టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న హార్దిక్ పాండ్యా విజయపథంలో దూసుకుపోతున్నాడు. తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్.. తన జట్టుకు 2-1తేడాతో మరో టైటిల్‌ను అందించాడు. కాగా రోహిత్ వారసుడిగా భావిస్తున్న హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్‌గా స్వదేశంలో ఇదే తొలి సిరీస్ విజయం.
ఇక మూడో టీ20 మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్.. తన కెప్టెన్సీ సక్సెస్‌కు గల కారణాన్ని వెల్లడించాడు. టీమిండియా మాజీ బౌలర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సూచనల వల్లే నేను కెప్టెన్‌గా విజయవంతమయ్యాను అని హార్ది్క్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్.. అరంగేట్ర సీజన్‌లోనే తన జట్టుకు టైటిల్‌ను అందించాడు. అదే విధంగా కోచ్‌గా నెహ్రా కూడా జట్టును ముందుండి నడిపించాడు.
ఇక పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.."ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా విజయవంతం కావడానికి కోచ్ ఆశిష్ నెహ్రానే కారణం. ఇప్పుడు అతడు సూచనల వల్లే మరింత మెరుగ్గా రాణించగల్గుతున్నాను. నెహ్రా వంటి కోచ్‌తో పని చేయడం నా అదృష్టం. అతడు నా జీవితంలో నేను ఊహించని మార్పులను తీసుకొచ్చాడు.
మేమిద్దరం ఒకే విధంగా ఆలోచిస్తాం. అతడితో కలిసి పని చేయడం వల్ల నా కెప్టెన్సీకి విలువ పెరిగింది. అతడు కెప్టెన్‌గా పనిచేయకపోయనప్పటకీ.. పలు విషయాలు ఆశిష్ దగ్గర నేర్చుకున్నాను. అదే విధంగా కెప్టెన్సీ పరంగా కూడా గతంలో నాకు పెద్దగా అనుభవం లేదు. కేవలం అండర్ -16 జట్టులో ఉన్నప్పుడు బరోడాకు సారథిగా ఉన్నాను. ఆ తర్వాత కేవలం నా ఆట మీదే దృష్టి పెట్టాను అని అతడు పేర్కొన్నాడు.
కాగా హార్దిక్ తన వాఖ్యలలో ఎక్కడ కూడా ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పేరులను ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా హార్దిక్ భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో కూడా రోహిత్ సారథ్యంలో చాలా సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment