పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి ఆసీస్ దిగ్గజం జాసన్ గిల్లెస్పీ వైదొలిగిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు గిల్లెస్పీ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అయితే తాజాగా తన రాజీనామాపై గిల్లెస్పీ స్పందించాడు. అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను తన పదవి నుంచి పీసీబీ తప్పించడంతో తన కూడా వైదొలగాల్సి వచ్చిందని గిల్లెస్పీ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా ప్రపంచంలో పీసీబీ లాంటి క్రికెట్ బోర్డును తనకెక్కడా చూడలేదని గిల్లెస్పీ విమర్శలు గుప్పించాడు. కాగా హెడ్ కోచ్ గ్యారీ కిరెస్టన్ వైదొలిగిన అనంతరంహెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీని పీసీబీ నియమించింది. అతడి నేతృత్వంలోనే పాకిస్తాన్ క్రికెట్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది.
"పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి క్రికెట్ బోర్డును నేను ఇప్పటివరకు చూడలేదు. ఏ హెడ్ కోచ్ అయినా తమ బోర్డుతో మంచి సంబంధాలు కలిగిండాలని భావిస్తాడు. కానీ పీసీబీ తీరు మాత్రం అందుకు భిన్నం. వారికి నాకు సమన్వయ లోపం ఏర్పడింది. తుది జట్టు ఎంపిక విషయంలో కూడా నాకు పూర్తి స్వేఛ్చ లేదు.
అందులో కూడా పీసీబీ జోక్యం చేసుకుంటుంది. సెలక్టర్లతో కూడా నాకు సరైన కమ్యూనికేషన్ లేదు. సీనియర్ అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తప్పించారు. ఇదొక్కటే కాదు గత కొన్ని నెలలగా వారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
అయినప్పటికి వారితో కొనసాగాను. ఎప్పుడైతే నీల్స్‌ను నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా తొలిగించారో అప్పుడే నేను కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను" అని గిల్లెస్పీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment