
Dav Whatmore: వచ్చే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం బరోడా జట్టు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కోచ్ డేవ్ వాట్‌మోర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి అజిత్ లెలె ధ్రువీకరించారు. 67 ఏళ్ల వాట్‌మోర్ 1996 వన్డే ప్రపంచకప్ సాధించిన శ్రీలంక జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, సింగపూర్, నేపాల్ జాతీయ జట్లకు... భారత్‌లో కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.
చదవండి: IPL 2021: ఐపీఎల్‌లో టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment