మాతాశిశు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
Published Thu, Aug 25 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
ఎంజీఎం : మాతాశిశు వివరాలతో పాటు హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఆన్‌లైన్ చేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి హరీష్‌రాజు సూచించారు. వరంగల్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో బుధవారం ఆయా క్లస్టర్ల పరిధిలోని ఎల్‌డీ కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఓ హరీష్‌రాజు మాట్లాడుతూ తప్పుడు వివరాలు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే ఆవకాశం ఉందన్నారు. పీహెచ్‌సీలతో పాటు క్లస్టర్ స్థాయిలో వివరాలను ప్రతి నెల అన్ని సెంటర్లలో నమోదు చేయాలన్నారు. అనంతరం ఆన్‌లైన్‌లో జరిగే పొరపాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఓలు కాంతారావు, రమేశ్‌గాడ్గిల్, సర్వేలెన్స్ అధికారి కిరణ్, మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్వరూపారాణి పాల్గొన్నారు.
Advertisement