ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్(PC: IPL/GT)
IPL 2022- Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రాపై ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్‌స్టన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు ఏ పనిచేసినా మనసు పెట్టి అంకితభావంతో పూర్తి చేస్తాడని కితాబిచ్చాడు. నెహ్రాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కిర్‌స్టన్.. ఐపీఎల్‌లోని బెస్ట్ కోచ్‌లలో అతడూ ఒకడంటూ ఆకాశానికెత్తాడు.
ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలోని కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్‌లోనే లీగ్ దశలో టాపర్‌గా నిలిచి.. ఆపై రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లోనూ సత్తా చాటింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి ఎడిషన్‌లోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది.
గుజరాత్ టైటిల్ గెలవడంలో గ్యారీ కిర్‌స్టన్, నెహ్రాదే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐసీసీ వరల్డ్‌కప్-2011 సమయంలో టీమిండియా కోచ్‌గా ఉన్న కిర్‌స్టన్, అప్పటి భారత జట్టులో సభ్యుడైన ఆశిష్ నెహ్రా 2018లో ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్‌గా నెహ్రా బాధ్యతలు స్వీకరిస్తే.. మెంటార్‌గా కిర్‌స్టన్ సేవలు అందించాడు.
ఈ నేపథ్యంలో గ్యారీ కిర్‌స్టన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ నాకు ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరిది సుదీర్ఘ ప్రయాణం. ఆటను అర్థం చేసుకోవడంలో.. అత్యంత ప్రొఫెషనల్‌గా వ్యవహరించడంలో తనకు తానే సాటి. తను మనసు పెట్టి పని చేస్తాడు. కోచ్‌గా కూడా అంతే! ఎల్లప్పుడూ తన జట్టులోని ఆటగాళ్ల గురించి, వాళ్లకు మెలకువలు నేర్పడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
తను ఎప్పుడూ లో ప్రొఫైల్‌లోనే ఉంటాడు. అందరి దృష్టిలో పడాలనుకోవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. అత్యంత నేర్పరులుగా వ్యవహరించే ఐపీఎల్ అత్యుత్తమ కోచ్‌లలో ఆశిష్ నెహ్రా కూడా ఒకడు’’ అని నెహ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు.
చదవండి 👇
IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు!
వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్
Kal ki yeh yaadgar shaam, aap ke pyaar aur support ke naam 🥰😁
— Gujarat Titans (@gujarat_titans) May 31, 2022
Jald lautenge, tab tak khayal rakhna Amdavad 💙#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/IMgH0izYAL
Comments
Please login to add a commentAdd a comment