స్టువర్ట్ బ్రాడ్
హెడింగ్లే: పాకిస్తాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ (414)ను అధిగమించాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అసాద్ షఫిక్ వికెట్ పడగొట్టిన బ్రాడ్ 415 వికెట్లతో శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్‌తో సమంగా నిలిచాడు. ఇక ఈ జాబితాలో 800 వికెట్లతో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ తొలి స్థానంలో ఉండగా.. షేన్ వార్న్(708), అనిల్ కుంబ్లే(619), మెక్ గ్రాత్(563)లు తరువాతి స్థానంలో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జేమ్స్ అండర్సన్ (540) తరువాత ఈ జాబితాలో స్టువర్ట్ బ్రాడే ఉన్నాడు.
ఓటమి దిశగా పాక్..
తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తడబాటుకు గురైంది. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ విఫలమవడంతో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 363 పరుగులకు ఆలౌటవ్వడంతో ఆ జట్టుకు 189 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంకా పాక్ 84 పరుగుల వెనుకంజలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment