Dum Maaro Dum Tune Plays During iPhone 13 Series Launch Event - Sakshi
Sakshi News home page

Apple iPhone 13 : యాపిల్‌ ఈవెంట్‌లో 'దమ్ మారో దమ్'

Published Wed, Sep 15 2021 1:59 PM | Last Updated on Wed, Sep 15 2021 4:45 PM

Dum Maro Dum Tune Plays During Iphone 13 Launch - Sakshi

యాపిల్‌ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్‌ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫిరెన్స్‌' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌’ ద్వారా సెప్టెంబర్‌ 14న నిర్వహించిన ఈవెంట్‌ ఇండియన్స్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఐఫోన్ 13 లాంచ్ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సాంగ్ ద‌మ్ మారో ద‌మ్ మ్యూజిక్ వినిపించి యాపిల్‌ సీఈఓ టీమ్‌ కుక్‌  ట్విస్ట్‌ ఇచ్చారు. లాంచ్ చేసే ప్రోడ‌క్ట్స్‌తోపాటు వాటిని లాంచ్ చేసే విధానంలోనూ త‌న‌దైన మార్క్ చూపిస్తూ ఇండియన్‌ మార్కెట్‌పై ఫోకస్‌ చేశారు. 

ప్రపంచంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్‌ అవతరించింది. కానీ భారత్‌లో యాపిల్ మార్కెట్‌ కేవలం 3 శాతం మాత్రమే ఉంది. ఆ మార్కెట్‌ షేర్‌ను పెంచేందుకు బాలీవుడ్‌ ఎవర్‌ గ్రీన్‌ హీరో దేవానంద్‌ నటించిన ఇండియన్‌ మ్యూజికల్‌ డ్రామా ఫిల్మిం 'హరేరామ హరేకృష్ణా' సినిమాలోని ప్రముఖ ఆర్డీ బర్మన్-ఆశా భోస్లే'లు పాడిన 'దమ్ మారో దమ్' మ్యాజిక్‌ను వాడారు.

దీంతో యాపిల్‌ బాలీవుడ్‌ మ్యూజిక్ వాడటంపై నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. క్యూప‌ర్టినోలో జ‌రిగిన ఈవెంట్‌లో ఫోన్‌ను లాంచ్ చేయ‌డానికి సీఈవో టిమ్ కుక్ వ‌స్తున్న స‌మ‌యంలోనూ ఈ మ్యూజిక్ వినిపించింది. దీంతో ఔత్సాహికులు ఐఫోన్‌ 13 సిరీస్‌లోని ఐఫోన్‌ 13 తో పాటు ఎంట్రీ లెవల్‌ పాడ్‌, ఐపాడ్‌, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7 ఫీచ‌ర్ల కంటే ఎక్కువ‌గా ఈ మ్యూజిక్‌ గురించే చర్చిస్తున్నారు.

ఇక యూట్యూబ్‌ లో సైతం ఓ వీడియో ట్రెండ్‌ అవుతోంది. ఐఫోన్ 13 ఫోన్‌ ఎలాంటి ప్రమాదాల్లోనైనా చెక్కు చెదరకుండా ఉంటుందని ఓ వీడియోను రిలీజ్‌ చేసింది యాపిల్‌. ఆ వీడియోలో ఓ యువకుడు తన బైక్‌పై కస్టమర్లకు పార్శిళ్లను అందిస్తుండగా 'దమ్ మారో దమ్' సాంగ్ ఆడియా ట్రాక్‌ ప్లే అవ్వడం నెట్టింట్లో సందడి చేస్తోంది.  

చదవండి : ఐఫోన్‌ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement