iPhone 13 Pro and iPhone 13 series in India.టెక్ దిగ్గజం యాపిల్..ఐఫోన్ 13, ఐఫోన్ 13మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్‌లను విడుదల చేసింది. కాలిఫోర్నియా స్ట్రీమింగ్ పేరిట జరిగిన కార్యక్రమంలో యాపిల్ చీఫ్ టిమ్ కుక్ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు.
అయితే స్టాటిస్టా లెక్కల ప్రకారం భారత్‌లో కేవలం 3 శాతం మార్కెట్‌కే పరిమితమైన యాపిల్..ఆ మార్కెట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ వర్చువల్ ఈవెంట్‌లో యాపిల్ చీఫ్ టిమ్ కుక్ ఇండియన్ మార్కెట్‌లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ధరల్ని ప్రకటించారు. వాటి ధరలు ఇలా ఉన్నాయి.
ఇండియాలో ఐఫోన్ 13 సిరీస్ ధరలు
ఐఫోన్ 13ప్రో మ్యాక్స్
128జీబీ: రూ.1,29,900
256జీబీ: రూ. 1,39.900
512జీబీ: రూ. 1,59,900
1టెరాబైట్ : రూ. 1,79,900
ఐఫోన్ 13 ప్రో
128జీబీ: రూ. 1,19,900
256జీబీ: రూ. 1,29,900
512జీబీ:రూ. 1,49,900
1టెరాబైట్ : రూ. 1,69,900
ఐఫోన్ 13
128జీబీ: రూ.79,900
256జీబీ: రూ. 89,900
512జీబీ: రూ. 1,09,900
ఐఫోన్ 13 మినీ
128జీబీ: రూ. 69,900
256జీబీ: రూ. 79,900
512జీబీ: రూ. 99,900
ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ ప్రీ ఆర్డర్లు అప్పుడే
యాపిల్ విడుదల చేసిన ఐఫోన్13 సిరీస్ ఫోన్ ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్17,శుక్రవారం సాయంత్రం 5:30నుంచి ప్రారంభం కానుండగా..సెప్టెంబర్ 24 శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో..
Comments
Please login to add a commentAdd a comment