వెటోరీనే హెడ్‌ కోచ్‌.. మెంటర్‌గా కిర్‌స్టన్‌ | Gary Kirsten Joins RCB Coaching Setup, Vettori to Remain Head Coach | Sakshi
Sakshi News home page

వెటోరీనే హెడ్‌ కోచ్‌.. మెంటర్‌గా కిర్‌స్టన్‌

Published Tue, Jan 2 2018 1:15 PM | Last Updated on Tue, Jan 2 2018 1:17 PM

Gary Kirsten Joins RCB Coaching Setup, Vettori to Remain Head Coach - Sakshi

బెంగళూరు: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా బెంగళూరు రాయల్స్‌ చాలెంజర్స్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా, సలహాదారు(మెంటర్‌)గా గ్యారీ కిర్‌స్టన్‌ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో హాబర్ట్‌ హరికేన్స్‌ జట్టుకు గ్యారీ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో భారత జట్టుకు కోచ్‌గా వ్యహరించిన గ్యారీ.. మూడు ఐపీఎల్‌ సీజన్లలో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు సైతం కోచ్‌గా సేవలందించాడు. కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీకి బ్యాటింగ్‌ కోచ్‌గా, మెంటర్‌గా కిర్‌స్టన్‌ను ఎంపిక చేశారు. అయితే ఇక్కడ ఆర్సీబీ ప్రధాన కోచ్‌గా డానియల్‌ వెటోరీనే కొనసాగనున్నాడు. మరొకవైపు ఆర్సీబీ బౌలింగ్‌ కోచ్‌గా ఆశిష్‌ నెహ్రాను వ్యవహరించనున్నాడు. ఈనెల 27, 28వ తేదీన ఐపీఎల్‌ ఆటగాళ్ల కోసం బెంగళూరులో వేలం జరుగనుంది.

ఆర్సీబీకి తిరిగి హెడ్‌ కోచ్‌గా ఎంపికైన వెటోరీ మాట్లాడుతూ.. గ్యారీ కిరస్టన్‌, ఆశిష్‌ నెహ్రాలతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ ఇద్దరి అనుభవం జట్టుకు మరింతగా కలిసి వస్తుందని వెటోరీ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement