Dav Whatmore
-
పాక్ హెడ్‌కోచ్‌గా అంటే కత్తి మీద సాము లాంటిదే: డేవ్ వాట్మోర్
వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కోచింగ్ స్టాప్ మొత్తాన్ని ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. పాక్ జట్టు పరిమిత ఓవర్ల హెడ్‌కోచ్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ బాధ్యతలు చేపట్టగా.. టెస్టు జట్టు ప్రధాన కోచ్‌గా ఆసీస్ ఫాస్ట్ బౌలింగ్ లెజెండ్ జాసన్ గిల్లెస్పీ ఎంపికయ్యాడు.గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పటికే తన ప్రయణాన్ని ప్రారంభించగా.. వచ్చే నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో గిల్లెస్పీ ప్రస్ధానం మొదలు కానుంది. అయితే కోచ్‌లు మారినప్పటకి పాక్ తల రాత ఏమాత్రం మారలేదు. కిర్‌స్టెన్ నేతృత్వంలోని పాక్ జట్టు టీ20 వరల్డ్‌కప్-2024లో దారుణ ప్రదర్శన కనబరిచింది. గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాక్ జట్టుతో పాటు పీసీబీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాన కోచ్ డేవ్ వాట్మోర్ కొత్త హెడ్‌కోచ్‌లు గ్యారీ కిర్‌స్టెన్, జాసన్ గిల్లెస్పీలకు కీలక సూచనలు చేశాడు. పాక్ జట్టును విజయం పథంలో నడిపించడం అంత ఈజీ కాదని వాట్మోర్ అభిప్రాయపడ్డాడు."ఇప్పటికే పాక్ సెలక్షన్ కమిటీ చాలా మార్పుల చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు వల్ల పాక్ క్రికెట్‌కు ఎంత నష్టం జరుగుతుంతో వేచి చూడాలి. నావరకు నేను ఆదృష్టవంతుడిని. ఎందుకంటే పాక్ జట్టు హెడ్‌కోచ్‌గా నా పదవీకాలాన్ని మొత్తాన్ని పూర్తి చేసే అవకాశం దక్కింది. ఈ మధ్య కాలంలో పాక్‌కు కోచ్‌లు మారుతునే ఉన్నారు. కొత్త కోచ్‌లకు నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండి తమ పని తాము చేసుకుపోవాలి. ఏదేమైనప్పటకి పాక్ జట్టు హెడ్ కోచ్‌గా పనిచేయడం అంత సులభం కాదు" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్మోర్ పేర్కొన్నాడు. కాగా 2012లో పాక్ జట్టుహెడ్ కోచ్‌గా వాట్మోర్ పనిచేశాడు. -
హార్దిక్‌ను ఎందుకలా పిలుస్తారో?: బరోడా మాజీ కోచ్ విమర్శలు
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్మోర్ విమర్శలు గుప్పించాడు. అతడిని బరోడా ఆటగాడని సంబోంధించడం సరికాదన్నాడు.హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడి ఎన్నో ఏళ్లు గడిచిపోయిందని.. అతడికి ఐపీఎల్ వంటి లీగ్‌లపై మాత్రమే శ్రద్ధ ఎక్కువని సెటైర్లు వేశాడు. అయినా తన గురించి ప్రస్తావన వచ్చినపుడు బరోడా ఆల్‌రౌండర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నాడు వాట్మెన్.కాగా భారత వన్డే, టీ20 క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన హార్దిక్ పాండ్యా స్వస్థలం గుజరాత్. తన అన్న కృనాల్ పాండ్యాతో కలిసి బరోడా తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన హార్దిక్.. 2018 తర్వాత మళ్లీ అక్కడ కనిపించలేదు.అయితే, ఇటీవల బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల వల్ల జట్టుకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.అంతేకాదు.. శ్రీలంక పర్యటనకు జట్టును ప్రకటించినపుడు కూడా ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో హార్దిక్ పాండ్యాకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇప్పటికే ఫిట్నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీకి దూరమైన హార్దిక్.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో.. బరోడా జట్టు కోచ్‌గా పనిచేసిన ఆసీస్ మాజీ క్రికెటర్ డేవ్ వాట్మోర్ ఓ పాకిస్తానీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘‘చాలా మంది దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడరు. నేను రెండేళ్ల పాటు బరోడా జట్టుతో ఉన్న సమయంలో పాండ్యా ఒక్కసారి కూడా ఆడలేదు.అయినప్పటికీ తనను బరోడా ఆల్‌రౌండర్ అని పిలుచుకోవడం సరికాదనిస్తుంది. చాలా ఏళ్ల పాటు అతడు ఆ జట్టుకు దూరంగా ఉన్నా ఇంకా అక్కడి ఆటగాడిగా గుర్తించడం ఏమిటో?!ఇటీవల బీసీసీఐ తెచ్చిన నిబంధనలు నాకు నచ్చాయి. రంజీ ట్రోఫీలో అందరూ ఆడాలని.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పింది. 4-డే క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించి విజయవంతమైన శిక్షకుడిగా పేరొందాడు వాట్మోర్. 2021-22, 2022- 23 సీజన్లలో బరోడా కోచ్‌గా సేవలు అందించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టీమిండియా టీ20 సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. వన్డేల్లో మొండిచేయి చూపారు. -
బరోడా క్రికెట్ జట్టు కోచ్‌గా డేవ్ వాట్మోర్
Dav Whatmore: వచ్చే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం బరోడా జట్టు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కోచ్ డేవ్ వాట్‌మోర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి అజిత్ లెలె ధ్రువీకరించారు. 67 ఏళ్ల వాట్మోర్ 1996 వన్డే ప్రపంచకప్ సాధించిన శ్రీలంక జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, సింగపూర్, నేపాల్ జాతీయ జట్లకు... భారత్‌లో కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. చదవండి: IPL 2021: ఐపీఎల్లో టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు.. -
కేరళ కోచ్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్?
చెన్నై:డేవ్ వాట్మోర్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 1996లో శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కోచ్ గా అతనిదే కీలక పాత్ర. ఆ సమయంలో కొత్తగా వచ్చిన ఫీల్డింగ్ నిబంధనలకు సంబంధించి బాగా అధ్యయనం చేసి లంకేయులు వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆ తరువాత వాట్మోర్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆ క్రమంలోనే బంగ్లాదేశ్, పాకిస్తాన్, జింబాబ్వే జట్లకు ప్రధాన కోచ్ గా వాట్మోర్ పనిచేశాడు. అయితే ఆసీస్ కు చెందిన ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు కేరళ రంజీ జట్టుకు కోచ్ గా వ్యవహరించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ జనవరి నెలలో చెన్నైలో కేరళ రంజీ ఆటగాళ్లతో సమావేశమైన వాట్మోర్ వారితో సుదీర్ఘంగా పలు విషయాల్ని చర్చించాడు. దాంతో కేరళ క్రికెట్ అసోసియేషన్ అతన్ని కోచ్ గా ఎంపిక చేసేందుకు ఆసక్తిని కనబరించింది. దీనిలో భాగంగా ఇప్పటికే అతనితో క్రికెట్ అసోసియేషన్ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ నెల 22 వ తేదీన చెన్నైకు రాబోతున్న వాట్మోర్తో మరోసారి కేరళ క్రికెట్ అసోసియేషన్ చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ఆ చర్చలు సఫలమైతే అతను కేరళ రంజీ జట్టుకు కోచ్ గా ఎంపికవుతాడు.