Baroda Cricket Association
-
బరోడా జట్టుకు ఆడనున్న అంబటి రాయుడు
సీనియర్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు దేశవాళీ క్రికెట్లో మరోసారి బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిశిర్ హట్టంగడి ధ్రువీకరించారు. గత సీజన్ వరకు రాయుడు ఆంధ్ర తరఫున ఆడాడు. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, ఆంధ్ర, విదర్భలతో పాటు 2012–14 మధ్య రాయుడు బరోడా తరఫునే బరిలోకి దిగాడు. కాగా గతంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించిన 36 ఏళ్ల రాయుడు.. మరోసారి ఈ జట్టుకు ఆడాలని ఉందని బీసీఏను సంప్రదించిన నేపథ్యంలో ఈ మేరకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. అతడు ప్రొఫెషనల్ కేటగిరీలో ఆడనున్నాడు. ఇక అంబటి రాయుడు టీమిండియాకు 55 వన్డేలు, 6 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2019 మార్చిలో జాతీయ జట్టుకు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? Ravichandran Ashwin: అదే జరిగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్లే! -
బరోడా జట్టు తరపున ఆడనున్న అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు రాబోయే దేశవాళీ సీజన్లో బరోడా జట్టు తరపున ఆడునున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. రాయుడు ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాయుడు తన కెరీర్లో ఇప్పటికే బరోడా తరఫున నాలుగు సీజన్లు ఆడాడు. కాగా జూన్‌లో బరోడా సన్నాహక శిబిరంలో రాయుడు చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది సీజన్లో బరోడా సారథి కృనాల్ పాండ్యాతో విభేదాలు ఏర్పాడిన తర్వాత.. దీపక్ హుడా బరోడా జట్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీపక్ హుడా ప్రస్తుతం రాజస్థాన్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడి స్థానంలో రాయుడును భర్తీ చేయాలని బరోడా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఉమ్రాన్, డీకేలకు అవకాశం -
Krunal Pandya: కృనాల్ పాండ్యా సంచలన నిర్ణయం.. గుడ్‌బై చెప్పేశాడు!
Krunal Pandya Steps Down As Baroda Captain Why Report Says This: టీమిండియా ఆల్‌రౌండర్, బరోడా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బరోడా జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు కృనాల్ బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) అధ్యక్షుడు ప్రణశ్ అమిన్‌కు శుక్రవారం ఇ- మెయిల్ పంపాడు. కాగా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లతో విభేదాలు తలెత్తిన కారణంగానే కృనాల్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం... ‘‘ప్రస్తుత దేశవాళీ సీజన్లో బరోడా కెప్టెన్‌గా కొనసాగబోను. అయితే, సెలక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాను. జట్టు కోసం ఆడతాను. ఆటగాడిగా బరోడా క్రికెట్ కోసం నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాల కోసం నా వంతు కృషి చేస్తాను. ఎల్లప్పుడూ జట్టు మెరుగైన ప్రదర్శన కోసం పాటుపడతాను’’అని కృనాల్ పాండ్యా మెయిల్లో పేర్కొన్నాడు. కాగా ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ ట్రోఫీలో కృనాల్ సారథ్యంలోని బరోడా జట్టు దారుణంగా విఫలమైంది. ఐదింట కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి గ్రూపు-బిలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఆటగాడిగా కూడా కృనాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టోర్నీ మొత్తంలో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. 5.94 ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు ఎంపిక విషయంలో కృనాల్ తనకు నచ్చిన ఆటగాళ్ల వైపే మొగ్గు చూపాడంటూ ఆరోపణలు వచ్చాయని బీసీఏ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఓ ఆటగాడు సెలక్టర్లతో వాదనకు దిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కృనాల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పగా.. అతడి స్థానంలో బీసీఏ కేదార్ దేవ్‌ధర్‌కు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది తమిళనాడు ఈ దేశవాళీ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో కర్ణాటకను ఓడించి మూడోసారి ట్రోఫీని గెలిచింది. ఇక కృనాల్ విషయానికొస్తే.. టీ20ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు... ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో వన్డేల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: సూపర్ భరత్... సాహా స్థానంలో వచ్చీరాగానే.. -
బరోడా క్రికెట్ జట్టు కోచ్‌గా డేవ్ వాట్మోర్
Dav Whatmore: వచ్చే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం బరోడా జట్టు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కోచ్ డేవ్ వాట్‌మోర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి అజిత్ లెలె ధ్రువీకరించారు. 67 ఏళ్ల వాట్మోర్ 1996 వన్డే ప్రపంచకప్ సాధించిన శ్రీలంక జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, సింగపూర్, నేపాల్ జాతీయ జట్లకు... భారత్‌లో కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. చదవండి: IPL 2021: ఐపీఎల్లో టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు.. -
కెప్టెన్‌తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్
ఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభానికి ముందే బరోడా టీమ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆదివారం నుంచి టోర్నీ ప్రారంభం అవుతుండగా జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా..కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. బరోడా టీమ్‌కి కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈ టీమ్‌కి కెప్టెన్‌గా పనిచేసిన దీపక్ హుడా ప్రస్తుతం వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నాడు.కాగా క్యాంప్ నుంచి వెళ్లిన అనంతరం తాను టీమ్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని దీపక్ హుడా ఈ మెయిల్ ద్వారా బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు వివరించాడు. (చదవండి: బుమ్రా చేసిన పనికి షాక్ తిన్న అంపైర్) 'ఇటీవల జరిగిన టీమ్ సమావేశాల్లో పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ కృనాల్ పాండ్యా దూషిస్తున్నాడు. తాను ఒక సీనియర్ ఆటగాడినేనని.. భారత్ జట్టుతో పాటు ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాను. గతంలో ఇదే బరోడా జట్టకు కెప్టెన్‌గా పనిచేసిన నేను ఇప్పుడు వైస్ కెప్టెన్ హోదాలో ఏదైనా సలహా ఇచ్చినా కృనాల్ దానిని స్వీకరించడం లేదు. పైగా జట్టు సహచరుల ముందే నన్ను దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గతంలో ఎన్నో జట్లకు ఆడాను.. ఒక ఆటగాడిగా చాలా మంది కెప్టెన్సీలో పనిచేశాను.. కానీ కృనాల్ పాండ్యా తరహా వేధింపులు ఎక్కడా ఎదుర్కోలేదు. కేవలం కృనాల్ బ్యాడ్ బిహేవియర్ కారణంగానే టీమ్ క్యాంప్ నుంచి బయటికి వెళ్లిపోయానంటూ ' దీపక్ హుడా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వీరిద్దరి గొడవపై ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా బరోడా టీమ్ మేనేజర్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ కోరింది. కృనాల్ పాండ్యా టీమిండియాకి ఆడాడు. 2018లో భారత్ తరఫున టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకూ 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు దీపక్ హుడా భారత్ జట్టులోకి 2017-18లో భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున కృనాల్ పాండ్యా ఆడుతుండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి ఐపీఎల్ 2020 సీజన్లో దీపక్ హుడా ఆడాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో- సెక్యూర్ వాతావరణంలో ఈ ట్రోఫీని బీసీసీఐ నిర్వహించనుంది. ముస్తాక్ అలీ ట్రోపీలో 38 జట్లు క్వారంటైన్లో ఉండి బయో బబుల్‌లోకి వచ్చాయి. కృనాల్‌తో గొడవ కారణంగా క్యాంప్ నుంచి వెళ్లిపోయిన దీపక్ హుడా మళ్లీ జట్టులోకి రావాలంటే.. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కానుంది.(చదవండి: ఒకవేళ అక్కడ సచిన్ ఉంటే పరిస్థితి ఏంటి?) -
సస్పెన్షన్ తొలగించినా కోచ్‌గా నియమించలేదు
వడోదరా: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ అతుల్ బెదాడేపై విధించిన సస్పెన్షన్‌ను బరోడా క్రికెట్ సంఘం (బీసీఏ) తొలగించింది. అయితే సీనియర్ మహిళా జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి అతన్ని తప్పించింది. ఆరోపణల నేపథ్యంలో అతనిపై ప్రాథమిక విచారణ చేశాం. ఉన్నతస్థాయి కమిటీ... అతనిపై వచ్చిన ఆరోపణలు, జరిగిన విచారణపై చర్చించింది. అనంతరం ఈ సమస్యకు ముగింపు పలికిన కమిటీ బెదాడేపై సస్పెన్షన్‌ను తొలగించింది. అయితే సున్నితమైన ఈ అంశంపై వివాదం రేపకూడదన్న ఉద్దేశంతో మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా అతన్ని తప్పించింది’ అని బీసీఏ కార్యదర్శి అజిత్ లెలె తెలిపారు. త్వరలోనే బరోడా మహిళా జట్టుకు అంజూ జైన్‌ను హెడ్ కోచ్‌గా నియమించనున్నారు. (ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే) -
బ్లాంక్ చెక్ ఇచ్చి ఔదార్యం చాటుకున్న పాండ్యా!
వడోదర : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ జాకోబ్ మార్టిన్(46) కుటుంబానికి సహాయం చేసేందుకు భారత ఆటగాళ్లు ముందుకు వస్తున్నారు. టీమిండియా యువ ఆల్‌రౌండర్, బరోడా జట్టు ఆటగాడు కృనాల్ పాండ్యా మార్టిన్ చికిత్స కోసం ఏకంగా బ్లాంక్ చెక్ రాసిచ్చి ఔదార్యం చాటుకున్నాడు. బరోడా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మార్టిన్.. గతేడాది డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మార్టిన్ ఊపిరితిత్తులు, లివర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అతడు వడోదరలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకుగానూ రోజుకు 70 వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. జాకోబ్ మార్టిన్ కాగా మార్టిన్ చికిత్స కోసం ఇప్పటికే బీసీసీఐ 5 లక్షల రూపాయలు అందించగా.. బరోడా క్రికెట్ అసోసియేషన్ 3 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. ఇక టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీతో పాటుగా జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా మార్టిన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మార్టిన్ పరిస్థితి గురించి తెలుసుకున్న కృనాల్ పాండ్యా... ‘ఆయన చికిత్స కోసం ఈ బ్లాంక్ చెక్ రాసిస్తున్నా. దయచేసి లక్ష రూపాయలకు తగ్గకుండా చెక్‌పై రాయండి’ అని బరోడా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంజయ్ పటేల్‌తో వ్యాఖ్యానించినట్లుగా ‘ది టెలిగ్రాఫ్’ పేర్కొంది. ఇక బరోడా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకోబ్ మార్టిన్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. మొత్తం పది వన్డేలు ఆడిన మార్టిన్ 158 పరుగులు చేశాడు. -
మీరు ఒంటరి వాళ్లు కాదు : గంగూలీ
అహ్మదాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ జాకోబ్ మార్టిన్(46) కుటుంబానికి భారత ఆటగాళ్లు అండగా నిలిచారు. కష్టకాలంలో మార్టిన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గతేడాది డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మార్టిన్ ఊపిరితిత్తులు, లివర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అతడు వడోదరలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తమకు సహాయం చేయాల్సిందిగా మార్టిన్ భార్య భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ 5 లక్షల రూపాయలు అందించగా.. బరోడా క్రికెట్ అసోసియేషన్ 3 లక్షల రూపాయల సాయం అందించింది. కాగా మార్టిన్ పరిస్థితి గురించి తెలుసుకున్న టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘నేను, మార్టిన్ ఒకప్పుడు టీమ్మేట్స్. తను చాలా కామ్‌గా, రిజర్వ్డ్గా ఉండేవాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతడు తొందరగా కోలుకోవాలి. మీరు ఒంటరి వాళ్లు కారు. మేమంతా మీకు తోడున్నాం’ అంటూ మార్టిన్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. గంగూలీతో పాటుగా జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా మార్టిన్‌కు సహాయం చేసేందుకు ముందుకువచ్చారని బరోడా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సంజయ్ పటేల్ తెలిపారు. ఇక బరోడా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకోబ్ మార్టిన్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. మొత్తం పది వన్డేలు ఆడిన మార్టిన్ 158 పరుగులు చేశాడు. -
సలాం కొట్టలేదని కెప్టెన్సీ పీకేసి.. జట్టు నుంచి తొలగించి!
సాక్షి, స్పోర్ట్స్ : బాస్ లకు సలాం కొట్టకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను కదిలిస్తే తెలుస్తోంది. అందుకు పఠాన్ తాజాగా ఎదుర్కొన్న పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తాయి. 'గుడ్ మార్నింగ్ లు, బాస్ కు అవునంటూ ఊ కొట్టలేదు. దీంతో బాస్ మీకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటాడు. అయినా ఏం బాధపడొద్దు. నీ పనిని చేసుకుంటూపోవాలి' అంటూ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ తన ఆవేదనను వెల్లగక్కాడు. అసలేమైందంటే.. బరోడా రంజీ జట్టు కెప్టెన్ గా ఉన్న ఇర్ఫాన్ పఠాన్ రెండు మ్యాచ్ ల్లో బాధ్యతలు నిర్వహించాడు. మూడో మ్యాచ్ కు ముందు పఠాన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్సీ తీసేయడంతో పాటు త్రిపురతో జరగనున్న మూడో మ్యాచ్ తుది జట్టు నుంచి పఠాన్ ను తప్పించారు. మధ్యప్రదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 80 పరుగులు చేయడంతో పాటు ఓవరాల్ గా 2 వికెట్లు తీశాడు. గుడ్ మార్నింగ్ చెప్పలేదని, ఆయన మాటలకు ఎప్పుడూ తల ఊపని కారణంగా బాస్ నాకు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నాడంటూ ట్వీట్లో పేర్కొన్నాడు ఇర్ఫాన్. గ్రూపు సి-లో చివరి స్థానంలో ఉన్న బరోడాకు దీపక్ హుడా నూతన కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. పఠాన్ నువ్వు పోరాడుతూనే ఉండాలని సుబోజిట్ అనే యూజర్ కామెంట్ చేయగా, 'నా గుండె పగిలింది. నీ మీద మాకు నమ్మకం ఉంది. ఎప్పటికీ నువ్వే మా హీరో' అంటూ లోకేశ్ అనే మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. Not wishing Good Morning & not being a YES man to ur boss can go against u...but don’t bother,keep doing ur work #keepfighting #keeptrying — Irfan Pathan (@IrfanPathan) 29 October 2017 -
సంజయ్ పటేల్‌కు షాక్
బరోడా: బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్‌కు తమ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న పటేల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆదివారం జరిగిన బీసీఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పటేల్‌తో పాటు మరో ముగ్గురిపై కూడా వేటు పడింది. ఇటీవల జరిగిన బీసీఏ ఎన్నికల్లో చిరాయు అమిన్ గ్రూపు మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. అయితే సంజయ్ పటేల్ సంయుక్త కార్యదర్శిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం పటేల్‌తో పాటు మరో నలుగురు కమిటీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఉద్వాసన పలకాలని డిమాండ్లు వినిపించాయి. ఓ సమావేశంలో కమిటీ సభ్యులు ఇదే అంశాన్ని లేవనెత్తగా బీసీఏ అధ్యక్షుడు సమర్జిత్ గైక్వాడ్ తన వీటో పవర్‌ను ఉపయోగించి అడ్డుకున్నారు. అయితే ఈ విషయంలో అధ్యక్షుడికి ఎక్కువ అధికారాలున్నాయా.. కమిటీకా.. తేలేందుకు లీగల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. మేనేజింగ్ కమిటీకి అనుకూలంగా లీగల్ అభిప్రాయం రావడంతో సంజయ్ పటేల్‌ని తొలగించారు.