Devanand
-
రొమాంటిక్ హీరో.. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రచారం..
హిందీ సినిమా రంగంలో అయిదు దశాబ్దాలకు పైగా నటుడిగా కొన సాగారు దేవానంద్. ఆయన నటనే స్టైల్‌కు పర్యాయపదంగా నిలిచి పోయింది. నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ ఎంతోమంది ప్రతిభావంతుల్ని సినీతెరకు పరిచయం చేశారు. శతజయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన సినిమాలు ప్రదర్శితమయ్యాయి. హిందీ ప్రధాన స్రవంతి సినిమాల్లో దేవానంద్‌కు ముందు హుందా అయిన నటులున్నారు. ఆయన తర్వాత కాలంలో కూడా ఎంతో మంది నటులు వచ్చారు. కానీ దేవానంద్ స్టైల్, స్మైల్ విలక్షణమయినవి. ఆయన కదలిక, ఆహార్యం మొత్తంగా ఆయన నటనే స్టైల్‌కు పర్యాయ పదంగా నిలిచిపోయింది. ఆయన సినిమాల్లోని పాటలు నేటికీ జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నాయి. ‘మై జిందగీ కా సాత్ నిభాతా చలాగయా’, ‘కొయా కొయా చాంద్’, ‘గాతా రహే మేరా దిల్’ లాంటి పాటల్ని ఎవరు మరిచిపోగలరు? ఆ కాలంలో దిలీప్ కుమార్ విషాదాంత పాత్రలకు పర్యాయ పదంగా ఉండి, మధ్యతరగతి ప్రజల్ని, ఆనాటి మేధావుల్ని అలరిస్తున్నాడు. మరో వైపు చార్లీ చాప్లిన్ తరహా ట్రాంప్లా రాజ్ కపూర్ సామాన్య జన జీవితాల్లోకి చొచ్చుకు పోతున్నాడు. ఆ పరిస్థితుల్లో వారిద్దరికీ భిన్నంగా, తనదైన చేతనాత్మకమైన ధోరణితో నిలిచి గెలిచాడు దేవానంద్. సురయ్యా, మధుబాల, వైజయంతిమాల, హేమామాలిని, వహీదా రెహమాన్, నూతన్, గీతా దత్ లాంటి వాళ్ళతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. 1923లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దేవానంద్ జన్మించాడు. పంజాబ్ విశ్వ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసుకుని బొంబాయి బయలుదేరాడు. అప్పటికే సినీ రంగంలో కృషి చేస్తున్న సోదరుడు చేతన్ ఆనంద్‌తో కలిసి తన భవిష్యత్తును నిర్మించుకుందామని ఆలోచన. 1946లో ప్రభాత్ వాళ్ళు నిర్మించిన ‘హామ్ ఏక్ హై’తో దేవ్ తన నట జీవితాన్ని ఆరంభించాడు. అప్పుడే గురు దత్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మిత్రులయ్యారు. తాను నిర్మాతగా మారి దర్శకుడిని చేస్తానని హామీ ఇచ్చాడు. రష్యన్ సినిమా ‘ఇన్స్పెక్టర్ జనరల్’ ప్రేరణతో చేతన్ ఆనంద్ తీసిన ‘అఫ్సర్’తో ఎస్.డి.బర్మన్ను సంగీత దర్శకుడిగా పరి చయం చేశాడు. తర్వాత బాల్ రాజ్ సహానీ స్క్రిప్ట్ ఆధారంగా ‘బాజీ’ తీశాడు. గురుదత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉర్దూ కవి సాహిర్ లుథియాన్వీ మొదటిసారిగా గీతాలు రాశాడు. ఈ సినిమాతోనే కమెడియన్‌గా జానీ వాకర్ కూడా పరిచయం అయ్యాడు. గీతా రాయ్‌ను గురుదత్, కల్పనా కార్తీక్‌ను దేవా నంద్ ఈ చిత్ర సమయంలోనే కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు జంటలయ్యారు. వహీదా రహ్మాన్‌తో దేవానంద్ అనేక విజయవంతమయిన సినిమాలు చేశాడు. వారిద్దరిదీ అప్పుడు హిందీ సినిమాల్లో గొప్ప హిట్ జంట. ‘సోల్వా సాల్’, ‘గైడ్’, ‘కాలా బాజార్’, ‘బాత్ ఏక్ రాత్ కీ’ వంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘గైడ్’ మొట్ట మొదటి ఇండో అమెరికన్ సిన్మాగా రూపొందింది. ఆర్.కె.నారాయణ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శ కుల ప్రశంసల్ని అందుకుంది. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ముగ్గురు త్రిమూర్తుల్ని– అంటే దేవానంద్, రాజ్‌కపూర్, దిలీప్ కుమార్‌లను తీన్‌మూర్తి భవన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయిదు దశాబ్దాలకు పైగా హిందీ సినిమా రంగంలో తనదయిన శైలిలో నటిస్తూ, నిర్మిస్తూ... రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ... మొండితనంతో, తృష్ణతో తన నిర్మాణ సంస్థ ‘నవకేతన్’ను 52 ఏళ్ళకు పైగా సజీవంగా ఉంచుకున్నాడు దేవానంద్. 2001లో పద్మభూషణ్, 2002లో దాదా సాహెబ్ ఫాల్కే వరించాయి. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేర రాజకీయ పార్టీని స్థాపించినప్పటికీ దాన్ని ఎక్కువ కాలం నడపలేదు. దేవానంద్ జన్మశతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా 30 నగరాల్లో 55 టాకీసుల్లో ఆయన నటించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్.ఎఫ్.డి.సి. ఆర్కైవ్స్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. వారాల ఆనంద్ వ్యాసకర్త కవి, విమర్శకుడు. 94405 01281 (నేడు నటుడు దేవానంద్ శతజయంతి.) -
కింది కోర్టుల లాయర్లనూ హైకోర్టు జడ్జిలుగా నియమించాలి
సాక్షి, అమరావతి : హైకోర్టు జడ్జిలుగా కేవలం హైకోర్టు న్యాయవాదులనే కాక కింది కోర్టుల లాయర్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కోరారు. కింది కోర్టుల్లో కూడా ఎంతో మంది ప్రతిభావంతులైన న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. కింది కోర్టుల్లో ఉన్న సీనియర్ లాయర్లకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించాలన్నారు. శనివారం గుంటూరులో జరిగిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర మహాసభల్లో జస్టిస్ దేవానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత న్యాయవ్యవస్థలో ‘సామాజిక భిన్నత్వం’ లోపించిందని అన్నారు. అణగారిన వర్గాలు, మహిళల సంఖ్య పెరగాలని చెప్పారు. 2018 నుంచి 2023 వరకు హైకోర్టుల్లో 601 మంది న్యాయమూర్తుల నియామకాలు జరగ్గా, అందులో జనరల్ కోటా 457 మంది, ఎస్సీలు 18 మంది, ఎస్టీలు 9 మంది, ఓబీసీలు 72 మంది, మహిళలు 91 మంది, మైనారిటీలు 32 మంది, ఇతరులు 13 మంది ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ విధానం లేకపోయినప్పటికీ, న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో నా ణ్యతపై లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులను కొలీజియం పరిగణనలోకి తీసుకో వాలని కోరారు. దేశంలోని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి భారం చాలా తీవ్రమైన అంశమని చెప్పారు. న్యాయం అందించడంలో జాప్యం జరిగితే న్యాయం అందని పరిస్థితికి దారి తీస్తుందన్నారు. జాప్యం ఇలాగే కొనసాగితే విసిగిపోయిన కక్షిదారులు రాజ్యాంగేతర, అసాంఘిక శక్తులను ఆశ్రయించి తక్కువ ఖర్చుతో వేగవంతమైన న్యాయం పొందేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారి, సమాజంలో అశాంతి, అరాచకానికి దారి తీస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని తెలిపారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చేలా తీర్మానం చేయాలని ఐలూ కార్యవర్గాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్‌ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం పార్లమెంట్ చేసే చట్టాలను సమీక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిందని, దీంతో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ చాలా గట్టిగా ప్రయత్నిస్తోందని ఐలూ జాతీయ కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి.సురేంద్రనాథ్ చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో ఆధిపత్యానికి ఆరాటపడుతోందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటే ప్రజాస్వామ్యం మరో విధంగా మారుతుందని, దేశం లౌకిక, సార్వభౌమ దేశంగా కొనసాగే పరిస్థితి ఉండదని చెప్పారు. దీనిని అడ్డుకోవాల్సిన బాద్యత న్యాయవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, ఏపీ కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
AP High court: ఎందుకీ గగ్గోలు?.. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడుతోంది?
సాక్షి, అమరావతి: సంక్రాంతి సెలవుల సందర్భంగా అత్యవసర కేసుల విచారణకు ఏర్పాటైన వెకేషన్ కోర్టులో తాను నిర్దేశించిన రోస్టర్‌కు భిన్నంగా జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని బెంచ్ వ్యవహరించడాన్ని తప్పుబట్టిన ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వెకేషన్ కోర్టులో ఏం జరిగిందో తమకు స్పష్టంగా తెలుసని, అయితే న్యాయ వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఆ విషయాలను బహిర్గతం చేయడం లేదని తెలిపింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్న సీజే ధర్మాసనం, ఇంత జరిగిన తరువాత కూడా తాము స్పందించకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రధాన న్యాయమూర్తులు ఇలాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. పరిపాలనాపరంగా ప్రధాన న్యాయమూర్తి నిర్దేశించిన రోస్టర్‌లో రెండు పేరాలు మార్చారని, తద్వారా ఒరిజినల్ రోస్టర్ మారిందని ధర్మాసనం తెలిపింది. అసలు జీవో 1 విషయంలో ఏదో జరిగిపోతోందని రాజకీయ పార్టీలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని ప్రశ్నించింది. అంతగా స్పందించేందుకు ఎవరి ఇల్లు తగలబడుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధానంపై ఎందుకింత గగ్గోలు పెడుతున్నారని నిలదీసింది. అది ఓ సాధారణ నిర్ణయమని వ్యాఖ్యానించింది. జీవో 1 విషయంలో ఇరుపక్షాల వాదనలు పూర్తైనందున తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. తుది విచారణ జరిపిన నేపథ్యంలో వారంలో తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ఇదీ నేపథ్యం... రోడ్లు, రోడ్ మార్జిన్లలో బహిరంగ సభల ఏర్పాటును నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 1ని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాకా రామకృష్ణ సంక్రాంతి సెలవుల్లో అత్యవసర కేసులను మాత్రమే విచారించే హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వ్యూహాత్మకంగా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ దేవానంద్, జస్టిస్ కృపాసాగర్ ధర్మాసనం జీవో 1 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు, రామకృష్ణ వ్యాజ్యంపై విచారణ జరపాలని సీజే ధర్మాసనానికి స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యాజ్యంపై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం వాదనలు విన్నది. ఇదే అంశంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత కొల్లు రవీంద్ర, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం మంగళవారం పూర్తిస్థాయిలో వాదనలు విన్నది. ఆ అధికారం పోలీసులకు మాత్రమే ఉంది.. కొల్లు రవీంద్ర తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. సభలు, ర్యాలీలు, ధర్నాలు, రోడ్‌షోలు తదితరాల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు మాత్రమే ఉందన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఆదేశాలిచ్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వానికి కేవలం పర్యవేక్షణ అధికారం మాత్రమే ఉందన్నారు. అంతిమంగా పరిస్థితుల ఆధారంగా డీజీపీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాలు తమ గళం విప్పకూడదనే ప్రభుత్వం జీవో 1 జారీ చేసిందన్నారు. సహేతుక ఆంక్షలు విధిస్తూ అనుమతులిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. అయితే ప్రభుత్వం ఏకంగా సభలను నిషేధించిందన్నారు. ప్రజలు జీవించే హక్కు, రాజకీయ నేతల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు తగిన రీతిలో స్పందించకపోవడం, భద్రత చర్యలు చేపట్టకపోవడం లాంటి కారణాల వల్లే తొక్కిసలాట ఘటనలు జరిగాయన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు అసంబద్ధ షరతులు విధించారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేపడితే అనుమతినివ్వడమే కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను డీజీపీ ఆదేశించారన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. హక్కులను కాలరాయడం సరికాదు... కన్నా లక్ష్మీనారాయణ తరఫు న్యాయవాది టి.శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, నిరసనలను పలు రూపాల్లో తెలియచేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉందన్నారు. ఈ హక్కును కాల రాయడం సమాజానికి మంచిది కాదన్నారు. ఎప్పుడో ఒకసారి నిర్వహించే సభలు, సమావేశాలను నిషేధించడం సరికాదన్నారు. అధికార పార్టీ విషయంలో ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీల విషయంలో మరో రకంగా వ్యవహరించడం వివక్షే అవుతుందన్నారు. డీజీపీ ద్వారానే ఉత్తర్వులు ఇవ్వాలి.. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తరఫున సీనియర్ న్యాయవాది రవిశంకర్ వాదనలు వినిపిస్తూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోడ్డు షోల విషయంలో తెచ్చిన సర్క్యులర్‌ను అన్ని పార్టీలు స్వాగతించాయని చెప్పారు. డీజీపీ స్వతంత్రంగా వ్యవహరించి పరిస్థితులను బట్టి సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? సీపీఐ రామకృష్ణ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. జీవో 1పై విచారణ జరిపే అధికారం వెకేషన్ బెంచ్‌కు ఉందన్నారు. హైకోర్టు నోటిఫికేషన్ ప్రకారం అత్యవసర కేసులను విచారించే విచక్షణాధికారం సీనియర్ వెకేషన్ జడ్జికి ఉందని తెలిపారు. అందులో భాగంగానే వెకేషన్ బెంచ్ జీవో 1పై తమ వ్యాజ్యాన్ని విచారించిందన్నారు. ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి జీవో ఒక్కరోజు కూడా మనుగడలో ఉండటానికి వీల్లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ.. జీవో ఎమ్మెస్ అయినా, జీవో ఆర్టీ అయినా ప్రభుత్వం తీసుకున్నది సాధారణ నిర్ణయమేనని, దీనిపై రాజకీయ పార్టీలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయని ప్రశ్నించింది. ప్రస్తుత చర్యలు సరిపోవడం లేదు... పార్టీలు రోడ్లపై నిర్వహిస్తున్న రోడ్‌షోలు, సభలు, సమావేశాలను నియంత్రించే విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన వ్యాజ్యంపై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. జీవో 1 నేపథ్యంలో ఈ వ్యాజ్యం నిరర్థకం కాదా? అని పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసులు మరిన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. పరిస్థితులను బట్టే నిర్ణయం.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదన్నారు. జీవో 1లో కూడా ఎక్కడా నిషేధం అన్న పదమే లేదన్నారు. సభలు, సమావేశాల కోసం సమర్పించే ప్రతి దరఖాస్తును అప్పటి పరిస్థితుల ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిని నియంత్రించే అధికారం పోలీసులకు ఉందన్నారు. ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజలు తిరిగే పరిస్థితి లేకుండా చేయడం వల్లే కందుకూరు ఘటన జరిగిందన్నారు. జీవో 1 వల్ల వ్యక్తులకు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం పోలీసులకు మార్గనిర్దేశం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. లోకేష్ పాదయాత్రకు అనుమతినిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఓ రాజకీయ పార్టీ ప్రైవేట్ గ్రౌండ్లో సభ నిర్వహణకు అనుమతి కోరితే మంజూరు చేశామన్నారు. ప్రతిదీ పరిస్థితులను బట్టి ఉంటుందని తెలిపారు. వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ దశలో సిద్దార్థ లూత్రా మధ్యంతర ఉత్తర్వుల సంగతి ప్రస్తావించగా.. తుది విచారణ చేపట్టామని, వారంలోపు తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం ఎక్కడ?
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బలహీనవర్గాలకు చెందిన న్యాయవాదుల విషయంలో సామాజిక న్యాయం నేతిబీర చందంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో 1,104 మంది జడ్జిలు ఉంటే, అందులో కేవలం 92 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని చెప్పారు. అలాగే 16 మంది ఎస్సీ, ఎనిమిది మంది ఎస్టీ జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. 16 హైకోర్టుల్లో అసలు ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమే లేదన్నారు. ఈ గణాంకాలు సామాజిక న్యాయం అమలు తీరుకు ప్రతిబింబమని చెప్పారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైకోర్టులో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. అపర మేధావి, అభ్యుదయవాది, రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఓ కుల నాయకుడిగా చిత్రీకరించడం దారుణమని చెప్పారు. అంబేడ్కర్ తన జీవితాన్ని సామాజికన్యాయం కోసం ధారపోశారన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ దేశంలో సామాజికన్యాయం అమలు కావడం లేదని చెప్పారు. మనదేశం కులవ్యవస్థకు ప్రాధాన్యతనిస్తోందని, అందుకే అంబేడ్కర్‌ను ఓ కులానికి నాయకుడిగా చూపుతున్నారని తెలిపారు. అంతకుముందు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన భావజాలాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలని పిలుపునిచ్చారు. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ అంబేడ్కర్‌ది మహోన్నత వ్యక్తిత్వమని చెప్పారు. అంబేడ్కర్ మార్గాన్ని అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ గంగారావు మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనంటూ, అందరి హక్కుల పరిరక్షణకు అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ధిక్కార కేసులో ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరవచ్చు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఇటీవల శిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌కు నంబర్ కేటాయించాక శ్రీలక్ష్మికి విధించిన శిక్షను పునఃసమీక్షించాలా? లేదా? అనేదానిపై న్యాయమూర్తి వాదనలు వింటారు. నేపథ్యమిదీ.. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని నిర్మించవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పలుచోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఇటీవల హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. వాదనల అనంతరం 8 మంది ఐఏఎస్ అధికారులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వారిని సామాజిక సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సామాజిక సేవ కింద నెలలో ఓ ఆదివారం చొప్పున 12 ఆదివారాలు వారికి నచ్చిన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేయాలంటూ శిక్ష విధించింది. శ్రీలక్ష్మి పిటిషన్‌కు విచారణార్హత ఉంది.. శ్రీలక్ష్మి పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ సందేహాలు లేవనెత్తింది. కోర్టు ధిక్కార కేసులో పిటిషన్‌కు ఆస్కారం ఉందా? అలాంటి పిటిషన్‌కు విచారణార్హత ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేసింది. ఈ అనుబంధ పిటిషన్‌కు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ అనుబంధ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ముందు విచారణకొచ్చింది. న్యాయమూర్తి స్పందిస్తూ.. కోర్టు ధిక్కార కేసులో పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేయొచ్చా? అలా దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత ఉంటుందా? అనేదానిపై ముందు వాదనలు వినిపించాలని శ్రీలక్ష్మి తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. ఇదే అంశంపై కోర్టుకు సహకరించాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్‌ను కోరారు. సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ధిక్కార కేసులో పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు. అలా దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత ఉందని తెలిపారు. ఈ మేరకు గతంలో ఏపీ, కేరళ హైకోర్టులు తీర్పులు ఇచ్చాయన్నారు. అనంతరం ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు తన స్వీయ ఉత్తర్వులను పునః సమీక్షించే విషయంలో ఎలాంటి నిషేధం లేదన్నారు. ఈ విషయంలో కోర్టుకు పూర్తి అధికారాలున్నాయన్నారు. కోర్టు ధిక్కార కేసులో ఇచ్చింది తీర్పే కాబట్టి, తీర్పును పునఃసమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు చేయవచ్చన్నారు. అయితే కోర్టు ధిక్కారం ఎదుర్కొంటున్న అధికారులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. -
అక్షరాస్యత, స్వశక్తి ద్వారానే ఆర్థికాభివృద్ధి
పెదకాకాని (పొన్నూరు): అక్షరాస్యత, స్వశక్తిపై జీవనం సాగించేలా ప్రోత్సహించడంపైనే ప్రజల ఆర్థికాభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్వో) ప్రాంగణంలో ప్రొఫెసర్ ఎంఏ విన్‌డ్లీ లీగల్ సర్వీస్ సెంటర్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా దురదృష్టవశాత్తు పలు విధానాల వల్ల పేదలు ఎటువంటి పరిపుష్టి సాధించకుండా పేదలుగానే మిగిలిపోయారన్నారు. న్యాయ సహాయం కోసం పేదలు ఇప్పటికీ ప్రాధేయపడటం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. వీఆర్వో సంస్థ ఆధ్వర్యంలో స్థాపిస్తున్న లీగల్ సర్వీస్ సెంటర్ ద్వారా వాస్తవ లబ్ధిదారులకు అవసరమైన న్యాయ సహాయం ఉచితంగా అందాలన్నారు. తొలుత జస్టిస్ బట్టు దేవానంద్ చేతుల మీదుగా శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన జరిగాయి. ఈ కార్యక్రమంలో వీఆర్వో సంస్థ గ్రామ శాఖ ప్రెసిడెంట్ సిస్టర్ క్లీటస్‌డైసీ, సెక్రటరీ ఫాదర్ ధన్పాల్, విశ్రాంత ఐఏఎస్, గవర్నింగ్ బోర్డు సభ్యుడు డాక్టర్ టి.గోపాలరావు, నందిగామ సివిల్ జ్యుడిషియల్ జడ్జి జేసురత్నం, సంస్థ ట్రెజరర్ కవితా డేవిడ్, బాలస్వామి పాల్గొన్నారు. -
యాపిల్ ఈవెంట్లో 'దమ్ మారో దమ్'
యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్ ఇండియన్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఐఫోన్ 13 లాంచ్ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సాంగ్ దమ్ మారో దమ్ మ్యూజిక్ వినిపించి యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ట్విస్ట్ ఇచ్చారు. లాంచ్ చేసే ప్రోడక్ట్స్‌తోపాటు వాటిని లాంచ్ చేసే విధానంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ఇండియన్ మార్కెట్‌పై ఫోకస్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్ అవతరించింది. కానీ భారత్‌లో యాపిల్ మార్కెట్ కేవలం 3 శాతం మాత్రమే ఉంది. ఆ మార్కెట్ షేర్‌ను పెంచేందుకు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్ నటించిన ఇండియన్ మ్యూజికల్ డ్రామా ఫిల్మిం 'హరేరామ హరేకృష్ణా' సినిమాలోని ప్రముఖ ఆర్డీ బర్మన్-ఆశా భోస్లే'లు పాడిన 'దమ్ మారో దమ్' మ్యాజిక్‌ను వాడారు. దీంతో యాపిల్ బాలీవుడ్ మ్యూజిక్ వాడటంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. క్యూపర్టినోలో జరిగిన ఈవెంట్లో ఫోన్‌ను లాంచ్ చేయడానికి సీఈవో టిమ్ కుక్ వస్తున్న సమయంలోనూ ఈ మ్యూజిక్ వినిపించింది. దీంతో ఔత్సాహికులు ఐఫోన్ 13 సిరీస్‌లోని ఐఫోన్ 13 తో పాటు ఎంట్రీ లెవల్ పాడ్, ఐపాడ్, యాపిల్ వాచ్ సిరీస్ 7 ఫీచర్ల కంటే ఎక్కువగా ఈ మ్యూజిక్ గురించే చర్చిస్తున్నారు. ఇక యూట్యూబ్ లో సైతం ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఐఫోన్ 13 ఫోన్ ఎలాంటి ప్రమాదాల్లోనైనా చెక్కు చెదరకుండా ఉంటుందని ఓ వీడియోను రిలీజ్ చేసింది యాపిల్. ఆ వీడియోలో ఓ యువకుడు తన బైక్‌పై కస్టమర్లకు పార్శిళ్లను అందిస్తుండగా 'దమ్ మారో దమ్' సాంగ్ ఆడియా ట్రాక్ ప్లే అవ్వడం నెట్టింట్లో సందడి చేస్తోంది. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
‘గుట్ట’ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ముగిసిన సోదాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు శుక్రవారం ముగిశాయి. మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.20 వేలు డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దేవానంద్.. స్థానిక డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను మధ్యవర్తిగా పెట్టి లంచం తీసుకున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్న విషయం విదితమే. కాగా, దేవానంద్ ఇంట్లో రూ.76 లక్షలకుపైగా నగదు, 27 తులాల బంగారు ఆభరణాలు, 7.9 ఎకరాల పొలం, 200 గజాల ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, తొమ్మిది విదేశీమద్యం బాటిళ్లు, పలు ఇతర కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవానంద్, ప్రభాకర్‌లను ఏసీబీ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్, మెదక్ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో విచారించారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. -
వారి బకాయిలు చెల్లించేశాం
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించి పిటిషనర్లకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు మెమో దాఖలు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం జస్టిస్ దేవానంద్ మరోసారి విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, 32 వ్యాజ్యాల్లోని పిటిషనర్లకు బకాయిలు చెల్లించామని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కొందరు తమకు బకాయిలు పూర్తిగా చెల్లించారని, మరికొందరు పాక్షికంగా చెల్లించారని, మరికొందరు తమ డబ్బు అందలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎవరెవరికి బకాయిలు అందలేదో తెలుసుకుని చెప్పాలని న్యాయమూర్తి వారిని ఆదేశించారు. -
కోర్టు ముగిసే వరకు నిలబడండి!
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి, అప్పటి ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి హైకోర్టు తొమ్మిది రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. అయితే వారిద్దరూ క్షమాపణ కోరడంతో పాటు కోర్టు ఉత్తర్వుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పడం, వారి వయస్సును, ప్రస్తుత కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తీర్పును సవరించింది. జరిమానాను అలానే ఉంచి, పనివేళలు ముగిసేంత వరకు కోర్టులోనే నిలబడి ఉండాలని వారిని ఆదేశించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మూడు రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. కేసు ఇదీ.. విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యానవన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో నిర్ధేశించిన పలు అర్హతలను తొలగించింది. దీనిని సవాలు చేస్తూ ఎస్.కృష్ణ, మరో 35 మంది అభ్యర్థులు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, సవరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాటిని ఎత్తివేయాలంటూ ప్రభుత్వం అనుబంధ పిటిషన్ వేసింది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. తర్వాత హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్.. అధికారులు ఉద్ధేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తేల్చారు. మంగళవారం ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. 9 నెలల జాప్యం ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల అమలులో 9 నెలల జాప్యం ఉందన్నారు. వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తేనే కోర్టు ఆదేశాలను అమలు చేసే ఇలాంటి అధికారుల పట్ల కనికరం చూపాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలా చేస్తే తప్పుడు సంకేతం పంపినట్లు అవుతుందని తెలిపారు. కోర్టు ఆదేశాల ఉద్ధేశపూర్వక ఉల్లంఘనకు వీరికి శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మరో కోర్టు ధిక్కార కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం హైకోర్టు ముందు హాజరయ్యారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తానని, కొంత గడువునివ్వాలని ఆయన కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ అందుకు అనుమతినిచ్చారు. -
టీడీపీ నేత దేవానంద్ అరెస్ట్
కదిరి : తనపైనే వార్తలు రాస్తావా అంటూ కదిరి సాక్షి విలేకరి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం చేసిన టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి మంగళవారం ప్రకటించారు. విలేకరిపై హత్యాయత్నాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులపాటు జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పాత్రికేయునిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ.. పోలీసు అధికారులతో సమగ్ర విచారణ చేయించిన అనంతరం నిందితుడు దేవానంద్‌ను అరెస్ట్ చేశారు. తర్వాత ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. జర్నలిస్టులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఎస్పీతో పాటు కదిరి డీఎస్పీ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. దేవానంద్ బాధితులు నేరుగా ఫిర్యాదు చేయండి : ఎస్పీ రైల్వేశాఖలో ఉద్యోగాలిప్పిస్తామని, ఇంటి పట్టాలిస్తామని ఇలా పలు రకాలుగా మోసాలు చేసినట్లు దేవానంద్‌పై వస్తున్న ఆరోపణలపై బాధితులు నేరుగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ సూచించారు. సాక్షి విలేకరి శ్రీనివాసరెడ్డిపై దేవానంద్ పెట్టిన కేసును పరిగణనలోకి తీసుకోనవసరం లేదని, కేవలం కౌంటర్ కేసుగానే ఇచ్చినట్లు భావిస్తున్నామని చెప్పారు. కులం పేరుతో దూషించాడన్నది కూడా పూర్తిగా వాస్తవం కాదని నమ్ముతున్నామన్నారు. ఇదే విషయాన్ని ఆయన సదరు విలేకరితో పాటు జర్నలిస్టు సంఘాల జిల్లా, రాష్ట్ర నాయకులకు తెలియజేశారు. జర్నలిస్టుల సమష్టి విజయం కదిరి సాక్షి విలేకరిపై టీడీపీ నేత హత్యాయత్నానికి పాల్పడితే జిల్లాలోని జర్నలిస్టులందరూ ఏకమై తమ నిరసన గళం విన్పించారు. దేవానంద్ అరెస్ట్ కూడా సమష్టి విజయంగా భావిస్తున్నాం. దేవానంద్‌పై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్‌లో విలేకరులపై దేవానంద్ దాడులకు పాల్పడితే అతనిపై రౌడీషీట్ నమోదు చేయడంతో పాటు జిల్లా నుంచి బహిష్కరించే వరకు వదిలిపెట్టబోం. – మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీయూడబ్ల్యూజే -
ప్రాణం తీసిన ఆస్తి తగాదా!
-
ఆస్తి కోసం యాసిడ్ తాగమన్న కొడుకు
హైదరాబాద్ : ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్నే ఆత్మహత్య చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడో కొడుకు. ఈ దారుణ ఘటన ఓల్డ్ అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న రామ్మూరి్, లక్ష్మీభాయిలను గత కొంతకాలంగా కుమారుడు దేవానంద్ ఆస్తి కోసం వేధించటం ప్రారంభించారు. అది కాస్త శ్రుతిమించి యాసిడ్ తాగాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో కుమారుడి వేధింపులు తట్టుకోలేని వారు ఈరోజు ఉదయం యాసిడ్ తాగారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీభాయి మృతి చెందగా, తండ్రి రాంమూర్తి పరిస్థితి విషమంగా ఉంది. అతడు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు దేవానంద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టపాసుల పంచాయితీ
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: టపాకాయల దుకాణాల ఏర్పాటులో తప్పనిసరిగా నిబంధనలు పాటించకపోతే అనుమతించేది లేదని త్రీటౌన్ సీఐ దేవానంద్ హెచ్చరించడంతో వ్యాపారులు ఆందోళనలో పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. దీపావళి పండుగకు రెండు రోజులు మాత్రమే ఉండడంతో నగరంలోని వ్యాపారులు 40 దుకాణాల ఏర్పాటు రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులతో అనుమతులు పొంది స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఆ ప్రాంగణంలో 48 స్టాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు, పోలీసులు సూచించిన మేరకు దుకాణాల ఏర్పాటు లేకపోవడంతో త్రీటౌన్ సీఐ వారిని హెచ్చరించారు. నిబంధనలు అనుసరించకపోతే, స్టాళ్లన్నింటినీ తొలగిస్తామని చెప్పారు. దీంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజులుగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు, వాణిజ్యపన్నులు, అగ్నిమాపక శాఖ అధికారుల దాడులతో విసిగి వేసారిపోయామని, ప్రస్తుతం దుకాణాల ఏర్పాటులో సైతం నిబంధనలు అడ్డుగా నిలుస్తుండడంతో, ఈ ఏడాది టపాకాయల విక్రయాలు ఎలా సాగించాలని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని లెసైన్సుదారుల్లో 38 మందిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు బనాయించి రూ. కోటి పైగా విలువైన సరుకును సీజ్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ముట్టజెబుతామని రూ.25లక్షలు వసూలు నిబంధనల పేరుతో ఎలాంటి ఒత్తిళ్లు రాకుండా చేస్తానంటూ ఓ వ్యక్తి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు వారు ఆరోపించారు. ఇప్పటికే ఓ ఉన్నతాధికారికి రూ.2 లక్షలు ఇచ్చినట్లు ఆయన చెప్పాడని అంటున్నారు. మిగిలిన మొత్తాన్ని ఆయన వద్దే ఉంచుకోవడం వల్లే అందరూ తమపై ఆంక్షలు విధిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి స్టాళ్ల ఏర్పాటుకు సహకరించాలని వారు కోరుతున్నారు.