
'యువరాజ్ కు కెప్టెన్సీ అనుమానమే'
న్యూఢిల్లీ: భారీ మొత్తం చెల్లించి కొన్నంత మాత్రానా యువరాజ్ సింగ్ కు కెప్టెన్సీ ఇవ్వాలని తాము భావించడం లేదని ఢిల్లీ డెర్ డెవిల్స్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ అన్నాడు. యువరాజ్ కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించేది అనుమానమేనని చెప్పాడు. తాజాగా నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో రూ. 16 కోట్ల భారీ మొత్తానికి యువీని ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా యువరాజ్ నిలిచాడు.
కాగా కిర్ స్టెన్ నిర్దేశకత్వంలో ఆడడానికి ఆసక్తితో ఉన్నానని యువీ చెప్పాడు. భారత జట్టుకు కిర్ స్టెన్ కోచ్ గా ఉన్నప్పుడు తాను బాగా ఆడానని, ఈసారి ఢిల్లీ తరపున ఐపీఎల్ లో రాణిస్తానన్న నమ్మకాన్ని యువరాజ్ వ్యక్తం చేశాడు.