సాక్షి, స్పోర్ట్స్ : బాస్ లకు సలాం కొట్టకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను కదిలిస్తే తెలుస్తోంది. అందుకు పఠాన్ తాజాగా ఎదుర్కొన్న పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తాయి. 'గుడ్ మార్నింగ్ లు, బాస్ కు అవునంటూ ఊ కొట్టలేదు. దీంతో బాస్ మీకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటాడు. అయినా ఏం బాధపడొద్దు. నీ పనిని చేసుకుంటూపోవాలి' అంటూ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ తన ఆవేదనను వెల్లగక్కాడు.
అసలేమైందంటే..
బరోడా రంజీ జట్టు కెప్టెన్ గా ఉన్న ఇర్ఫాన్ పఠాన్ రెండు మ్యాచ్ ల్లో బాధ్యతలు నిర్వహించాడు. మూడో మ్యాచ్ కు ముందు పఠాన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్సీ తీసేయడంతో పాటు త్రిపురతో జరగనున్న మూడో మ్యాచ్ తుది జట్టు నుంచి పఠాన్ ను తప్పించారు. మధ్యప్రదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 80 పరుగులు చేయడంతో పాటు ఓవరాల్ గా 2 వికెట్లు తీశాడు. గుడ్ మార్నింగ్ చెప్పలేదని, ఆయన మాటలకు ఎప్పుడూ తల ఊపని కారణంగా బాస్ నాకు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నాడంటూ ట్వీట్లో పేర్కొన్నాడు ఇర్ఫాన్.
గ్రూపు సి-లో చివరి స్థానంలో ఉన్న బరోడాకు దీపక్ హుడా నూతన కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. పఠాన్ నువ్వు పోరాడుతూనే ఉండాలని సుబోజిట్ అనే యూజర్ కామెంట్ చేయగా, 'నా గుండె పగిలింది. నీ మీద మాకు నమ్మకం ఉంది. ఎప్పటికీ నువ్వే మా హీరో' అంటూ లోకేశ్ అనే మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
Not wishing Good Morning & not being a YES man to ur boss can go against u...but don’t bother,keep doing ur work #keepfighting #keeptrying
— Irfan Pathan (@IrfanPathan) 29 October 2017
Comments
Please login to add a commentAdd a comment