old alwal
-
సీఎం కేసీఆర్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి భర్త పర్వతనేని రాజేశ్వరరావు (84) శనివారం మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లకి చెందిన రాజేశ్వరరావు నగరంలోని అల్వాల్ మంగాపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. రాజేశ్వరరావు మరణవార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉదయమే అక్కడికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌లు రాజేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం తిరుమలగిరి స్వర్గదామ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు రాజేశ్వరరావు నివాసంలోనే ఉన్నారు. కాగా, సీఎం సోదరి, రాజేశ్వరరావు సతీమణి విమలాదేవి గతేడాది చనిపోయారు. -
మద్యం మత్తులో మహిళా పారిశ్రామికవేత్త హల్చల్
-
మద్యం మత్తులో మహిళా పారిశ్రామికవేత్త హల్చల్
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ మహిళా పారిశ్రామికవేత్త గత అర్థరాత్రి హల్చల్ సృష్టించింది. అతిగా మద్యం సేవించడమే కాకుండా అధిక వేగంతో కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న మూడు కార్లు, బైకును ఢీ కొట్టింది. దాంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితురాలు మహిళ పారిశ్రామికవేత్తను స్థానికులు పట్టుకుని ఓల్డ్ అల్వాల్ పోలీసులకు అప్పగించారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను విడిచిపెట్టారు. ఆదివారం ఆమెను పోలీసులు విచారించనున్నారు. సోమవారం ఆమెను కోర్టులో హజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఆమె కారు ఏపీ 10 ఏఏ 8511ను పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. మహిళ అతిగా మద్యం సేవించిందని తమ పరీక్షల్లో తెలిందని పోలీసులు వెల్లడించారు. -
ప్రాణం తీసిన ఆస్తి తగాదా!
-
ఆస్తి కోసం యాసిడ్ తాగమన్న కొడుకు
హైదరాబాద్ : ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్నే ఆత్మహత్య చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడో కొడుకు. ఈ దారుణ ఘటన ఓల్డ్ అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న రామ్మూరి్, లక్ష్మీభాయిలను గత కొంతకాలంగా కుమారుడు దేవానంద్ ఆస్తి కోసం వేధించటం ప్రారంభించారు. అది కాస్త శ్రుతిమించి యాసిడ్ తాగాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో కుమారుడి వేధింపులు తట్టుకోలేని వారు ఈరోజు ఉదయం యాసిడ్ తాగారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీభాయి మృతి చెందగా, తండ్రి రాంమూర్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు దేవానంద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.