టీ20 ప్రపంచకప్-2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి ఆగ్రశేణి టీంలు ఇప్పటికే తమ జట్టులను ప్రకటించాయి. ఇక మెగా ఈవెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ సెప్టెంబర్ 16న ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నీ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల బారిన పడటం భారత అభిమానులను ఆందోళన కలిగిస్తోంది.
ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనే భారత జట్టును మాజీలు, క్రికెట్ నిపుణులు ముందుగానే అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా చేరాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అంచనావేశాడు.
బ్యాటర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్. దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేశాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దీపక్ హుడాకు నెహ్రా చోటిచ్చాడు. ఇక తన జట్టులో స్పెషలిస్టు స్సిన్నర్లగా యుజవేంద్ర చాహల్, అశ్విన్‌ను మాత్రమే ఎంపిక చేశాడు.
అదే విధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ అవకాశమిచ్చాడు. కాగా నెహ్రా తన ఎంపిక చేసిన జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, యువ బౌలర్ దీపక్ చాహర్‌కు చోటు దక్కక పోవడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్‌కు ఆశిష్ నెహ్రా ఎంచుకున్న భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దీపక్ హుడా
చదవండి: Asia Cup 2022: కోహ్లి, రోహిత్ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment