
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన అంశం మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్. అయితే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ధోనికి ఎప్పుడు రిటైర్ కావాలో ఒకరు చెప్పాల్సిన పని లేదని భారత మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఆటకు తాను అనుకున్నప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే హక్కు ధోనికి ఉంది. అతను సాధించిన ఘనతలతో ఆ స్థాయికి చేరుకున్నాడు రిటైరయ్యే సమయం వచ్చిందంటూ అతనికి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అతనో అద్భుతమైన క్రికెటర్. ధోని మేధస్సు, శాంతం, శక్తి, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఆధునిక యుగం దిగ్గజ క్రీడాకారుల్లో ధోని ఒకరు’ అని కిర్‌స్టెన్ ధోనికి కితాబిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment