ఢిల్లీ: ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కొత్త ఇన్నింగ్స్ ను ఆరంభించడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి నేతృత్వం వహించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సలహాదారుగా(మెంటర్) వ్యవహరించనున్నట్టు సమాచారం. తన రిటైర్మెంట్ తర్వాత భారత్- శ్రీలంక సిరీస్‌లో నెహ్రా కామెంటరీ బాక్స్‌లో కనిపించాడు. తనకు అత్యంత సన్నిహితుడైన వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి వ్యాఖ్యానాన్ని పంచుకున్నాడు. అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్‌కు మెంటర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర‍్చుకున్నట్ల విశ్వసనీయం సమాచారం.
బెంగళూరు మెంటర్‌గా నెహ్రా డీల్ కుదుర్చుకున్నట్టు ముంబై మిర్రర్ ఒక కథనాన్ని ప్రచురించింది. బెంగళూరు కోచ్‌గా బాధ్య తలు నిర్వహించిన దక్షిణాఫ్రికా మాజీ పేసర్ అలెన్ డొనాల్డ్ కాంట్రాక్ట్ గడువు ముగియడంతో అతని స్థానంలో నెహ్రా వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంది. 1999లో మొహ్మద్ అజహరుద్దీన్ సారథ్యంలో భారత్ జట్టులో అరంగేట్రం చేసిన నెహ్రా.. ఇటీవల న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన టీ 20 తరువాత క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అతని కెరీర్‌లో 17 టెస్టులు మాత‍్రమే ఆడిన నెహ్రా 44 వికెట్లు తీశాడు. ఇక 120 వన్డేల్లో 157 వికెట్లు, 27 టీ 20ల్లో 34 వికెట్లు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment