బాలింత మృతిపై బంధువుల ఆందోళన | meternal Died in karimnagar district | Sakshi
Sakshi News home page

బాలింత మృతిపై బంధువుల ఆందోళన

Published Thu, Jul 2 2015 4:20 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు రోజుల బాలింత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.

  • ప్రైవేటు ఆస్పత్రిపై దాడి..రాస్తారోకో
  • కరీంనగర్: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు రోజుల బాలింత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతిచెందిందని ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రిపై దాడి చేయడంతో పాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వివరాలు..మెట్‌పల్లికి చెందిన ఆకుల లాస్య ప్రసవం నిమిత్తం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. నాలుగు రోజుల కింద కాన్పు కావడంతో ఆమె ఆస్పత్రిలోనే ఉంటోంది. అయితే ఆమె గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతిచెందింది.

    దాంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు లాస్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భావించి ఆస్పత్రిపై దాడిచేశారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారాకో చేశారు. పోలీసులు వచ్చి ఆందోళకారులను శాంతింపజేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement