మళ్లీ ప్రేమలో పడ్డ హార్దిక్‌ పాండ్యా.. సింగర్‌తో డేటింగ్‌!? | Hardik Pandya Is Dating Jasmin Walia After His Split From Natasa Stankovic? | Sakshi
Sakshi News home page

#Hardik Pandya: మళ్లీ ప్రేమలో పడ్డ హార్దిక్‌ పాండ్యా.. సింగర్‌తో డేటింగ్‌!?

Published Wed, Aug 14 2024 1:25 PM | Last Updated on Wed, Aug 14 2024 1:45 PM

Hardik Pandya Is Dating Jasmin Walia After His Split From Natasa Stankovic?

సెర్బియా న‌టి, త‌న భార్య‌ నటాషా స్టాంకోవిచ్ తో వివాహ బంధానికి ముగింపు పలికిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా.. మ‌ళ్లీ తిరిగి ప్రేమ‌లో ప‌డ్డాడా? మ‌రో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడా? అంటే అవుననే స‌మాధాన‌మే ఎక్కువ‌గా వినిపిస్తోంది. 

హార్దిక్ పాండ్యా.. బ్రిటీష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజుల‌గా జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. వీరిద్దరూ కలిసి ప్ర‌స్తుతం గ్రీస్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల కింద‌ట గ్రీస్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద న‌డుస్తూ దిగిన ఫోటోల‌ను జాస్మిన్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా హార్దిక్ కూడా అదే స్పాట్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేయ‌డం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. 

అంతేకాకుండా వీరిద్ద‌రూ ఒకొరి పోస్ట్‌కు ఒక‌రు లైక్ కూడా చేయ‌డంతో హార్దిక్‌-జాస్మిన్ ప్రేమలో ఉన్నార‌ని అంతా ఫిక్స్ అయిపోయారు. గతంలో కూడా వాలియా పెట్టిన పలు పోస్ట్‌లకు హార్దిక్ లైక్ కొట్టాడు.

కాగా జాస్మిన్‌తో హార్దిక్‌ రిలేషన్‌లో ఉండడంతోనే నటాషా స్టాంకోవిచ్ విడిపోవాలని నిర్ణయించుకుందని జోరుగా ప్రచారం సాగుతోంది. నటాషా సైతం చీటింగ్ కు సంబంధించిన రీల్స్ ను సోషల్ మీడియాలో తరుచుగా పోస్ట్ చేస్తుంది.

ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌ అనంతరం హార్దిక్‌ పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని హార్దిక్‌ నిర్ణయించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement