Gary Kirsten Becoming Likely to England Coach for Test Cricket - Sakshi
Sakshi News home page

Gary Kirsten: ఇంగ్లండ్‌ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్‌!

Published Fri, Dec 31 2021 11:20 AM | Last Updated on Fri, Dec 31 2021 12:56 PM

Gary Kirsten shows interest in becoming Englands coach in Test cricket - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఘోరమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు టెస్ట్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు కోచ్‌ సిల్వర్‌ వుడ్‌, కెప్టెన్‌ జో రూట్‌పైన తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఓటమికు బాధ్యతగా వారి పదవులకు రాజీనామా చేయాలని ఇంగ్లండ్‌ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలచిన భారత జట్టు​కు కిర్‌స్టన్‌ కోచ్‌గా వ్యవహరించాడు. తర్వాత టీమిండియా కోచ్‌ బాధ్యతలు నుంచి తప్పుకున్నకిర్‌స్టన్‌.. 2011 నుంచి 2013 వరకు దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

కాగా కోచ్‌గా కిర్‌స్టన్ అద్భుతమైన రికార్డులను కలిగిఉన్నాడు. "ఇంగ్లండ్ టెస్ట్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎందుకంటే ఇది గొప్ప గౌరవం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే నేను రెండు సార్లు ఈ బాధ్యతలను చేపట్టాను. అయితే ప్రస్తుతం అన్ని ఫార్మాట్‌ల్లో కోచ్‌గా పని చేయాలని నేను అనుకోవడం లేదు. అన్ని ఫార్మాట్‌లుకు ఒకే కోచ్‌ కాకుండా, వేర్వేరుగా ఉండేటట్లు అంతర్జాతీయ క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇంగ్లండ్‌ జట్టుకు వన్డే, టెస్ట్‌ ఫార్మాట్‌ల్లో కోచ్‌గా పని చేయాలి అని ఉంది. కానీ ఇప్పటికే వన్డేల్లో ఇంగ్లండ్‌ అధ్బుతంగా రాణిస్తుంది. వన్డేల్లో ఇంగ్లండ్‌ అత్యత్తుమైన జట్టు. ఇంగ్లండ్‌ వన్డే కోచింగ్‌ స్టాఫ్‌ అద్భుతమైనది. ఒకే వేళ కోచ్‌గా  బాధ్యతలు అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తాను" అని  కిర్‌స్టన్ పేర్కొన్నాడు.

చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement