వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కోచింగ్ స్టాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. టెస్టు జట్టు ప్రధాన కోచ్‌గా ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ జాసన్ గిల్లెస్పీ ఎంపికయ్యాడు.
గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పటికే తన ప్రయణాన్ని ప్రారంభించగా.. వచ్చే నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో గిల్లెస్పీ ప్రస్ధానం మొదలు కానుంది. అయితే కోచ్‌లు మారినప్పటకి పాక్ తల రాత ఏమాత్రం మారలేదు. కిర్‌స్టెన్ నేతృత్వంలోని పాక్ జట్టు టీ20 వరల్డ్‌కప్-2024లో దారుణ ప్రదర్శన కనబరిచింది.
గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాన కోచ్ డేవ్ వాట్‌మోర్ కొత్త హెడ్‌కోచ్‌లు గ్యారీ కిర్‌స్టెన్, జాసన్ గిల్లెస్పీలకు కీలక సూచనలు చేశాడు. పాక్ జట్టును విజయం పథంలో నడిపించడం అంత ఈజీ కాదని వాట్‌మోర్ అభిప్రాయపడ్డాడు.
"ఇప్పటికే పాక్ సెలక్షన్ కమిటీ చాలా మార్పుల చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు వల్ల పాక్ క్రికెట్‌కు ఎంత నష్టం జరుగుతుంతో వేచి చూడాలి. నావరకు నేను ఆదృష్టవంతుడిని. ఎందుకంటే పాక్ జట్టు హెడ్‌కోచ్‌గా నా పదవీకాలాన్ని మొత్తాన్ని పూర్తి చేసే అవకాశం దక్కింది.
ఈ మధ్య కాలంలో పాక్‌కు కోచ్‌లు మారుతునే ఉన్నారు. కొత్త కోచ్‌లకు నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండి తమ పని తాము చేసుకుపోవాలి. ఏదేమైనప్పటకి పాక్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేయడం అంత సులభం కాదు" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్‌మోర్ పేర్కొన్నాడు. కాగా 2012లో పాక్ జట్టుహెడ్ కోచ్‌గా వాట్‌మోర్ పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment