
టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు రాబోయే దేశవాళీ సీజన్‌లో బరోడా జట్టు తరపున ఆడునున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. రాయుడు ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాయుడు తన కెరీర్‌లో ఇప్పటికే బరోడా తరఫున నాలుగు సీజన్‌లు ఆడాడు. కాగా జూన్‌లో బరోడా సన్నాహక శిబిరంలో రాయుడు చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక గతేడాది సీజన్‌లో బరోడా సారథి కృనాల్ పాండ్యాతో విభేదాలు ఏర్పాడిన తర్వాత.. దీపక్ హుడా బరోడా జట్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీపక్ హుడా ప్రస్తుతం రాజస్థాన్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడి స్థానంలో రాయుడును భర్తీ చేయాలని బరోడా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది.
చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఉమ్రాన్, డీకేలకు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment