Ambati Rayudu Returns To Baroda Team In Upcoming Domestic Cricket, Details Inside - Sakshi
Sakshi News home page

Ambati Rayudu: బరోడా జట్టుకు ఆడనున్న అంబటి రాయుడు

Published Thu, Jul 14 2022 10:23 AM | Last Updated on Thu, Jul 14 2022 11:13 AM

Ambati Rayudu Returns To Baroda Team In Domestic Cricket - Sakshi

సీనియర్‌ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు దేశవాళీ క్రికెట్‌లో మరోసారి బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌(బీసీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శిశిర్‌ హట్టంగడి ధ్రువీకరించారు.  గత సీజన్‌ వరకు రాయుడు ఆంధ్ర తరఫున ఆడాడు.

దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్, ఆంధ్ర, విదర్భలతో పాటు 2012–14 మధ్య రాయుడు బరోడా తరఫునే బరిలోకి దిగాడు. కాగా గతంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించిన 36 ఏళ్ల రాయుడు.. మరోసారి ఈ జట్టుకు ఆడాలని ఉందని బీసీఏను సంప్రదించిన నేపథ్యంలో ఈ మేరకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. అతడు ప్రొఫెషనల్‌ కేటగిరీలో ఆడనున్నాడు.

ఇక అంబటి రాయుడు టీమిండియాకు 55 వన్డేలు, 6 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2019 మార్చిలో జాతీయ జట్టుకు ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2022లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్‌ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌! ప్రపంచకప్‌ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా?
Ravichandran Ashwin: అదే జరిగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement