Wife Went to Maternal Home After Marriage Husband Committed Suicide - Sakshi
Sakshi News home page

పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని..

Published Sun, Jul 30 2023 1:47 PM | Last Updated on Sun, Jul 30 2023 2:42 PM

wife went to maternal home after marriage husband committed suicide - Sakshi

యూపీలోని బాందాలో ఇటీవలే వివాహం జరిగిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టింటికి వెళ్లిన భార్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కలత చెందిన  ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు ఈ ఘటన గురించి మాట్లాడుతూ మృతుడు మద్యం కోసం ఇంటిలోని నగలను అ‍మ్మేశాడని, ఆ సమయంలో అతని భార్య  అతనిని అడ్డుకున్నదని తెలిపారు. ఒకరోజు ఆలయంలో అందరి ముందు భార్యను కొట్టాడని పేర్కొన్నారు. 

ఈ విషయమై ఆగ్రహించిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. పోనులో వీరిద్దరి మద్య వాగ్వాదం జరిగింది. పుట్టింటిలో ఉన్న ఆమెను వెంటనే అత్తవారింటికి రమ్మని కోరాడు. ఆమె అత్తారింటికి రానని తెగేసి చెప్పింది. దీంతో కలత చెందిన  భర్త ఉరివేసుకుని ఆ‍త్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. 

ఈ కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవ్‌ థోక్‌ గ్రామానికి చెందిన నరే​ంద్రకు రెండు నెలల క్రితం చిత్రకూట్‌ జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా సరేంద్ర దంపతులు వేరు కాపురం పెట్టారు. మద్యానికి బానిస అయిన నరేంద్ర భార్య నగలు అమ్మేశాడు. ఈ నేపధ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కలత చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 
ఇది కూడా చదవండి: రోడ్డుపై అర్థనగ్నంగా యువతి నృత్యం.. ఒళ్లు మండిన యువకుడు చేసిన పని ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement