుకు జన్మనిచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. వైద్య సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి వైద్యసేవలు అందించి అంబులెన్స్‌లో ఎక్కించేలోగానే తుది శ్వాస విడిచింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి రెండేళ్ల పాప ఉంది. ఇది ఆమెకు రెండో కాన్పు. ప్రసవించిన వెంటనే ఆమె మృతి చెందడంతో పుట్టిన పసికందుతోపాటు రెండేళ్ల చిన్నారి తల్లి ప్రేమకు దూరమయ్యారు. బంధువు సంరక్షణలో పసికందు పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన పసికందు సంరక్షణను మృతురాలి వదిన గెమ్మెలి లక్ష్మి స్వీకరించింది. ఆమె కూడా బాలింత కావడంతో ప్రస్తుతం తల్లిపాలకు దూరమైన పసికందును ఒడిలోకి తీసుకుని బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. సకాలంలో వైద్యం అందక.. మాతా, శిశు మరణాలను అరికట్టాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల కాలంలో అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం దగ్గర నుంచి అధికారుల వరకు సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఎన్ఎంలకు, వైద్యాధికారులకు ప్రత్యేక ట్యాబ్‌లను సమకూర్చి టాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో మహిళలకు వివాహమైనప్పటి నుంచి వారు గర్భం దాల్చి ప్రసవించేవరకు నెల నెల నిర్వహించాల్సిన పరీక్షలు, ప్రసవతేదీ వంటి వాటిని ట్యాబ్‌లో నిక్షిప్తంచేస్తున్నారు. గర్భం దాల్చిన ప్రతి మహిళను ప్రసవానికి 3 రోజుల ముందే సమీప ఆస్పత్రిలో చేర్పించే విధంగా దశలవారీగా దిశానిర్దేశం చేశారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలన్నీ ఉచితంగా చేసే వెసులుబాటు కల్పించారు. ప్రసవం అనంతరం తల్లి, బిడ్డల సంరక్షణకు తల్లి,బిడ్డ ఎక్స్‌ప్రెస్ ను ఏర్పాటు చేశారు. అయితే అధికారులు నిర్లక్ష్యం కారణంగా మన్యంలో అమలు అంతమాత్రమే. వైద్య సేవలూ అరకొరే.. దీంతో ఎక్కడో ఒక చోట మాతా శిశు మరణాలు చోటు చేసుకోవడం ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ప్రశ్నిస్తోంది -
బాలింతలకు కఠిన పథ్యం అవసరం లేదు
ఆయుర్వేద కౌన్సెలింగ్ నాకు పదిరోజుల క్రితం పాప పుట్టింది. ఇంటిలోని వాళ్లు అవి తినకూడదు, ఇవి తినకూడదు అంటూ రకరకాల ఆంక్షలు విధిస్తున్నారు. జన్మించింది. బాలింతనైన నేను ఏవిధమైన ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలో సూచింప ప్రార్థన. - స్నేహ, హైదరాబాద్ ప్రసవమైన మూడు నాలుగు వారాల వరకు తల్లీ బిడ్డలకు ఇన్ఫెక్షన్లు రాకుండా పరిశుభ్ర వాతావరణాన్ని పాటించడం అత్యవసరం. మీరుండే గదిలోనికి ఎవ్వరినీ రానీయవద్దు. తల్లి, వైద్యుడు, నర్సు తప్ప ఇతరులెవ్వరూ శిశువుని తాకకుండా చూసుకోండి. సాధారణంగా ప్రసూతులలో (బాలింతలలో) కొంచెం రక్తహీనత ఉండవచ్చు. నడుంనొప్పి, పాదాలవద్ద కొద్దిగా వాపులు కొందరిలో కనిపించవచ్చు. మీరు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కఠిన పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. బయటి ఆహారం, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మంచివి కావు. వేడి ఆహారం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కాయగూరలు, తాజాఫలాలు, జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూరం వంటి ఎండు ఫలాలు మంచిది. ప్రతిరోజూ ఉదయం బార్లీనీళ్లు, ఆవుమజ్జిగ తాగండి. నువ్వులు, బెల్లం తినండి. రోజూ రెండు లీటర్ల ఆవుపాలు తాగితే మీకు స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది. అల్లం, వెల్లుల్లి, ఆహారంలో తగురీతిలో తినడం మంచిది. అదేపనిగా పడుకోకుండా కొంచెం శారీరక శ్రమ కలిగే తేలికపాటి వ్యాయామాలు చేయండి. రెండుపూటలా ఐదేసి నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ప్రసవానంతరం ఆరోగ్యం కుదుటపడటానికి సహకరించే ఈ కింద సూచించిన ఆయుర్వేద మందులు వాడండి. పునర్నవాది మండూర (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 బాలింత కాఢ నెం. 1 (ద్రావకం): ఉదయం 2 చెంచాలు, రాత్రి రెండు చెంచాలు రెండు వారాలు తాగండి. ఆ తర్వాత... బాలింత కాఢ నెం. 2 (ద్రావకం): ఉదయం 2 చెంచాలు, రాత్రి చెంచాలు రెండు వారాలు తాగండి. శిశువునకు... అరవిందాసవ (ద్రావకం): ఐదుచుక్కలు ఉదయం, ఐదు చుక్కలు సాయంత్రం తాగించాలి (తేనెతో). వీలుంటే శిశువుని (బట్టలు లేకుండా) ప్రభాత సూర్యకిరణాలలో ఐదు నిమిషాలు ఉంచితే మంచిది. ‘బలాతైలం’తో శిశువునకు మృదువుగా అభ్యంగం చేసి, అనంతరం సున్నిపిండితో, వేడినీటి స్నానం చేయించండి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది క్రితం కడుపునొప్పి, కామెర్లు వచ్చాయి. ఒళ్లంతా ఒకటే దురద. డాక్టర్‌ను కలిస్తే పరీక్షలు చేసి, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈఆర్సీపీ టెస్ట్ చేసి స్టెంట్ వేశారు. నెల రోజుల నుంచి మళ్లీ కళ్లు పచ్చబడుతున్నాయి. జ్వరం వస్తోంది. నాకు సరైన సలహా ఇవ్వగలరు. - సుకుమార్, నందిగామ మీరు గాల్‌స్టోన్స్‌తో పాటు సీబీడీ స్టోన్స్ అనే సమస్యలతో బాధపడుతున్నారు. మీకు ఇటీవల వేసిన బిలియరీ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. దాంతో మీకు కామెర్లు, జ్వరం వస్తున్నాయి. మీరు మళ్లీ వీలైనంత త్వరగా ఈఆర్సీపీ పరీక్ష చేయించుకోండి. దీనివల్ల మీకు సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించడానికి వీలవుతుంది. అలాగే మూసుకుపోయిన స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ కూడా అమర్చవచ్చు. ఈఆర్సీసీ తర్వాత మీరు లాపరోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్‌ను తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇదే సమస్య మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడంతో పాటు, కాళ్లవాపులూ వచ్చాయి. మా దగ్గర స్థానికంగా ఉండే డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. కొన్నాళ్ల పాటు సమస్య తగ్గింది. కానీ మళ్లీ అదే సమస్య వచ్చింది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - రమాకాంతరావు, కంచికచర్ల కడుపులో నీరు రావడం, కాళ్ల వాపులు వంటి లక్షణాలను బట్టి మీకు లివర్, కిడ్నీ లేదా గుండెజబ్బు ఉన్నట్లుగా అనుమానించాల్సి ఉంటుంది. ఆల్కహాల్ అలవాటు ఉందంటున్నారు కాబట్టి ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. ఆ రిపోర్టులతో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. మీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా మీకు చికిత్స అందించాల్సి ఉంటుంది. నా వయసు 41 ఏళ్లు. నేను చాలా ఏళ్ల నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. దాదాపు మూడు నెలల పాటు రకరకాల మందులు వాడాను. ఇప్పుడు దాంతోపాటు మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలతోనూ బాధపడుతున్నాను. అయితే నాకు డయాబెటిస్‌గానీ, హైబీపీగాని లేవు. దయచేసి నా సమస్యలు తీరేలా తగిన సలహా ఇవ్వండి. - రాజ్‌కుమార్, కరీంనగర్ మీరు రాసిన ఉత్తరంలో మీరు ఎండోస్కోపీ చేయించుకున్నారా లేదా అన్న వివరాలు లేవు. మీరు ఒకవేళ ఎండోస్కోపీ చేయించుకోకపోతే ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి ఎండోస్కోపీ చేయించుకోండి. అందులో వచ్చే ఫలితాన్ని బట్టి వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా కూతురికి 23 ఏళ్లు. గత రెండేళ్లుగా అప్పుడప్పుడూ ఆమెకు కుడివైపున పొత్తికడుపులో నొప్పి వస్తోంది. శారీరకమైన శ్రమ చేసినప్పుడు ఈ నొప్పి మరీ ఎక్కువగా వస్తోంది. అయితే గత మూడు నెలల నుంచి ఈ నొప్పి రోజూ వస్తోంది. నొప్పి తీవ్రత కూడా ఎక్కువే. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్-రే తీసి ఆమెకు తుంటి భాగం సరిగా ఏర్పడలేదని అన్నారు. దాంతో మేం షాక్‌కు గురయ్యాం. పుట్టుక నుంచే ఈ సమస్య ఉన్నప్పుడు... ఈ మధ్యనే నొప్పి ఎందుకు వస్తోంది? ఆమెకు తుంటి భాగాన్ని మళ్లీ అమర్చాల్సి వస్తే... అది ఎప్పటికి కుదురుకుంటుంది? ఆమెది చిన్న వయసు. పైగా ఇప్పుడు పెళ్లి చేయాల్సిన సమయం. కాబట్టి ఈ సమయంలో ఆమెకు ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఆమె వైవాహిక జీవితానికి గాని, పిల్లల పుట్టుకకు గానీ ఏదైనా సమస్య వస్తుందా? దయచేసి వివరించండి. - స్నేహలత, గుంటూరు మీరు చెప్పినట్లుగా ఈ వయసులో ఏదైనా సమస్య బయట పడటం, పైగా జీవితంలో కుదురుకోవాల్సిన సమయంలో పుట్టుకతో సమస్య ఉన్నట్లుగా తెలియడం బాధాకరమే. మీరు చెప్పిన అంశాలను బట్టి ఆమెకు ఉన్న కండిషన్‌ను ‘డిస్‌ప్లాస్టిక్ హిప్’ అంటారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్లలోని మృదులాస్థి / చిగురు ఎముక... అంటే అసలు ఎముక చివరిభాగంలో ఉండే కార్టిలేజ్ అరిగిపోయి సమస్యతో పాటు, తీవ్రత కూడా బయటపడుతుంది. అయితే కొంతమందిలో ఈ సమస్య బాల్యదశలోనే వెల్లడి అవుతుంది. వాళ్లలో ఆర్థరైటిస్‌తో పాటు తీవ్రమైన నొప్పి వల్ల ఈ కండిషన్ తెలుస్తుంది. సాధారణంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్‌ను ఈ సమయంలో చేయరు. కానీ ఆమెకు ఉన్న కండిషన్ వల్ల మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే మీరు అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఆమెకు అవసరమైన ఆపరేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో 30-40 ఏళ్ల వరకూ మళ్లీ సమస్య తలెత్తే అవకాశాలు చాలా తక్కువ. నొప్పి కూడా ఉండదు. ఆమె తన రోజువారీ వ్యవహారాలు చూసుకోడానికి గానీ లేదా పెళ్లికి, బిడ్డలను కనేందుకు ఈ శస్త్రచికిత్స వల్ల ఎలాంటి సమస్యా రాదు. కాబట్టి మీరు అంతగా బాధపడకుండా, మీకు దగ్గరలోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
వైద్యానికి కొత్త మొబైల్ యాప్..!
కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత గర్భిణులు, తల్లీ పిల్లల ఆరోగ్య సేవల్లో సుయోజన యాప్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పేషెంట్ కు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేందుకు సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు, వివరాలను నమోదు చేసుకొని అత్యవసర సమయంలో తక్షణ వైద్యం అందించేందుకు ఈ సింపుల్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మొబైల్ ఆధారిత వైద్య సేవలతో మారుమూల గ్రామాల్లో తక్షణ వైద్యం అందించగల్గుతున్నారు. ఇమ్మునైజేషన్ వంటి వైద్యపరమైన సమస్యలను గుర్తించేందుకు, గర్భిణుల నమోదు, సేవలు అందించడం వంటి వాటిలో ఏఎన్ ఎంలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే ఈ సాధారణ మొబైల్ యాప్ తో వారు సమర్థవంతంగా విధులను నిర్వర్తించేందుకు చక్కగా పనికి వస్తోంది. కర్నాటక ఛామరాజ్ నగర్ కు చెందిన రోహిణి రూరల్ ఏరియాల్లో ఏఎన్ఎం గా పనిచేస్తున్నారు. నిజానికి ఆమె తన విధులను నిర్వహించడంలో ఎంతో చురుకుగానూ, ఆసక్తిగానూ ఉంటారు. అయినప్పటికీ ఒక్కోసారి పేషెంట్లకు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చేది. క్లిష్టమైన సందర్భాల్లో కీలకమైన కేసుల వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినపుడు.. ఆమె ఓ పద్ధతి ప్రకారం వాటిని గుర్తుంచుకోవడం కష్టంగా మారింది. దీంతో ఇటీవల రోహిణి సుయోజన యాప్ వాడకం ప్రారంభించింది. ఈ మొబైల్ బేస్డ్ అప్లికేషన్ వాడకం ప్రసూతి, పిల్లల సంరక్షణ చర్యల్లో ప్రస్తుతం ఆమెకు ఎంతో సహకరిస్తోంది. పరీక్షలు నిర్వహించేందుకు, పరిశోధనలు జరిపేందుకు సుయోజన యాప్ మార్గదర్శకంగా ఉందని రోహణి అంటోంది. ఒక దశలో పనిని వాయిదా వేసే అవకాశం లేనప్పుడు ఎమర్జెన్సీని బట్టి వారికి తక్షణ చికిత్స అందించాల్సి వచ్చినపుడు యాప్ ఎంతో ఉపయోగపడుతోందని రోహిణి చెప్తున్నారు. చిన్న టెక్నాలజీని వాడుకోవడంతో ఎంతోమంది ఏ ఎన్ ఎం లు రోగులకు ప్రత్యేక సేవలు అందించగల్గుతున్నారని కూడ రోహిణి చెప్తోంది. సుయోజన యాప్ ను వెనుకబడిన వారికి సేవలు అందించేందుకు స్వాస్థి హెల్త్ రిసోర్స్ సెంటర్ ప్రవేశ పెట్టింది. కరుణ ట్రస్ట్ , డి. ట్రీ ఇంటర్నేషనల్ సహకారంతో సామాజికంగా వెనుకబడ్డి వర్గాలకు ఈ యాప్ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయితే స్వాస్థి ద్వారా ప్రజారోగ్య సేవలు అందించడం ప్రారంభించి సుమారు పదకొండు సంవత్సరాలు అయింది. ప్రస్తుతం సేవలను వివిధ కోణాల్లో అట్టడుగు స్థాయినుంచి సమర్థవంగా అందించేందుకు, ఏ ఎన్ ఎం ల కు పని సులభతరం అయ్యేందుకు ఈ మొబైల్ యాప్ ను వాడకంలోకి తెచ్చినట్లు స్వాస్థి డైరెక్టర్ బాబా కార్కల్ చెప్తున్నారు. పారా మెడికల్ సిబ్బంది తక్షణ వైద్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. ఇది లేని సందర్భాల్లో ఏఎన్ ఎం లు అందించాల్సిన కొన్ని క్లిష్టమైన సేవలను కూడ దాట వేసే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. ఈ మొబైల్ ఆధారిత వైద్య చికిత్స ప్రసవానికి ముందు, ప్రసవానంతరం బిడ్డల రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. కొత్తగా పుట్టిన పిల్లల సంరక్షణకు కావాల్సిన కౌన్సెలింగ్ కు, వారి గుండె కొట్టుకునే తీరు గమనించడంతోపాటు ప్రతి లక్షణాన్ని గుర్తించే అవకాశం ఈ యాప్ తో కలుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. రామరాజనగర్ జిల్లాలో మార్చి 2014 లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఆసక్తికరమైన యాప్ సేవలు కర్ణాటకలోని నాలుగు జిల్లాలో 31 మంది ఏఎన్ ఎం లు అందిస్తున్నారు. యూజర్ ఫ్రెండ్లీ గా ఈ యాప్ లో కన్నడలో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ను గురించి ముందుగా దీన్ని వినియోగించే ఏఎన్ ఎం లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి కాగానే సేవలు అందించడంలో వారికి వచ్చే సమస్యలను తీర్చేందుకు ఓ సూపర్ వైజర్ ను కూడ అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం ఈ యాప్ ను శిక్షణ తీసుకున్న ఏఎన్ ఎం ల మొబైల్స్ లో మాత్రమే ఇన్ స్టాల్ చేస్తున్నారు. అయితే యాప్ ద్వారా సేవలు అందించడం వల్ల ఏఎన్ఎం లకు కొంతవరకు ఇబ్బందులు తగ్గినప్పటికీ ప్రభుత్వ అంగీకారం కోసం మాత్రం వీరి బృందం పోరాటం చేయాల్సి వస్తోంది. యాప్ కోసం నిధులు సమకూర్చిన నలుగురు సభ్యులున్న డి-ట్రీ ఇంటర్నేషనల్ తమ ప్రాజెక్టు మరికొన్ని జిల్లాల్లో ప్రవేశ పెట్టేందుకు యోచిస్తోంది. -
బాలింత మృతిపై బంధువుల ఆందోళన
ప్రైవేటు ఆస్పత్రిపై దాడి..రాస్తారోకో కరీంనగర్: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు రోజుల బాలింత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతిచెందిందని ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రిపై దాడి చేయడంతో పాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వివరాలు..మెట్‌పల్లికి చెందిన ఆకుల లాస్య ప్రసవం నిమిత్తం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. నాలుగు రోజుల కింద కాన్పు కావడంతో ఆమె ఆస్పత్రిలోనే ఉంటోంది. అయితే ఆమె గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతిచెందింది. దాంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు లాస్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భావించి ఆస్పత్రిపై దాడిచేశారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారాకో చేశారు. పోలీసులు వచ్చి ఆందోళకారులను శాంతింపజేశారు. -
‘కు.ని.’లో ఇంత నిర్లక్ష్యమా..?
బిచ్కుంద : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరంలో వైద్యుల స్పందన కరువైంది. ఆపరేషన్ చేయించుకుంటామని పలువురు బాలింతలు ముందుకు వచ్చినా.. శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. బిచ్కుందలో బుధవారం నిర్వహించిన క్యాంపునకు సుమారు 200 మంది మహిళలు ఆపరేషన్ కోసం తరలివచ్చారు.వైద్యులు 60 మందికే ఆపరేషన్ చేస్తామని టోకెన్లు ఇచ్చారు. మిగత వారికి చేయమని చెప్పడంతో మహిళలు, వారి కుటుంబ సభ్యలు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ కోసం మూడు నెలలుగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నామని, ఏఎన్ఎంలు, వైద్యులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం... ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో మహిళలకు ప్రోత్సాహకంగా వెయ్యి రుపాయలు నగదు అందిస్తోంది. వారికి కు.ని.పై అవగాహన కల్పించేందుకు లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహిస్తోంది. అరుుతే ఇక్కడ మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినా వైద్యులు ససేమిరా అనడం గమనార్హం. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాలకు కలిపి నెలలో ఒకేసారి క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రతీ నెల సుమారు 100 నుంచి 150 మంది మంది మహిళలు వస్తున్నా వైద్యులు మాత్రం నెలలో 60 మందికే ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు. మారుమూల గ్రామాలైన జుక్కల్, మద్నూర్ మండలాల మహిళలు సౌకర్యాలు లేకపోవడంతో బాన్సువాడ ఆస్పత్రికి వెళ్లలేక పోతున్నారు. అరుుతే నెలలో రెండు క్యాంపులు నిర్వహించాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.