పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆజం నిరాశపరిచాడు. తొలి టెస్టులో దారుణ ప్రదర్శన కనబరిచిన బాబర్.. రెండో టెస్టులోనూ అదే ఆటతీరును కనబరిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన ఆజం, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. టెస్టు క్రికెట్‌లో అయితే బాబర్ హాఫ్ సెంచరీ సాధించి 20 నెలలపైనే అయింది. అతడు చివరగా టెస్టుల్లో డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై ఫిఫ్టీ స్కోర్లు సాధించాడు. ఈ క్రమంలో బాబర్ ఆజంపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది.
అయితే వరుసగా విఫలమవుతుండడంతో టెస్టు క్రికెట్‌కు బాబర్ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు ఓ రిటైర్మెంట్ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాబర్‌కు ఇదే చివరి టెస్టు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను పాకిస్తాన్ హెడ్‌కోచ్ జాసన్ గిల్లెస్పీ ఖండించాడు. బాబర్‌కు సపోర్ట్‌గా గిల్లెస్పీ నిలిచాడు.
"బాబర్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్. బాబర్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని భావిస్తున్నాను. త్వరలోనే అతడి నుంచి మనం ఓ భారీ ఇన్నింగ్స్ చూస్తాము. నాకు ఆ నమ్మకం ఉంది. అతడు తన లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోవడంలో విఫలమయ్యాడు అని" 4వ రోజు ఆట అనంతరం గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.
చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు
Comments
Please login to add a commentAdd a comment